ముసల్మాన్ కా జాన్ వైఎస్సార్
వైఎస్ ముఖ్యమంత్రిగా నాలుగు శాతం రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేయ డంతోనే గుర్తింపు దక్కింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషను అమలు చేయ డంలో వైఎస్ విజయం సాధించారు. ఈ రిజర్వేషన్లతోనే మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతవిద్యను చదువుకునే వీలు కలిగింది. జిల్లాలో పలువురికి వైద్యవిద్యనభ్యసించే సువర్ణ అవకాశం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా తమ చదువును నిరాటంకంగా కొనసాగించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు సముచిత స్థానం దక్కింది.
2007లో అమలు చేసిన రిజర్వేషన్లతో జిల్లాలో 25వేల మంది విద్యార్థులకు అన్ని విధాలా లబ్ధి చేకూరింది. ముస్లింలు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలని ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలు చేశారు. పేద ముస్లింలకు హజ్ యాత్ర ప్రభుత్వ రాయితీతో కల్పించారు. మైనార్టీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి షాదీఖానాల నిర్మాణం, పేద ముస్లిం బాలికలకు సామూహిక వివాహాలు చేశారు.
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, పింఛన్లు ద్వారా వేలాది మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది. వైఎస్ హయాం సువర్ణయుగమని. ‘హర్ గరిబ్ ముసల్మాన్ కే దిల్ మే డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిజీ కే లియే జగా హే.. హర్ వక్త్ దువేమే భి వైఎస్‌ఆర్‌కో యాద్ రఖ్‌తేహే..’ అంటూ నిత్యం ప్రతి ముస్లిం కుటుంబం గుర్తు చేసుకుంటున్న సువర్ణయుగం అది.
అంతా మేలే జరిగింది..
వైస్ రాజశేఖర్‌రెడ్డి మహానుభావుడు. ఆయన పాలనలో ముస్లిం మైనార్టీలకు అంతా మేలే జరిగింది. మా పిల్లలకు రిజర్వేషన్‌తో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. ఆరోగ్యశ్రీతో మరో జన్మనిచ్చారు. రుణాలు మాఫీ చేశారు. మైనార్టీ సంక్షేమం కోసం నిత్యం కృషి చేశారు.
గుండెకు రంధ్రం పడింది..
నాకు గుండెకు రంధ్ర పడింది. రాజశేఖర్‌రెడ్డి పుణ్యవూ అని ఆరోగ్యశ్రీ ద్వారా విజయువాడ కేర్ హాస్పటల్‌లో రూపారుు ఖర్చు లేకుండా చికిత్స చేరుుంచుకున్నాను. నాకు ప్రాణమించిన రాజన్న తనయుుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నా ప్రాణం ఉన్నంత కాలం నడుస్తాను.
వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడు..
వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడులాంటి వారు. జాకీర్‌హుస్సేన్ నగర్‌లో ఇప్పటికీ అద్దె నివాసంలో ఉండే నాకు 2013లో గుండె సరిగా లేదని డాక్టర్లు చెప్పారు. బైపాస్ సర్జరీ చేస్తే తప్ప బతకనన్నారు. పెద్ద ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. మహానేత డాక్టర్ వైస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నా పాలిట సంజీవని అయింది. గత ఏడాది నవంబర్‌లో ప్రైవే టు ఆస్పత్రిలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్ చేయటంతో పాటుగా, సంవత్సరం పాటు మందులను ఉచితంగా ఇస్తున్నారు. నేను బతికి ఉన్నంత కాలం వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం.