ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష
సియోల్: అణు బాంబు వేస్తామంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా ఆదివారం ఖండాం తర క్షిపణిని పరీక్షించింది. క్షిపణి సుమారు 800 కి.మీ. ప్రయాణించి జపాన్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో పడింది.
ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా మిలటరీ బృందం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రయోగంతో ఇటీవల ఎన్నికైన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో పాటు పసిఫిక్ మహా సముద్రంలో మోహరించిన జపాన్, అమెరికా, యూరప్ నౌకా దళాలకు ఉత్తర కొరియా సవాల్ విసిరింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షపై జపాన్ అధ్యక్షుడు షింజో అబే మాట్లాడుతూ.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని చెప్పారు.