హ్యాట్రిక్ ప్లాన్లో హిట్ కాంబినేషన్ | Ajith, Vishnu Vardhan combination set for a hat trick | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ ప్లాన్లో హిట్ కాంబినేషన్

Published Tue, Mar 7 2017 2:11 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

హ్యాట్రిక్ ప్లాన్లో హిట్ కాంబినేషన్

హ్యాట్రిక్ ప్లాన్లో హిట్ కాంబినేషన్

వరుస బ్లాక్ బస్టర్లతో కోలీవుడ్లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆ ప్రాజెక్ట్ మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు అజిత్. గతంలో తనకు వీరం, వేదలం సూపర్ హిట్స్ను అందించిన శివ దర్శకత్వంలో ప్రస్తుతం వివేగం సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతుండగా తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు అజిత్.

తనతో బిల్లా, ఆరంభం సినిమాలను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు అజిత్.  మాస్ హీరోగా ఉన్న అజిత్ను స్టైలిష్ లుక్లో చూపించిన విష్ణువర్ధన్, మరోసారి అజిత్ కోసం డిఫరెంట్ సబ్జెక్ట్ను రెడీ చేశాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ చోళ రాజుగా నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వివేగం షూటింగ్లో బిజీగా ఉన్న అజిత్ నుంచి త్వరలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement