విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్ | vishnu - balaji title | Sakshi
Sakshi News home page

విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్

Published Sat, Jul 4 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్

విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్

ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ (ఎఫ్-10) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో నగరానికి చెందిన విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు-శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడి 6-4, 6-2 స్కోరుతో ఎస్కాఫీర్ ఆంటోన్-గ్రెనీర్ హ్యుగో (ఫ్రాన్స్)పై విజయం సాధించింది.
 
  సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విష్ణు 7-6(7), 5-7, 6-4 తేడాతో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌ను ఓడిం చాడు. మరో వైపు ఫ్రాన్స్ ప్లేయర్ ఎస్కాఫీర్ ఆంటోన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అతను 6-4, 6-2, 6-3తో భారత ఆటగాడు బాలాజీ శ్రీరామ్‌పై గెలుపొందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement