bheema varam
-
భీమవరం పంచారామక్షేత్రంలో కార్తీకమాసం సందడి
-
భీమవరంలో రెచ్చిపోయిన దొంగలు
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పది కాసుల బంగారం, వెండి, ఇత్తడి బిందెలు, రూ. లక్ష నగదును చోరీ చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్నిప్రమాదం
భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా): షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ షాపులో అగ్ని ప్రమాదం సంభవిచింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ఒక ఎలక్ట్రికల్ దుకాణానికి చెందిన గోదాంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు ఈ సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ. 40లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. -
సింగిల్స్ చాంప్ సాకేత్
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్‌లైన్: డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని సింగిల్స్‌లోనూ మెరిశాడు. శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఈ వైజాగ్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-3, 6-1తో రెండో సీడ్ సనమ్ సింగ్ (భారత్)ను ఓడించాడు. 10 ఏస్‌లతో అదరగొట్టిన సాకేత్ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. డబుల్స్‌లో తన భాగస్వామిగా ఉన్న సనమ్ సింగ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు సనమ్ సింగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 2012లో ఇదే టోర్నీ ఫైనల్లో సనమ్ సింగ్ చేతిలో మూడు సెట్ల పోరాటంలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న సాకేత్ ఈ ఏడాది మాత్రం అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి బదులు తీర్చుకోవడం విశేషం. భారత డేవిస్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న సాకేత్ కెరీర్లో ఇది 9వ ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్. -
సెమీస్‌లో సాకేత్, విష్ణు
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్‌లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సాకేత్ 6-2, 6-3తో చంద్రిల్ సూద్ (భారత్)పై గెలుపొందగా, విష్ణువర్ధన్ 7-6(4), 6-4తో రెండో సీడ్ జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)పై అద్భుత విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్‌లో సనమ్ సింగ్ 6-1, 6-1తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్‌పై నెగ్గగా, శ్రీరామ్ బాలాజీ 6-1, 6-4తో కో సుజుకి (జపాన్)ను ఓడించి సెమీస్‌కు చేరాడు. సెమీఫైనల్లో సాకేత్.. బాలాజీతో, విష్ణు.. సనమ్సింగ్తో తలపడనున్నారు. ఇక డబుల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి టైటిల్ కోసం బాలాజీ-రంజిత్ మురుగేశన్ జంటతో అమీ తుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-7(5), 6-2 (10-7)తో విష్ణువర్ధన్-నెదున్‌చెజియాన్ జోడిపై గెలుపొందింది. బాలాజీ-మురుగేశన్ జోడి 6-4, 6-3తో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)-గాబ్రియెల్ ట్రుజిలోసోలర్ (స్పెయిన్) జంటను ఓడించింది. -
విభజన తట్టుకోలేక ఆగిన గుండె
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : రేపు కొడుకు పెళ్లి.. ఇంతలోనే ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూనే రాష్ట్రం ఏమైపోతుందోనని ఆ తండ్రి తల్లడిల్లుతూనే ఉన్నాడు. లోక్‌సభలో రాష్ర్ట విభజన జరిగిపోయింది. కనీసం రాజ్యసభలోనైనా బిల్లు ఆగకపోతుందా అన్న ఆత్రుత చివరకు కన్న కొడుకు పెళ్లి కూడా చూడకుండానే ఆ తండ్రి గుండె ఆగేలా చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సుంకర పద్దయ్య వీధిలో నివాసముంటున్న ఆరిశ కొండలరావు (53) ఎం అండ్ ఎం వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం అతనిది. అద్దె ఇంట్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం కొండలరావు కుమారుడు వెంకట సుధీర్ వివాహం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం తిమ్మాపురంలో జరగాల్సి ఉంది. ఉదయమే కొండలరావు కుటుంబ సభ్యులు, బంధువులు తిమ్మాపురం వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం పెళ్లి పనులు చేసుకుని రాజ్యసభలో బిల్లు ఏమవుతుందోననే ఆత్రుతతో టీవీ పెట్టాడు. అక్కడ కూడా విభజన బిల్లు ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కొండలరావు గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళదామనుకునే లోగానే కన్నుమూశాడు. పెళ్లి జరగాల్సిన ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. కొండలరావు మృతితో అతని భార్య, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. -
పింఛన్.. బాంచెన్
ఈ బాలిక పేరు కమతం శ్రీవాణి. ఊరు భీమవరం. అక్కడి బధిరుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆమెకు పుట్టుకతోనే మాటలు రావు. చెవుడు కూడా ఉంది. ఈమె తండ్రి శ్రీనివాస్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీవాణికి నూరు శాతం వైకల్యం ఉందని 2008 వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పటినుంచి వికలాంగుల కోటాలో రూ.500 పింఛన్ కోసం ఆ తండ్రి కుమార్తెను వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. గురువారం తణుకు ఏరియూ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం శిబిరానికి శ్రీవాణిని మరోసారి తీసుకొచ్చాడు. ‘అధికారులూ మాపై దయుంచండి. నా బిడ్డకు పింఛన్ ఇచ్చి ఆదుకోండ’ని అభ్యర్థించాడు. పరీక్షలు చేసిన వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి పంపించివేశారు. పింఛన్.. బాంచెన్ బాలిక తండ్రి శ్రీనివాస్‌ను ‘న్యూస్‌లైన్’ పలకరించగా... ‘మా పాప పింఛన్ కోసం అధికారుల చుట్టూ ఐదేళ్లుగా తిరుగుతున్నాను. మొదట్లో మాకు తెల్లరేషన్ కార్డు ఉంది. కార్డు ఉన్నంతసేపూ పింఛన్ ఇవ్వలేదు. తర్వాత కార్డు తీసేశారు. కార్డు లేకపోతే పింఛన్ రాదన్నారు. అధికారుల కాళ్లావేళ్లా పడ్డాను. ఈ మధ్యనే రచ్చబండలో తాత్కాలిక కార్డు వచ్చింది. దాన్ని తీసుకుని మళ్లీ ఇలా తిరుగుతున్నాను. ఎన్నోసార్లు ప్రజావాణికి వెళ్లి కలెక్టర్‌ను కూడా ఆశ్రయించాను. అయినా ఫలితం లేదు. తిరగడానికి ఖర్చులైతే అవుతున్నాయ్.. ఈసారైనా పింఛన్ ఇస్తారో లేదోమరి. 500 పింఛన్‌ను వెరుు్య రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వెరుు్య మాట దేవుడెరుగు.. కనీసం ఐదొందలు ఇచ్చినా మాకు మేలు జరుగుతుంది’ అంటూ అధికారులకు చెయ్యెత్తి మొక్కాడు. - న్యూస్‌లైన్/తణుకు అర్బన్