భారత అమ్ముల పొదికి ఆకాశ్ | Surface-to-air short range Akash missile system to be inducted into Indian Army today | Sakshi
Sakshi News home page

భారత అమ్ముల పొదికి ఆకాశ్

Published Tue, May 5 2015 11:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

భారత అమ్ముల పొదికి ఆకాశ్

భారత అమ్ముల పొదికి ఆకాశ్

న్యూఢిల్లీ: దాదాపు 32 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతోంది. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న భారత సైనికుల కల నెరవేరబోతుంది. భారతఅమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమై క్షిఫణి ఆకాశ్ మంగళవారం అధికారికంగా చేరనుంది. ఇందుకోసం ఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆకాశ్ను భారత సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్‌డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు.

       ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు

  • ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పనిచేస్తుంది.
  • ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్‌సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేకత.
  • ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్‌గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు.
  • ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యం అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది.
  • మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది.
  • మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు.
  • ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే లో కాస్ట్‌పర్ కిల్ అంటారు.
  • విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం ఆకాశ్ ఛేదిస్తుంది.
  • దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్‌లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎల్‌ఆర్‌డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
  • సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement