లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు!- అనుష్క | Anushka Shetty to Gain Weight for 'Size Zero'? | Sakshi
Sakshi News home page

లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు!- అనుష్క

Published Tue, Aug 18 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు!- అనుష్క

లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు!- అనుష్క

ఒకప్పుడు బొద్దుగా బందరు లడ్డూలా ఉండే కథానాయికలంటే పడి చచ్చేవాళ్లు. ఇప్పుడేమో ‘జీరో సైజ్’ ట్రెండ్ నడుస్తోంది. వీలైనంత సన్నగా కనిపించాలని కథానాయికలు తాపత్రయపడతారు. లావుగా కనిపించాల్సి వచ్చే ఆ పాత్రలకు దాదాపు దూరంగా ఉంటారు. కానీ, అనుష్కలాంటి కొంతమంది తారలు మాత్రం పాత్ర డిమాండ్ చేస్తే, తగ్గుతారు, పెరుగుతారు. అందుకు ఓ ఉదాహరణ ‘బిల్లా’. ఆ సినిమా కోసం బరువు తగ్గిన అనుష్క తాజాగా ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగారు.
 
  ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్‌లో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో అనుష్కను చూసి ఆందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పరిగెత్తుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తే, మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం. వాస్తవానికి ఈ పాత్ర గురించి చెప్పగానే అనుష్క తనంతట తాను బరువు పెరగాలని నిర్ణయించుకున్నారట. ఆ విషయం గురించి అనుష్క ‘సాక్షి’తో మాట్లాడుతూ - ‘‘ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగిందో తెలిసిందే. ఏదైనా ట్రిక్ చేసి, లావుగా కనబడేలా చేయొచ్చు. కానీ, నాకది ఇష్టం లేదు.
 
 అందుకే బరువు పెరగాలని దర్శక, నిర్మాతలు నాకు నిబంధన విధించకపోయినా పెరుగుతానని నా అంతట నేనే చెప్పాను. దీనికోసం ఎక్కువ ఆహారం తీసుకున్నాను. కానీ, ఆరోగ్యకరమైనదే తీసుకున్నాను. అందరూ లడ్డూలా ఉన్నావంటూ బుగ్గలు నిమిరారు. ‘సైజ్ జీరో’ చాలా స్వీట్ స్క్రిప్ట్. మంచి మెసేజ్ ఉంది. ప్రతి అమ్మాయీ ఈ చిత్రంతో కనెక్ట్ అవుతుంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement