Nuclear bomb
-
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణుబాంబు హెచ్చరికలు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌కు కీలక హెచ్చరికలు చేసింది. తమ దేశానికి ముప్పు ఉందంటే అణుబాంబలు తయారుచేయడానికైనా తాము వెనకాడబోమని ఇరాన్ పేర్కొంది.‘మేము అణుబాంబులు తయారు చేసేందుకు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ వంటి దేశంతో.. మా దేశ ఉనికి ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా మిలిటరీ సిద్ధాంతాలను మార్చుకుంటాం. మా అణు కేంద్రాలపై ఇజ్రయెల్ దాడికి పాల్పడితే.. మా అణు సిద్ధాంతలను కూడా మార్చుకుంటాం’ అని ఇరాన్ సుప్రీ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ తెలిపారు.ఏప్రిల్‌లో సిరియా రాజధాని నగరంలో ఇరాన్ ఎంబసీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పై దాడులకు తెగపడినట్లు అంతర్జాతీయా మీడియా కథనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరు ఇరాన్- ఇజ్రయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇక.. ఇరాన్‌కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా ఎజెండాలో లేదని గతంలో ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్ 60 శాతం స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యాన్ని సాధించిందని తెలుస్తోంది. కాగా, 90శాతం వరకు స్వచ్ఛతను సాధిస్తే అణు బాంబులను తయారు చేయడానికి వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
‘హిరోషిమా’ కంటే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీ: అమెరికా
వాషింగ్టన్: అటు ఏడాదిన్నర దాటినా ఆగని రష్యా–ఉక్రెయిన్ యుద్ధం. ఇటు తాజాగా పాలస్తీనా–హమాస్ పోరు. ఇంకోవైపు భయపెడుతున్న చైనా–తైవాన్ తదితర ఉద్రిక్తతలు. ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని మరింత పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్ అణు బాంబును తయారు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. అది రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తిమంతంగా ఉండనుందని వెల్లడించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు లెక్కలేనంత జన నష్టానికి దారితీయడం తెలిసిందే. ఆ విధ్వంసాన్ని తలచుకుని జపాన్ ఇప్పటికీ వణికిపోతుంటుంది. హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తిని, నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలో టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని వెలువరిస్తుందని చెబుతున్నారు. బి61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందిస్తున్న ఈ బాంబును బి61–13గా పిలుస్తున్నారు. దీని తయారీకి అమెరికా కాంగ్రెస్ అనుమతి లభించాల్సి ఉంది. అంతేగాక తమ అమ్ములపొదిలో ఉన్న అణ్వాయుధాలను 2030 కల్లా 1,000కి పెంచనున్నట్టు కూడా అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? -
మా దగ్గర అణుబాంబు ఉంది!
మా దగ్గర అణుబాంబు ఉంది! -
వామ్మో.. అణుబాంబు పేలితే ఇట్లా ఉంటదా?
వైరల్: అణు యుద్ధం రాకూడదనేది ప్రతీ ఒక్కరి ప్రార్థన. ఎందుకంటే ఆ పేలుడు తీవ్రత అంత దుష్పరిణామాలకు దారి తీస్తుంది కాబట్టి. అణు బాంబు పడితే ఆ ప్రభావం ఎలా ఉంటదో మనకు తెలియంది కాదు. జపాన్ నగరాలు హీరోషిమా, నాగసాకిలు రెండో ప్రపంచ యుద్ధసమయంలో న్యూక్లియర్ బాంబులు పడి.. ఎంతో దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయో ప్రపంచం కళ్లారా వీక్షించింది. అయితే ఆ పేలుడు తీవ్రతను ప్రత్యక్షంగా చూడాలని ఉందా? ప్రాక్టికల్‌గా సాధ్యంకానీ ఈ అంశాన్ని వర్చువల్‌గా చూసేందుకు వీలయ్యింది. ఆహ్లాదంగా ఉన్న ఓ బీచ్‌లో హఠాత్తుగా అణు బాంబు పేలితే ఎలా ఉంటుంది? ఆ అనుభవమే అందిస్తోంది ఈ వీడియో.. అదేదో సినిమాలో వర్ణించినట్లు.. అణు బాంబు పడితే చెట్టు-చేమ బుగ్గిపాలయ్యాయి. నింగి మధ్యలో భారీ పొగ, ధూళి అలుముకున్నాయి. ఆ దెబ్బకు ఆకాశం రంగు మారిపోయింది. వర్చువల్‌గా న్యూక్లియర్ పేలుడుకు సంబంధించిన ఈ వీడియో పాతదే అయినా.. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ, అణు యుద్ధ బెదిరింపుల నేపథ్యంలో మళ్లీ రెడ్డిట్ వెబ్సైట్ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. -
హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్ కీలక వ్యాఖ్యలు... షాక్‌లో ఫ్రాన్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సంభాషించారు. ఆ సంభాషణలో జపాన్ అణుబాంబు దాడుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. పుతిన్ మరోసారి అణుదాడుల గురించి సంభాషించడం దిగ్భ్రాంతి గురి చేసిందని యూకే స్థానిక మీడియా డైలిమెయిల్ పేర్కొంది. అదీగాక పుతిన్ అవసరమైతే ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణుదాడులు చేస్తానంటూ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో పుతిన్ సంభాషిస్తూ...1945లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా తన మొదటి అణుబాంబును వేసిన మూడు రోజుల తర్వాత యూఎస్ జపాన్‌లోని నాగసాకిని లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని పునురుద్ఘాటించారు. జపాన్ లొంగిపోయేలా రెండో ప్రపంచ యుద్ధం ముగిసేలా జరిపిన