రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత ఊరు క్రైవీ రిహ్ పట్టణం మీద రష్యా మిసైళ్ళతో దాడి చేసింది. డెనిప్రో పెట్రోవ్స్క్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలపై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మరణించగా కనీసం 25మంది తీవ్ర గాయాలు పాలై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు.
మృతులు పెరగొచ్చు..
రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి సాధించుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది రష్యా. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ లో మిసైళ్ళతో జనావాసాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఒక ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నేలకూలింది. ఇదే భవనంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయని శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్.
దారుణమైన దృష్యాలు..
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంఘటన తాలూకు ఫోటోలను కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. రష్యా తీవ్రవాదులు జనావాసాలపైన, సామాన్య నగరాల పైన దాడులకు తెగబడ్డారని రాసి ఫోటోలు జతచేశారు. శిధిలమైన ఐదంతస్తుల భవనం, ఛిద్రమైన వాహనాలతో కూడిన ఈ ఫోటోలు హృదయవిదారకంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..
Comments
Please login to add a commentAdd a comment