![Prabhas Fans Go Overboard Set Fire In Theatre During Billa Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/23/prabhas-fans.jpg.webp?itok=Llz1q477)
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు చేసిన అత్యుత్సాహంతో థియేటర్‌లో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా వెంకట్రామ థియేరట్‌లో బిల్లా సినిమాను రీరిలీజ్ చేశారు. చాలాకాలంగా మూతబడిన ఈ థియేరట్‌ను అభిమానుల కోరిక మేరకు బిల్లా స్పెషల్ షో వేయించారు.
అయితే సినిమా చూస్తూ థియేటర్‌లో బాణసంచా పేల్చడంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగుతు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.
Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx
— 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022
Comments
Please login to add a commentAdd a comment