కీవ్: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలుగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ భీకరమైన యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాది మంది వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక ఉక్రెయిన్ రష్యా దాడుల్లో తాను ఎదర్కొన్న భయంకరమైన చేదు అనుభవం గురించి వివరించాడు. ఈ మేరకు 33 ఏళ్ల మైకోలా కులిచెంకో తన భయానక అనుభవాన్ని వివరించాడు...
"రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడతూ దాడులు చేసి సరిగ్గా మూడువారాలైంది. మార్చి 18న అనుహ్యంగా ఒక రోజు రష్యా బలగాలు తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తమ ఇంటిని చుట్టుముట్టి రష్యన్ దళాలపై బాంబు దాడి చేస్తున్నవారి కోసం గాలించారు. తమ దళాలలపై దాడిచేసే వాళ్లతో సంబంధం ఉందనే అనుమానంతో మా ఇంటిని సోదా చేయడం మొదలు పెట్టారు. ఐతే మా తాతా పారామిలటరీకి సంబంధించినవాడు కావడంతో ఇంట్లో ఉండే మిలటరీ బ్యాగ్, పతకాలను చూసి ఆర్మీకి చెందిన వారిగా భావించి తమ పై కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు నన్ను మా అన్నలిద్దరిని కళ్లకు గంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి మూడు రోజులపాలు హింసించారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేస్తారు అనుకున్నాం కానీ వారు కర్కసంగా మా తలల పై గన్‌పెట్టి కాల్పుల జరిపారు. మొదటగా మా పెద్ద అన్న, ఆ తర్వాత రెండో అన్న తదనంతరం నాపై కాల్పుల జరిపారు. ఆ తర్వాత మా ముగ్గుర్ని ఒక గొయ్యిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఐతే తానుఎంతసేపు ఆ గోతిలో ఉండిపోయానో గుర్తులేదు కానీ ఆ తర్వాత స్ప్రుహ వచ్చాక ఊపిరాడక పోవడంతో తన అన్నలను తనపైనే ఉండటం వల్ల బరువుగా ఉందని గమనించి నా చేతులు కాళ్ల సాయంతో వారిని పక్కకు తోసి ఏదో విధంగా ఆ గోయ్యి నుంచి బయటప్డడానని చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి బుల్లెట్ తన చెంప మీద నుంచి కుడి చెవి వైపుకు రాసుకుంటూ వెళ్లిపోవడం వల్ల తాను లక్కీగా బతకగలిగానని చెప్పాడు. ఆ తర్వాత తాను పొలానికి సమీపంలోని ఇంటికి వెళ్లి ఆశ్రయం పోందినట్లు వివరించాడు. తాను ఆ విషాద ఘటన నుంచి బతికి బట్టగట్టగలుగుతానని కూడా అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి విషాద ఘటనలు ఉక్రెయిన్ అంతటా కోకొల్లలు అంటూ ఆవేదనగా చెబుతున్నాడు.
(చదవండి: టిట్ ఫర్ టాట్: పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా)
Comments
Please login to add a commentAdd a comment