కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మైదుకూరులో శనివారం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ షర్మిల నిర్వహిం చే సమైక్య శంఖారావానికి సంబంధించి పోస్టర్లను డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, నేతలు కోటా నరసింహరావు, సౌది రామక్రిష్ణారెడ్డి, హరూన్ బజాజ్ డెరైక్టర్ అహ్మద్‌బాషా శుక్రవారం ఆవిష్కరించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహారదీక్ష చేశారని వారు అన్నారు. జిల్లా ప్రజలు షర్మిల సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎంపీ సురేష్, రాజగోపాల్‌రెడ్డి, హమ్‌రాజ్, అయూబ్ పాల్గొన్నారు. కడప నియోజకవర్గం నుంచి సమైక్య శంఖారావానికి 200 వాహనాలలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారని వైఎస్‌ఆర్‌సీపీ కడప సమన్వయకర్త ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు.
చలో సమైక్య శంఖారావం పోస్టర్ల విడుదల
Published Sat, Sep 7 2013 4:11 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement