సెమీస్‌లో సాకేత్, విష్ణు | Sanket,vishnu entered in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్, విష్ణు

Published Fri, Mar 7 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

Sanket,vishnu entered in semi finals

ఐటీఎఫ్ టోర్నమెంట్
 భీమవరం, న్యూస్‌లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సాకేత్ 6-2, 6-3తో చంద్రిల్ సూద్ (భారత్)పై గెలుపొందగా, విష్ణువర్ధన్ 7-6(4), 6-4తో రెండో సీడ్ జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)పై అద్భుత విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్‌లో సనమ్ సింగ్ 6-1, 6-1తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్‌పై నెగ్గగా, శ్రీరామ్ బాలాజీ 6-1, 6-4తో కో సుజుకి (జపాన్)ను ఓడించి సెమీస్‌కు చేరాడు.

 
 సెమీఫైనల్లో సాకేత్.. బాలాజీతో, విష్ణు.. సనమ్‌సింగ్‌తో తలపడనున్నారు. ఇక డబుల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి టైటిల్ కోసం బాలాజీ-రంజిత్ మురుగేశన్ జంటతో అమీ తుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-7(5), 6-2 (10-7)తో విష్ణువర్ధన్-నెదున్‌చెజియాన్ జోడిపై గెలుపొందింది. బాలాజీ-మురుగేశన్ జోడి 6-4, 6-3తో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)-గాబ్రియెల్ ట్రుజిలోసోలర్ (స్పెయిన్) జంటను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement