employment sectors
-
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్‌లో చూసి ‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
ఉపాధి ఊడుతోంది!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 ధాటికి ఉపాధి రంగం విలవిలలాడుతోంది. లాక్డౌన్, అనంతర పరిణామాలతో నిరుద్యోగం క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండు నెలల లాక్డౌన్ కారణంగా మెజార్టీ రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సడలింపులు ఇస్తున్నప్పటికీ మునుపటి ఉత్సహం కనిపించడంలేదు. దీంతో అన్ని రంగాల్లోనూ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు పెరుగుతుండడంతో ఆ మేరకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఫలితంగా నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటుపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఈఐ) గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అంచనా వేయగా.. రాష్ట్రంలో నిరుద్యోగులు దాదా పు రెట్టింపైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనవరిలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 9.1శాతానికి పెరిగింది. ఇదే జాతీయస్థాయిలో 7.4 శాతంగా ఉన్నట్లు సీఎంఈఐ తెలిపింది. నిరుద్యోగ రేటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 1,74,405 కుటుంబాలను సర్వేలో నమూనాలుగా సేకరించారు. ఫోన్, ఆన్లైన్ తదితర మార్గా ల్లో సీఎంఈఐ ప్రతినిధులు వారితో మాట్లాడారు. గత నాలుగు నెలలుగా ఈ పద్ధతిలో సర్వే చేశారు. మేలో అత్యధికంగా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటు ఏప్రిల్, మే నెలల్లో నమోదైంది. లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. కొన్నింటికి అనుమతులిచ్చినప్పటికీ కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఈ క్రమంలో రోజువారీ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. అసంఘటిత రంగంలో అత్యధిక కార్మికులుండగా.. ఏప్రిల్, మే నెలల్లో వారికి పని దొరకలేదు. ప్రభుత్వం లేదా ఇతర దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోజులు వెళ్లదీసిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఈ రెండు నెలల్లో వరుసగా జాతీయ స్థాయిలో 23.5 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. అనంతరం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో క్రమంగా రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరుద్యోగ రేటు జూన్‌లో 11 శాతానికి, జూలైలో 7.4 శాతానికి తగ్గింది. ఇందులో పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ రేటు 9.15 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో మాత్రం 6.66 శాతంగా ఉన్నట్లు సీఎంఈఐ వివరించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌లో లాక్డౌన్ ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగాయి. మేలో తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా వ్యవసాయ పనులు, ఉపాధి హామీ మందగించాయి. దీంతో ఆ నెలలో రాష్ట్రంలో నిరుద్యోగరేటు ఏకంగా 34.8 శాతం నమోదైంది. -
మహిళకు.. వెల్కమ్!
న్యూఢిల్లీ: పనివేళలు సౌకర్యంగా లేకపోవడం.. ఇంటి నుంచి పని చేసే అవకాశాలు తక్కువగా ఉండడం.. ఇటువంటి సమస్యలు ఇంతకాలం ఉద్యోగ రంగంలో మహిళల పాత్రను పరిమితం చేశాయి. కానీ, ఇప్పుడు కరోనాతో ఇది మారిపోనుంది. దీని కారణంగా పలు రంగాల్లో.. ముఖ్యంగా ఐటీ రంగంలో 75–90 శాతం మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే కార్యాలయ పని).. విధానంలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పులతో మరింత మంది మహిళలు కెరీర్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘ప్రతిభావంతులైన ఎంతో మంది మహిళలు, ఎన్నో నైపుణ్యాలు ఉండి కూడా వ్యక్తిగత కారణాల రీత్యా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వారు తిరిగి ఐటీ రంగంలోకి బలంగా వచ్చే అవకాశం ఉంది’’ అని ఎస్సార్ గ్రూపు హెచ్ఆర్ ప్రెసిడెంట్ కౌస్తుభ్ సోనాల్కర్ పేర్కొన్నారు. ఇంటి నుంచే పని విధానంతో మహిళలు తిరిగి ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు, పార్ట్‌టైమ్ (పరిమిత సమయం) ఉద్యోగాలు చేసుకునేందుకు చక్కని అవకాశం ఏర్పడిందన్నారు. మహిళలకు ప్రాధాన్యం.. క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో పనిచేసే సేల్స్‌ఫోర్స్ కంపెనీకి భారత్‌లో 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత మంది మహిళలను నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. తద్వారా ఉద్యోగుల విషయంలో మరింత సమతుల్యతను తీసుకురానున్నట్టు తెలిపింది. ‘‘ఉద్యోగులు ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసేందుకు మరిన్ని కంపెనీలు అనుమతించనున్నాయి. ఇది మహిళలకు అనుకూలమైన పరిస్థితులను, అవకాశాలను కల్పించనుంది. వ్యక్తిగత బాధ్యతలను నెరవేరుస్తూనే వారు తమ కెరీర్‌ను తిరిగి ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా డైరెక్టర్ నిధి అరోరా అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో భద్రతా కారణాల రీత్యా రాత్రి షిఫ్ట్‌లకు మహిళలను అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కరోనా కారణంగా భిన్నమైన ధోరణులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగాలకు వారు అర్హులే. మరింత మంది మహిళలు ఉపాధి అవకాశాలను సొంతం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘వర్కింగ్ మదర్ మీడియా’ ప్రెసిడెంట్ సుభ వి బ్యారీ తెలిపారు. ‘బ్యాలెన్స్’ అవకాశం పనిచేసే చోట సాధారణంగా స్త్రీ/పురుష ఉద్యోగుల విషయంలో సంఖ్యా పరంగా ఎంతో అంతరం కనిపిస్తుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పుడు ఈ అంతరాన్ని సరిచేసే అవకాశం కానుందా..? అన్నదానికి ఏడీపీ ఇండియా హెచ్ఆర్ హెడ్ విపుల్‌సింగ్ స్పందిస్తూ.. ‘‘కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఇవ్వనందుకే మహిళలు ఉద్యోగాల నుంచి తప్పుకోవడం లేదు. సామాజికంగా, మానసికంగా, వ్యక్తిగత అవసరాల కోసం వారి జీవితంలో కొంత వ్యవధి కావాలి. అందుకే వారు ఉద్యోగాల విషయంలో రాజీపడాల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అన్నింటిని సమతుల్యం చేసుకోగలరు’’ అంటూ భవిష్యత్తు ధోరణి గురించి వివరించారు. గత రెండేళ్లలో మహిళా ఉద్యోగుల శాతం 35% నుంచి 25%కి పడిపోయిందని.. ఇప్పుడు మళ్లీ పుంజుకోనుందని యాక్సెంట్ హెచ్ఆర్ సీఈవో సుబ్రమణ్యమ్ చెప్పారు. వేతనాల్లో అం తరం ఉండడం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు సానుకూలించే అంశంగా పేర్కొన్నారు. వేతనాలదీ కీలకపాత్రే... ‘‘పని పరంగా పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకపోయినా.. పారితోషికాల విషయంలో మహిళలకు 20% తక్కువే చెల్లిస్తున్నాయి కంపెనీలు. ఇది మహిళలకు ప్రతికూలమే అయినా, పరిశ్రమకు లాభదాయకం. సౌకర్యమైన పనివేళలు లేదా ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల దిశగా పరిశ్రమలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేస్తే మహిళలకు ఉపాధి పరంగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుచుకున్నట్టే. ఎందుకంటే ఈ విషయంలో పరిశ్రమలకు కనీస వేతనాల తలనొప్పి కూడా ఉండదు’’ అని సుబ్రమణ్యమ్ వివరించారు. రెండో విడత కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళలకు వర్క్ హోమ్ హోమ్‌తో భారీ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండడం గమనార్హం. -
సాగు, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో వ్యవసాయం, ఉపాధి రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జెడ్పీ హాల్లో శనివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సంబురాలకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ పాలనలో లోటుపాట్లు ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జేఏసీ నేతలు ఆత్మన్యూనతకు గురికావద్దని, ఎవరికీ తలవంచి అడుక్కోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు. పోరాటాలతోనే జేఏసీకి ప్రజలు అసామాన్య గుర్తింపు ఇచ్చారని, ఇప్పుడు వారి పక్షాన్నే నిలబడి పోరాడాలని సూచించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోదండరాం అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్ర పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని, ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదన్నారు. వ్యవసాయం, ఉపాధి అంశాలపై లోతైన అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలన, వన రులు అందరికీ సమానంగా దక్కే పరిస్థితి రావాలని కోదండరాం సూచించారు. ‘మిషన్ కాకతీయ’ లోటుపాట్లపై అధ్యయనం.. ‘మిషన్ కాకతీయ’ అవసరమని, అయితే చెరువుల్లోని మట్టిని రైతులు పొలాలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. చెరువుల పునరుద్ధరణలోని లోటుపాట్లపై అధ్యయనం చేసి ప్రభుత్వం వద్ద ఉంచుదామన్నారు. ప్రజా సమస్యలపై జేఏసీ ఆధ్వర్యం లో ఇకపై ఉధృతంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, నాయకులు కె.కృష్ణకుమార్, అనంతయ్యతో పాటు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. -
ముసల్మాన్ కా జాన్ వైఎస్సార్
వైఎస్ ముఖ్యమంత్రిగా నాలుగు శాతం రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేయ డంతోనే గుర్తింపు దక్కింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషను అమలు చేయ డంలో వైఎస్ విజయం సాధించారు. ఈ రిజర్వేషన్లతోనే మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతవిద్యను చదువుకునే వీలు కలిగింది. జిల్లాలో పలువురికి వైద్యవిద్యనభ్యసించే సువర్ణ అవకాశం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా తమ చదువును నిరాటంకంగా కొనసాగించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు సముచిత స్థానం దక్కింది. 2007లో అమలు చేసిన రిజర్వేషన్లతో జిల్లాలో 25వేల మంది విద్యార్థులకు అన్ని విధాలా లబ్ధి చేకూరింది. ముస్లింలు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలని ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలు చేశారు. పేద ముస్లింలకు హజ్ యాత్ర ప్రభుత్వ రాయితీతో కల్పించారు. మైనార్టీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి షాదీఖానాల నిర్మాణం, పేద ముస్లిం బాలికలకు సామూహిక వివాహాలు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, పింఛన్లు ద్వారా వేలాది మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది. వైఎస్ హయాం సువర్ణయుగమని. ‘హర్ గరిబ్ ముసల్మాన్ కే దిల్ మే డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డిజీ కే లియే జగా హే.. హర్ వక్త్ దువేమే భి వైఎస్ఆర్కో యాద్ రఖ్తేహే..’ అంటూ నిత్యం ప్రతి ముస్లిం కుటుంబం గుర్తు చేసుకుంటున్న సువర్ణయుగం అది. అంతా మేలే జరిగింది.. వైస్ రాజశేఖర్‌రెడ్డి మహానుభావుడు. ఆయన పాలనలో ముస్లిం మైనార్టీలకు అంతా మేలే జరిగింది. మా పిల్లలకు రిజర్వేషన్‌తో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. ఆరోగ్యశ్రీతో మరో జన్మనిచ్చారు. రుణాలు మాఫీ చేశారు. మైనార్టీ సంక్షేమం కోసం నిత్యం కృషి చేశారు. గుండెకు రంధ్రం పడింది.. నాకు గుండెకు రంధ్ర పడింది. రాజశేఖర్‌రెడ్డి పుణ్యవూ అని ఆరోగ్యశ్రీ ద్వారా విజయువాడ కేర్ హాస్పటల్లో రూపారుు ఖర్చు లేకుండా చికిత్స చేరుుంచుకున్నాను. నాకు ప్రాణమించిన రాజన్న తనయుుడు జగన్మోహన్రెడ్డి వెంట నా ప్రాణం ఉన్నంత కాలం నడుస్తాను. వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడు.. వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడులాంటి వారు. జాకీర్‌హుస్సేన్ నగర్లో ఇప్పటికీ అద్దె నివాసంలో ఉండే నాకు 2013లో గుండె సరిగా లేదని డాక్టర్లు చెప్పారు. బైపాస్ సర్జరీ చేస్తే తప్ప బతకనన్నారు. పెద్ద ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. మహానేత డాక్టర్ వైస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నా పాలిట సంజీవని అయింది. గత ఏడాది నవంబర్‌లో ప్రైవే టు ఆస్పత్రిలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్ చేయటంతో పాటుగా, సంవత్సరం పాటు మందులను ఉచితంగా ఇస్తున్నారు. నేను బతికి ఉన్నంత కాలం వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం.