
ఉత్తర కొరియా పేరు వినిపించగానే ఎవరికైనా సరే ముందుగా ‘మిసైల్ టెస్ట్’.. తరువాత ఆ దేశ నియంత కిమ్ జోంగ్ పేర్లు గుర్తుకువస్తాయి. తన వింత ప్రవవర్తన, ఆదేశాల కారణంగా కిమ్ జోంగ్ ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చర్చల్లో కనిపిస్తుంటాడు. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్‌న్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక ఏడాది వ్యవధిలో కిమ్‌జోంగ్ వందల కోట్ల విలువైన మద్యాన్ని తాగుతాడు. కిమ్ జోంగ్ తాగే మద్యానికి సంబంధించి ఒక్కో బాటిల్ విలువ వేల డాలర్లలో ఉంటుంది.
ఇతర దేశాలకు ఛాలెంజ్..
ఉత్తర కొరియాలో ఆర్థికపరిస్థితి మందగమనంలో ఉంది. దీనికితోడు దేశ నియంత తరచూ మిసైల్ పరీక్షలు నిర్వహిస్తూ, ఇతర దేశాలకు ఛాలెంజ్ విసురుతుంటాడు. జపాన్‌లోనూ ఇటువంటి నియంత పాలనే కొనసాగుందనే వాదనలు వినిపిస్తుంటాయి. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అతను తాగే ఖరీదైన మద్యం, ఖరీదైన సిగరెట్ల వినియోగం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాంసం అతని లగ్జరీ లైఫ్‌ను ప్రతిబింబిస్తాయి.
ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్లు..
ఆమధ్య విదేశీ మీడియాతో మాట్లాడిన బ్రిటన్ మంత్రి ఒకరు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మద్యపాన ప్రియుడని తెలిపారు. ఆయన బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ, ఖరీదైన హెన్సీ బ్రాండ్ తాగడాన్ని ఎంతో ఇష్టపడతారన్నారు. వీటికి సంబంధించిన ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్ల వరకూ ఉంటుందన్నారు. ఇంతేకాదు ఆయన అత్యంత ఖరీదైన వైవ్స్ సెంట్ లారెంట్ బ్లాక్ సిగరెట్ తాగుతాన్నారు. ఈ సిగరెట్ బంగారు రేపర్‌లో చుట్టి ఉంటుందన్నారు.
ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు..
కొన్నేళ్ల క్రితం చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిరంగపరిచిన గణాంకాల ప్రకారం 40 ఏళ్ల కిమ్‌జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో హైక్వాలిటీ మద్యం తాగేందుకు ఏటా 30 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తారు. ఇంతేగాదు భోజన ప్రియుడైన కిమ్ జోంగ్ ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు ఆరగిస్తారు. మద్యం, సిగరెట్ల అలవాటు కారణంగానే అతని బరువు 136 కిలోలకు చేరుకుందని అక్కడి నిపుణులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment