pinchen
-
డబ్బు వారిది.. డబ్బా వీరిది..
రాష్ట్ర ప్రభుత్వాలు అందించే దాదాపు మూడొంతుల సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో అమలయ్యేవే. చాలా పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు తన వంతు విడుదల చేయకపోవడం వల్ల పంపిణీలో తాత్సారం కావడం, కొన్నిసార్లు పూర్తిగా విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ఇదే కోవలోకి వస్తాయి పలు పింఛన్ల పథకాలు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల గుర్తింపు పత్రాలపై సైతం ‘అన్నీ నావల్లే’ అని డబ్బాలు కొట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నిలువెత్తు ఫొటోలను ముద్రించేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలును అపహాస్యం చేస్తోంది. పింఛను లబ్ధిదారుల గుర్తింపు కార్డులపై ఉండే చంద్రబాబు ఫొటోలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విపక్షాలు వాదిస్తున్నాయి. రాజమహేంద్రవరం రూరల్: ప్రతి నెలా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్స్, ఫిషర్మన్, పాపులర్స్ ఇలా అనేకమంది పింఛన్‌దారులు ప్రతి నెలా సామాజిక ఫించన్లు తీసుకుంటున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకూ తీసుకునే పింఛన్లకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. పింఛన్లు తీసుకునే నాటికి ఎన్నికలకు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. మరి చంద్రబాబు పింఛన్లు ఇస్తున్నట్లు పింఛన్ పుస్తకాలపై ప్రచారం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోనుందనే సందేహం విపక్షాలతో పాటు ప్రజల్లో నెలకొంది. జిల్లాలో 5,86,808 మంది పింఛనర్లు జిల్లాలో అన్నిరకాల పింఛనర్లు కలిపి 5,86,808 మంది ఉన్నారు. వారి కుటుంబాల్లోని వ్యక్తులను కలిపితే దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పింఛన్లు ఇచ్చే సమయంలో చంద్రబాబు నేనే ఇస్తున్నానని ప్రకటించడంతో పాటు ఆయన అనుకూల మీడియా ద్వారా ప్రచారం హోరెత్తిస్తే ఓటర్లపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరి దీనిపై ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఈఅంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ పుస్తకం ఎప్పుడూ ఇంటిలోనే ఉంటుందని, అప్పుడు గుర్తురాదా అని కొందరు వాదిస్తున్నారు. కానీ నెలంతా పనిచేసినా ఒకటో తేదీన జీతం వస్తుంది. ఆ సమయంలో మాత్రమే యజమాని జీతం ఎప్పుడిస్తాడా అని గుర్తు చేసుకుంటారు. మిగిలిన సమయంలో మాత్రం పనిలోనే నిమగ్నమవుతారు. అలాగే ఒకటి నుంచి ఐదో తేదీ లోపు మాత్రమే లబ్ధిదారులు పింఛన్ పుస్తకాన్ని గుర్తుచేసుకుంటారు తప్ప నెలంతా పుస్తకాన్ని ముందు పెట్టుకుని కూర్చునే పరిస్థితి ఉండదని కొందరి వాదన. ఎందుకంటే పింఛన్ తీసుకున్న ఐదు రోజులకే ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల పింఛన్ పుస్తకాలు ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీనిపై మాత్రం ఎన్నికల అధికారులు సరైన చర్యలు తీసుకోవాలంటూ పలు పార్టీల నాయకులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దారిలో కనిపించే విగ్రహాలనే తొలగిస్తున్నప్పుడు వీటిని ఎలా అనుమతిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ కరపత్రంగా పింఛన్ పుస్తకం పింఛన్లు నమోదు చేసే పుస్తకాలు పసుపురంగుతో, చంద్రబాబు ఫొటోతో టీడీపీ కరపత్రాల్లా ఉంటాయి. మరి ఎన్నికల అధికారులు వాటిని ఏరకంగా పరిగణనలోనికి తీసుకుంటారనే అనుమానం కలుగుతుంది. చంద్రబాబు ఏపనిచేసినా తన ప్రచారం, తన స్వార్థం లేనిదే ఏ పనీ తలపెట్టరనే విషయం అందరికి తెలిసిందే. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో వృద్ధాప్య పింఛన్లు అందించే వారు. కానీ ఎక్కడా ఎటువంటి ప్రచారం కనిపించలేదు. ఆ పింఛన్ పుస్తకాలపై ప్రభుత్వ ముద్రలేకుండా ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం కేంద్రం నిధులతో ఇస్తున్న పింఛన్లను కేంద్రం పెద్దల ఫొటోలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ పింఛన్లు వెయ్యి రూపాయలే ఇచ్చేవారు. అయితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో పింఛన్ మొత్తాన్ని రూ.రెండువేలకు పెంచుతామని ప్రకటించారు. దీంతో ఆ పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకునేందుకు మూడు నెలల క్రితం రూ.రెండు వేలకు పెంచారు. నాలుగున్నరేళ్లుగా పింఛన్‌దారులను పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకునేందుకు ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్‌ను రూ.రెండు వేలకు పెంచారు. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
పింఛన్ దుడ్లు ఎప్పుడిస్తారో..!
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న వృద్ధులు బేతంచెర్ల, న్యూస్‌లైన్: వయస్సు పైబడిన వృద్ధులు.. ఆసరా లేని వికలాంగులు.. తోడు దూరమైన వితంతువులు.. వీరందరికీ నెల నెలా వచ్చే పింఛన్ ఎంతో ఆసరానిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లా.. వీరికీ ఠంచన్‌గా పింఛన్ మొత్తం అందించి పెద్ద కొడుకుగా.. తోబుట్టువులా వారి హృదయాలను చూరగొన్నారు. ఆయన మరణానంతరం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియక.. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛన్ ఇస్తారో లేదో తెలియక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అతి కష్టం మీద పొద్దున్నే కార్యాలయాలకు వస్తున్నారు. ఇంకా రాలేదని తెలిసి ఎండలో నిట్టూరుస్తూ ఇళ్లకు వె ళ్లిపోతున్నారు. దుడ్లు ఎప్పుడిస్తారోనని ఆశగా అడుగుతున్నారు. ఆ మహానేత జీవించి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కాదంటూ పలువురు పింఛన్‌దారులు ఈ సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవడం కనిపించింది. ఆ వైఎస్ దేవుడు లేకపోయినా.. ఆయన కొడుకు జగన్ అయినా వస్తే సక్రమంగా పింఛన్ దుడ్లు వస్తాయని మరింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ముసల్మాన్ కా జాన్ వైఎస్సార్
వైఎస్ ముఖ్యమంత్రిగా నాలుగు శాతం రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేయ డంతోనే గుర్తింపు దక్కింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషను అమలు చేయ డంలో వైఎస్ విజయం సాధించారు. ఈ రిజర్వేషన్లతోనే మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతవిద్యను చదువుకునే వీలు కలిగింది. జిల్లాలో పలువురికి వైద్యవిద్యనభ్యసించే సువర్ణ అవకాశం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా తమ చదువును నిరాటంకంగా కొనసాగించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు సముచిత స్థానం దక్కింది. 2007లో అమలు చేసిన రిజర్వేషన్లతో జిల్లాలో 25వేల మంది విద్యార్థులకు అన్ని విధాలా లబ్ధి చేకూరింది. ముస్లింలు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలని ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలు చేశారు. పేద ముస్లింలకు హజ్ యాత్ర ప్రభుత్వ రాయితీతో కల్పించారు. మైనార్టీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి షాదీఖానాల నిర్మాణం, పేద ముస్లిం బాలికలకు సామూహిక వివాహాలు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, పింఛన్లు ద్వారా వేలాది మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది. వైఎస్ హయాం సువర్ణయుగమని. ‘హర్ గరిబ్ ముసల్మాన్ కే దిల్ మే డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డిజీ కే లియే జగా హే.. హర్ వక్త్ దువేమే భి వైఎస్ఆర్కో యాద్ రఖ్తేహే..’ అంటూ నిత్యం ప్రతి ముస్లిం కుటుంబం గుర్తు చేసుకుంటున్న సువర్ణయుగం అది. అంతా మేలే జరిగింది.. వైస్ రాజశేఖర్‌రెడ్డి మహానుభావుడు. ఆయన పాలనలో ముస్లిం మైనార్టీలకు అంతా మేలే జరిగింది. మా పిల్లలకు రిజర్వేషన్‌తో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. ఆరోగ్యశ్రీతో మరో జన్మనిచ్చారు. రుణాలు మాఫీ చేశారు. మైనార్టీ సంక్షేమం కోసం నిత్యం కృషి చేశారు. గుండెకు రంధ్రం పడింది.. నాకు గుండెకు రంధ్ర పడింది. రాజశేఖర్‌రెడ్డి పుణ్యవూ అని ఆరోగ్యశ్రీ ద్వారా విజయువాడ కేర్ హాస్పటల్లో రూపారుు ఖర్చు లేకుండా చికిత్స చేరుుంచుకున్నాను. నాకు ప్రాణమించిన రాజన్న తనయుుడు జగన్మోహన్రెడ్డి వెంట నా ప్రాణం ఉన్నంత కాలం నడుస్తాను. వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడు.. వైఎస్సార్ మా కుటుంబానికి దేవుడులాంటి వారు. జాకీర్‌హుస్సేన్ నగర్లో ఇప్పటికీ అద్దె నివాసంలో ఉండే నాకు 2013లో గుండె సరిగా లేదని డాక్టర్లు చెప్పారు. బైపాస్ సర్జరీ చేస్తే తప్ప బతకనన్నారు. పెద్ద ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. మహానేత డాక్టర్ వైస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నా పాలిట సంజీవని అయింది. గత ఏడాది నవంబర్‌లో ప్రైవే టు ఆస్పత్రిలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆపరేషన్ చేయటంతో పాటుగా, సంవత్సరం పాటు మందులను ఉచితంగా ఇస్తున్నారు. నేను బతికి ఉన్నంత కాలం వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం. -
ఓటయితే ఎయ్యరాదే..!
నాయకుడు : ‘తాత మన వార్డు కౌన్సిలర్ సీటు ఆడోళ్లకచ్చిందే. నా భార్యను నిలబెట్టిన. ఏట్లైన మనమే గెలుస్తమన్న నమ్మకముందే. ఎందుకైన మంచిదని ముందగల్లా మన అనుకున్నోళ్లను కలుస్తున్న. మన గల్లీల ఏఇంట్లో ఎంతమంది ఉన్నరో.. ఓళ్లకు ఎంజెప్తే సమజైతదో నీ పక్కా ఎరుక్కుంటదని అచ్చిన్నే. మన గల్లీలో రచ్చబండ పెట్టినప్పుడు ముసలోలందరిని కూడగట్టుకుని ఫించన్లు కావాలే.. అని లొల్లి పెట్టి, అచ్చిన ఆఫీసర్లను పరేషాన్ జేసినవ్ గదనే. మీ లొల్లికి బుగులు పడి ఫించన్ రానోళ్లందరి అప్లికేషన్లు తీసుకున్నరు. తాత : అవ్ బిడ్డ మంచి ముచ్చట యాదిజేసినవ్. నాఅసుంటి ముసలోల్లు పాపం పించిన్లు రాక,అరిగోసపడుతున్నరు. గల్లీల మీటింగ్‌లు పెట్టినప్పుడల్లా అప్లికేసన్లు ఇచ్చుడుకే సరిపోయింది. పించిన్లు రాలేదు. మీటింగులల్లా 65 ఏళ్ల నిండి గరీబోళ్లందరికి ఫించన్లు ఇస్తమని, దరఖాస్తుపెట్టుకొమ్మని లీడర్లు, ఆఫీసర్లు చెబితే నమ్మి ఆశపడ్డం. పెద్ద లీడర్లు చెబుతున్నరు నిజంగా ఇత్తరేమోనని కూడబెట్టుకున్న పైసలు ఖర్సుబెట్టి ఫొటువోలు దిగి, అప్లికేసను పెట్టుకున్నం. ఆడికెళ్లి పించిన్ కోసం తిరగనిగడప, మొక్కని కాళ్లు లేవు బిడ్డ. ఎవరికి కనికరం రాలేదాయె. దేవుడా నీవె దిక్కని దినాలు ఎల్లదీస్తున్నం. ఎవరిని అడిగిన.. ఇగో అస్తయ్ అగో అస్తయ్ అంటున్నరు. ఇప్పుడేమో ఎలచ్చన్లు అచ్చినయ్, అయ్యిపోయేదాక రావంటున్నరు. మళ్లీ ఓట్లడుగ అస్తర గదా బిడ్డ అప్పుడు శెప్తామని ఎదురుచూస్తున్నం. నాయకుడు: తాతా ఇగో గా పార్టీ రాజుగాడు గట్లనే జెప్పి అందర్ని పరేషాన్ జేసిండు. ఇగ రందిపెట్టుకోకు. ఈ ఎలచ్చన్ల నా భార్యను గెలుపిస్తే, గల్లీల ఇంటింటికి తిరిగి ముసలోల్లందరి పేర్లు రాసుకుని, అల్లకు పించిన్లు ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకముంచే.. నేన్ జూస్కుంట. మీకందరికి పించిన్లు ఇప్పించే జిమ్మెదారి నాది, ఏం ఫికర్ జేయకు. తాత: పోయిన ఎలచ్చన్ల కౌన్సిలర్‌గా గెలిసిన రాజుగాడూ.. ఓట్ల ముందు గివే మాటలు జెప్పిండు.. మరి గెలిసినంక అడిగితే. తాత నాచేతుల ఏముంది, సర్కారోళ్లు ఇస్తేనే గదా అన్నడు. మల్ల మల్ల అడిగితే కోపమైతుండని, ఇడసబెట్టేసినం. పించిన్లు, ఇల్ల జాగలు , రేషన్‌కార్డులు, ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తమని మస్తు మాటలు జెప్పిండు. కడుపు కాలేటోళ్లకు రాలేదు. పెద్ద లీడర్లు చెప్పినోళ్లకొచ్చినయ్. ముచ్చట్లపడి అసలు మాట మరిసిపోయిన బిడ్డ.. ఓట్లల్ల నువ్వే నిలబడుతున్న అంటివి గదా? నాయకుడు : అవ్ తాత.. నేనే పోటీ చేద్దామనుకుని, యాడాది సంది గల్లీలదిరుగుతున్న. అందరి కాడి కెళ్లి చెప్పిన. అందరు మంచ్చిగన్నరు. గని ఏంజేద్దాం. నా అదృష్టం బాగ లేదేమో. మన గల్లీ సీటు ఆడోల్లకు అచ్చింది. ఆడోళ్లను ఇంటి బయటకు తెచ్చుడెందుకని సప్పుడు సెయకుండా ఉన్నుంటి. ఓ పార్టీవోల్లు మేమే ఖర్సుపెడుతం పోటీ చేయమని కబురు పంపిండ్రి. జర ఇంట్ల అరుసుకుంటని జెప్పిన, టైం లేదు.. ఎనకముందు సూడకు మేమున్నం గదా అన్నరు ఆ పార్టీవోళ్లు. గంతే పెళ్లాంను ఎంట దీస్కుని పోయి నామినేషన్ ఏసొచ్చిన. తాత : అవ్ బిడ్డ.. నీ భార్య ఓట్లల్ల గెలిస్తే గల్లీల్ల తిరగాలే. మీటింగులకు పోవాలే. గల్లీలో మంచి చెడ్డ ఏం జరిగిన ముందుగల్ల నిలబడాలే. ఎవరికి ఏమాపత్ అచ్చిన సూడాలే. నీకేమో పెద్దగా కూడవెట్టినై లేకపాయే. ఉన్న రెండెకరాల ఎవుసం చేసుకుని బతకాలే. పెళ్లాం నువ్వు చెరొక పని చేసుకుంటే మంచిగా బతకొచ్చు గదా. గీ ఓట్లల్ల నిలబడితే నీకేమోస్తదంటవ్. ఎలచ్చన్లంటే వట్టిది కాదు. లచ్చలు ఖర్సు పెట్టాలే. పార్టీలోల్లు ఎంతిస్తరు బిడ్డ. బాకీ చేసుకుని పరేషాన్ గాకు. ఒకయాల నీ పెళ్లాం గెలిచిందనుకో.. ఇంట్లో పని వోళ్లు జేస్తరంటవ్. నీ కిద్దరు పిల్లలున్నరు గదా. పొద్దుగల్లానే ఆళ్లని తయారుజేసి బడికి పంపాలే. గిట్ల మస్తు పనులుంటయ్. నాయకుడు: నువ్ జెప్పింది సైయే తాత. నా పెళ్లాం గెలిస్తే యాడికిబోదు. నేనే అన్నీ జూస్కుంట. మూడు నెలకొపారి మున్సిపాలిటిల మీటింగ్ ఉంటదట. దానికి బోతే సరిపాయే. గల్లీల దిరిగేదిముంటది. ఎవుసం చేసుకుంటా అంతా నేనే చూస్తా. తాత: ఇంతకి మన గల్లీల ఎంతమంది పోటీ జేస్తుండ్రు. పెద్ద లీడర్ల సుట్టాలు ఏవరైన ఉన్నరా? పోయిన ఎలచ్చన్ల గెలినోళ్లు, గెలువ నోళ్లు, పక్క గల్లీల నుంచి వచ్చినోళ్లు పోటీ జేస్తుండ్రని విన్న బిడ్డ నిజమేనా? పెద్ద లీడర్లు గల్లీల్ల పెచారంకు అస్తరటని గూ విన్న బిడ్డ.. నాయకుడు: అవ్ తాత.. మస్తుమంది నామినేషన్లు ఏసిండ్రు. రెండు రోజుల దాకా పోటీల ఎవరుంటరో దెల్వదు. ముందగల్ల నా సంగంతి సూడరాదే. పెద్ద,సిన్న లీడర్ల ముచ్చట మనకేందుకే తాత. తాత: గిప్పుడు అసలు ముచ్చట కాడికి అచ్చినవ్. మన గల్లీలో ఏళ్ల కిందట కట్టిన మోరీలు కూలీపోయినయ్, గలీజు నీళ్లు రోడ్లమీదకొచ్చి కంపు ఆసనోస్తుంది, ఆనకాలంలా సంటి పోరగాండ్లకు