దక్షిణ ఉక్రెయిన్‌లోని ఓ నగరంపై రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. క్షిపణుల ద్వారా రష్యా ఈ దాడులను చేసింది. ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. విల్న్యాన్స్క్‌లోని పార్కులో మృతదేహాలు పడి ఉన్న ఫోటోలను స్థానిక అధికారులు విడుదల చేశారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. ఫెడోరోవ్ టెలిగ్రామ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో విల్న్యాన్స్క్‌లోని ఒక దుకాణం, నివాస భవనం దెబ్బతిన్నాయి. ఈ దాడి నేపధ్యంలో ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా రష్యా దాడుల కట్టడికి భాగస్వామ్య దేశాలకు పిలుపునిచ్చారు.
రష్యాలోని ఆరు ప్రాంతాలలో తమ బలగాలు 36 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి ఒక రోజు ముందు ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడికి దిగింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment