బక్ క్షిపణుల సామర్థ్యమిదీ...
ఉక్రెయిన్ గగనతలంపై దాదాపు 10 కి.మీ. ఎత్తులో ఎగురుతున్న మలేసియా విమానాన్ని ‘బక్’ రకం క్షిపణి కుప్పకూల్చడంతో దీని సామర్థ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని పనితీరును పరిశీలిస్తే...అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నాటి సోవియెట్ రష్యా ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల మధ్యశ్రేణి బక్ రకం క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది.సైనిక విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చేందుకు వీటిని వాడతారు.
ఈ క్షిపణులు 72 వేల అడుగుల ఎత్తులోని లక్ష్యాలను సైతం ఛేదించగలవు. (క్షిపణి ఢీకొట్టే సమయానికి మలేసియా విమానం 33 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది)ఒక్కో బక్ వ్యవస్థలో నాలుగు క్షిపణలు, రాడార్ వాహనం, లాంచ్ వాహనం, కమాండ్ కాంప్లెక్స్ ఉంటాయి. ఈ క్షిపణి రాడార్ సాయంతో నిర్దేశిత లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఒక్కసారి క్షిపణిని ప్రయోగించాక అది 30 కి.మీ ఎత్తు వరకూ ఎగరగలుగుతుంది.
ఒక్కో క్షిపణి అంచున 70 కిలోల పేలుడు పదార్థాలు ఉంటాయి. లక్ష్యాన్ని సమీపించగానే తొలుత క్షిపణి అంచు పేలిపోతుంది. అనంతరం మిగిలిన క్షిపణి భాగం పదునైన ఇనుప ముక్కలను లక్ష్యంపై చిమ్ముతుంది.{పస్తుతం ఉక్రెయిన్‌తోపాటు రష్యా దళాలు అత్యాధునిక ఎస్‌ఏ-17 రకం బక్ వ్యవస్థను వినియోగిస్తున్నాయి.