రోగాలొచ్చి దవాఖానకు పాలైండ్రు. మన గల్లీ పక్కపొంటి పారుతున్న చెరువు కాల్వలో మేము సిన్నప్పుడు ఈతకొట్టినం, నీళ్తు ఎప్పుడు తాజాగా ఉండేయి. ఇప్పుడేమో మోరీల నీళ్లు కలిసి కంపు ఆసనొస్తుంది. పెద్దలీడర్లు గల్లీల్ల ఓట్లడుగ అస్తే అల్ల సంగతి అరుసుకుందామని జూస్తున్నా. నాయకుడు : ఇగో తాత గా పెద్దలీడర్లను ఏమన్న అడుక్కో.. ఏమన్న జేస్కో.. గని నా మాట యాదికుంచుకో. జర మనోళ్ల ఓట్లన్నీ మనకే ఏసేటట్లు సూడే. గా పక్క గంగన్న తాత దగ్గరికి గూడ పోయి ఓ మాటజెప్పెస్తా. -
పింఛన్.. బాంచెన్
ఈ బాలిక పేరు కమతం శ్రీవాణి. ఊరు భీమవరం. అక్కడి బధిరుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆమెకు పుట్టుకతోనే మాటలు రావు. చెవుడు కూడా ఉంది. ఈమె తండ్రి శ్రీనివాస్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీవాణికి నూరు శాతం వైకల్యం ఉందని 2008 వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పటినుంచి వికలాంగుల కోటాలో రూ.500 పింఛన్ కోసం ఆ తండ్రి కుమార్తెను వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. గురువారం తణుకు ఏరియూ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం శిబిరానికి శ్రీవాణిని మరోసారి తీసుకొచ్చాడు. ‘అధికారులూ మాపై దయుంచండి. నా బిడ్డకు పింఛన్ ఇచ్చి ఆదుకోండ’ని అభ్యర్థించాడు. పరీక్షలు చేసిన వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి పంపించివేశారు. పింఛన్.. బాంచెన్ బాలిక తండ్రి శ్రీనివాస్‌ను ‘న్యూస్‌లైన్’ పలకరించగా... ‘మా పాప పింఛన్ కోసం అధికారుల చుట్టూ ఐదేళ్లుగా తిరుగుతున్నాను. మొదట్లో మాకు తెల్లరేషన్ కార్డు ఉంది. కార్డు ఉన్నంతసేపూ పింఛన్ ఇవ్వలేదు. తర్వాత కార్డు తీసేశారు. కార్డు లేకపోతే పింఛన్ రాదన్నారు. అధికారుల కాళ్లావేళ్లా పడ్డాను. ఈ మధ్యనే రచ్చబండలో తాత్కాలిక కార్డు వచ్చింది. దాన్ని తీసుకుని మళ్లీ ఇలా తిరుగుతున్నాను. ఎన్నోసార్లు ప్రజావాణికి వెళ్లి కలెక్టర్‌ను కూడా ఆశ్రయించాను. అయినా ఫలితం లేదు. తిరగడానికి ఖర్చులైతే అవుతున్నాయ్.. ఈసారైనా పింఛన్ ఇస్తారో లేదోమరి. 500 పింఛన్‌ను వెరుు్య రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వెరుు్య మాట దేవుడెరుగు.. కనీసం ఐదొందలు ఇచ్చినా మాకు మేలు జరుగుతుంది’ అంటూ అధికారులకు చెయ్యెత్తి మొక్కాడు. - న్యూస్‌లైన్/తణుకు అర్బన్