ఈ బాలిక పేరు కమతం శ్రీవాణి. ఊరు భీమవరం. అక్కడి బధిరుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆమెకు పుట్టుకతోనే మాటలు రావు. చెవుడు కూడా ఉంది. ఈమె తండ్రి శ్రీనివాస్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీవాణికి నూరు శాతం వైకల్యం ఉందని 2008 వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పటినుంచి వికలాంగుల కోటాలో రూ.500 పింఛన్ కోసం ఆ తండ్రి కుమార్తెను వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. గురువారం తణుకు ఏరియూ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం శిబిరానికి శ్రీవాణిని మరోసారి తీసుకొచ్చాడు. ‘అధికారులూ మాపై దయుంచండి. నా బిడ్డకు పింఛన్ ఇచ్చి ఆదుకోండ’ని అభ్యర్థించాడు. పరీక్షలు చేసిన వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి పంపించివేశారు. పింఛన్.. బాంచెన్
బాలిక తండ్రి శ్రీనివాస్‌ను ‘న్యూస్‌లైన్’ పలకరించగా... ‘మా పాప పింఛన్ కోసం అధికారుల చుట్టూ ఐదేళ్లుగా తిరుగుతున్నాను. మొదట్లో మాకు తెల్లరేషన్ కార్డు ఉంది. కార్డు ఉన్నంతసేపూ పింఛన్ ఇవ్వలేదు. తర్వాత కార్డు తీసేశారు. కార్డు లేకపోతే పింఛన్ రాదన్నారు. అధికారుల కాళ్లావేళ్లా పడ్డాను. ఈ మధ్యనే రచ్చబండలో తాత్కాలిక కార్డు వచ్చింది. దాన్ని తీసుకుని మళ్లీ ఇలా తిరుగుతున్నాను. ఎన్నోసార్లు ప్రజావాణికి వెళ్లి కలెక్టర్‌ను కూడా ఆశ్రయించాను. అయినా ఫలితం లేదు. తిరగడానికి ఖర్చులైతే అవుతున్నాయ్.. ఈసారైనా పింఛన్ ఇస్తారో లేదోమరి. 500 పింఛన్‌ను వెరుు్య రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వెరుు్య మాట దేవుడెరుగు.. కనీసం ఐదొందలు ఇచ్చినా మాకు మేలు జరుగుతుంది’ అంటూ అధికారులకు చెయ్యెత్తి మొక్కాడు. - న్యూస్‌లైన్/తణుకు అర్బన్
పింఛన్.. బాంచెన్
Published Fri, Dec 6 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement