అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం  | Agni 2 Missile Has Success For First Time In Night Mode From Balasore | Sakshi
Sakshi News home page

అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం 

Published Sun, Nov 17 2019 7:38 AM | Last Updated on Sun, Nov 17 2019 7:40 AM

Agni 2 Missile Has Success For First Time In Night Mode From Balasore - Sakshi

బాలాసోర్‌ (ఒడిశా) : భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని 2’కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) కాంప్లెక్స్‌ 4 నుంచి దీన్ని పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి బరువు సుమారు 17 టన్నులు. మరో 1000 కేజీల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. అగ్ని–2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్‌ 11న పరీక్షించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 20న పరీక్షించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో చేరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement