ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులు ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంపై పడ్డాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 61 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నిహివ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది.
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం మూడవ సంవత్సరంలోకి ప్రవేశించించింది. ఈ యుద్ధంలో రష్యా తన సత్తా చాటుతోంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సామగ్రిని అందించకపోవడంతో అది రష్యాతో తలపడలేకపోతోంది. ఇంతలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్‌కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్‌ను పంపిణీ చేయనున్నమని ప్రకటించారు.
పాశ్చాత్య దేశాలు తమ దేశానికి వాయు రక్షణ వ్యవస్థలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అభ్యర్థించారు. తమకు తగిన వాయు రక్షణ పరికరాలు ఇప్పటికే అందివుంటే, రష్యా దాడులకు తిప్పికొట్టేవారమని అన్నారు. క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు తమ దగ్గరున్న వాయు రక్షణ క్షిపణులు అయిపోయాయని జెలెన్‌స్కీ తెలిపారు. కాగా ఇటీవల రష్యా .. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్‌లలో ఒకదానిని ధ్వంసం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment