ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్నిప్రమాదం | fire accident in bheema varam | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్నిప్రమాదం

Published Fri, Jun 19 2015 9:29 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in bheema varam

భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా): షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ షాపులో అగ్ని ప్రమాదం సంభవిచింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ఒక ఎలక్ట్రికల్ దుకాణానికి చెందిన గోదాంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు ఈ సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ. 40లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement