మళ్లీ అదే టీంతో.. | Ajith-Siva to team up again? | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే టీంతో..

Published Sat, Oct 28 2017 7:21 AM | Last Updated on Sat, Oct 28 2017 10:12 AM

Ajith-Siva to team up again?

అజిత్‌తో దర్శకుడు శివ

తమిళసినిమా: వివేగం చిత్ర టీమ్‌ రిపీట్‌ కానుందా? అంటే.. అవుననే అంటున్నా యి కోలీవుడ్‌ వర్గాలు. నటుడు అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో ఇప్పటికి వరుసగా వీరం, వేదాళం, వివేగం మూ డు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వీరం, వేదాళం చిత్రాలు కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధిం చాయి. ఇక వివేగం చిత్రం చిత్రీకరణ పరంగా హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో ఉన్నా రెండు చిత్రాల స్థాయిలో విజయం సాధించలేదన్నది విమర్శకులు మాట. అయినా నటుడు అజిత్‌ మళ్లీ దర్శకుడు శివకు మరో అవకాశం ఇచ్చారన్నది తా జా సమాచారం. వివేగం చిత్రం ఆశిం చిన విజయాన్ని పొందకపోయినా బాధ వద్దని మరో చిత్రం చేద్దామని అజిత్‌ దర్శకుడు శివకు భరోసా ఇచ్చినట్లు టాక్‌.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు శివ మంచి కథను రెడీ చేస్తున్నారట. ఈ కథ సింగిల్‌ లైన్‌ అజిత్‌కు నచ్చేయడంతో బెటర్‌మెంట్స్‌ చేయమని చెప్పారట. ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇంతకు ముందు అజిత్‌తో ఆరంభం, వేదాళం చిత్రాలను నిర్మించిన నిర్మాత ఏఎం.రత్నం కోడలు, నిర్మాత ఐశ్వర్య అజిత్‌ ఓకే అంటే ఆయనతో చిత్రం చేయడానికి రెడీ అని ఒక ఇంటర్వూ్యలో ప్రకటించారు. దీంతో వారి సంస్థకు అజిత్‌ చిత్రం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రాన్ని వివేగం చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందనే తాజా సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement