మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' థియేటర్లలోకి వచ్చేసింది. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. అభిమానులు బాగుందని చెబుతుంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ వీకెండ్ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఎందులో ఎప్పుడు రావొచ్చు?
(ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ)
కథేంటి?
మహాలక్ష‍్మి (కీర్తి సురేశ్) మంచి పెయింటర్. కోల్‌కతాలో మంచి ఆర్ట్స్ కాలేజీ ఉందని, చెల్లితోపాటు అన్నయ్య శంకర్(చిరంజీవి) అక్కడికి షిప్ట్ అవుతాడు. చెల్లిని కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయిలని కిడ్నాప్ చేసే ఓ ముఠాతో చిరుకు వైరం ఏర్పడుతుంది. దీంతో శంకర్, మహాలక్ష‍్మిని విలన్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది 'భోళా శంకర్' స్టోరీ.
ఆ ఓటీటీలోనే
'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తీసిన 'భోళా శంకర్'కు మెహర్ రమేశ్ దర్శకుడు. ఈ మూవీలో చిరుకు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తే, జోడీగా తమన్నా యాక్ట్ చేసింది. సుశాంత్ ఓ పాత్రలో నటించాడు. గెటప్ శీను, శ్రీముఖి, రష్మి తదితరులు సహాయపాత్రలు చేశారు. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బహుశా 5-6 వారాల తర్వాత అంటే సెప్టెంబరు చివరికల్లా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: )
Comments
Please login to add a commentAdd a comment