బాంబు దాడులు గురించి మాట్లాడారు. అలాగే తాము గెలవాలంటే ప్రధాన నగరాలపై దాడిచేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా అణు దాడికి రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అంతేగాదు మాక్రాన్‌తో పుతిన్ కీవ్‌ని వదిలేసి తూర్పు ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణుదాడి చేసే అవకాశం ఉందనే సంకేతం ఇచ్చారని డెయిల్ మెయిల్ పేర్కొంది. కానీ రష్యా పదేపదే తన నియంత్రణలో ఉ్నన ఖేర్సన్ ప్రాంతంపై డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఆరోపణలు చేస్తోంది. ఐతే ఉక్రెయిన్ విదేశంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా తాను చేస్తున్న కుట్రని ఇతరులు చేస్తున్నట్లుగా చిత్రీకరించడం అలవాటు అంటూ మండిపడ్డారు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
డర్టీ బాంబ్‌పై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. రష్యాకు హెచ్చరికలు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఆ దేశం ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే క్షమించరాని తప్పిదం చేసినట్లే అని స్ఫష్టం చేశారు. శ్వేతసౌధంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డర్టీ బాంబ్(అణు బాంబ్)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బైడెన్ ఈమేరకు స్పందించారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తలు నిజమో కాదో తనకు తెలియదని, ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా డర్టీ బాంబ్‌ను ప్రయోగిస్తే మాత్రం తీవ్ర తప్పిదం చేసినట్లేనని పేర్కొన్నారు. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే రష్యా మాత్రం ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో దాడి చేయబోతుందని చెప్పింది. సొంతప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి దాన్ని తమపై తోసేందుకు కుట్ర చేస్తోందని పేర్కొంది. ఖేర్సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తోంది. డర్టీ బాంబ్ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనే తేల్చుకుంటామంది. మరోవైపు రష్యా ఆరోపణలను నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాయి. చదవండి: డర్టీ బాంబ్ పంచాయితీ భద్రతా మండలికి! -
రష్యా అణుబాంబు ప్రయోగిస్తే ప్రపంచమే భస్మీపటలం అవుతుందని హెచ్చరికలు
-
కింజల్‌ను తొలిసారి ప్రయోగించిన రష్యా.. ఆందోళనలో ఉక్రెయిన్
కీవ్: బాంబుల మోతలు, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్ వణికిపోతోంది. యుద్ధం మొదలై 25 రోజులు గడుస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో రష్యా మరింత రెచ్చిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షలు ఓవైపు, స్వదేశంలో కూడా నిరసన గళాలు మరోవైపు వెరసి అధ్యక్షుడు పుతిన్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో సైనిక స్థావరాలే కాకుండా సామాన్య ప్రజలను టార్గెట్ రష్యా చేసింది. ఈక్రమంలో భారీ ఎత్తున బాంబులు ప్రయోగిస్తోంది. తొలిసారి కింజల్ ప్రయోగం తాజాగా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’ను కూడా ప్రయోగించింది. ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి కింజల్ విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. దీంతో రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. అంచనాకు కూడా అందడం లేదు రష్యా ప్రయోగిస్తున్న బాంబులు, క్షిపణుల్లో పేలనివాటిని, తమ సైన్యం అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసేందుకు ఎన్నేళ్లు పడుతుందో అంచనాకు కూడా అందడం లేదని ఉక్రెయిన్ ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధం ముగిశాక అమెరికా, యూరప్ దేశాలు ఇందుకు సాయం చేయాలని కోరింది. వాటిని నిర్వీర్యం చేసే సామగ్రి మారియుపోల్‌లో నాశనమైపోయిందని చెప్పింది. (చదవండి: ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!) -
బాప్ ఆఫ్ ఆల్ బాంబ్స్
ఆ వార్త విన్నప్పటి నుంచి ఉత్తర కొరియా పెసిడెంటు కిమ్ జోంగ్ మనసు మనసులో లేదు. దినపత్రికను నూటా రెండోసారి తిరిగేశాడు.... ఆ వార్తను మళ్లీ చదివాడు. అది ఇలా ఉంది: ‘అగ్రదేశాలు చైనా, అమెరికాలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో ఒక బాంబును తయారుచేశాయి. ప్రపంచంలోనే నంబర్‌వన్ బాంబు ఇది. దీని ప్రత్యేకతలు ఏమిటంటే...’’\ అసహనంగా పేపర్ గిరాటు వేశాడు కిమ్. ‘‘అయ్యా!ఏమిటి డల్‌గా ఉన్నారు?’’ అని చుట్ట చేతికిస్తూ అడిగాడు కిమ్ పీయే కుమ్ డాంగ్. ‘‘నా పేరు చెప్పగానే హైట్రోజన్బాంబు, అణుబాంబు... ఎక్సెట్రా ఎక్సెట్రా బాంబులు గుర్తుకువచ్చేవి. దేశదేశాలు గజగజా వణికేవి. కానీ ఇప్పుడు చైనా, అమెరికాలు ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ తయారుచేశాయట. ఇక నాకెందుకు భయపడతారు. ఇలా చుట్టలు తాగుతూ ఒక మూలన కూర్చోవల్సిందే’’ గాద్గదిక స్వరంతో నిట్టూర్చాడు కిమ్. ‘‘మీరు అధైర్యపడవద్దు... ప్రపంచమంతా ఒక ఎత్తు మీరు ఒక ఎత్తు. ఎవరు మీకు సాటిలేరు...నీ దూకుడు సాటెవ్వడూ’’ అని పొగడ్తల మద్దెల మోగించాడు కుమ్ డాంగ్. ఈ పొగడ్తలతో కాస్త పైకి లేచాడు కిమ్. దేశంలోని ముఖ్యమైన శాస్త్రవేత్తలందరికీ ఫోన్లు చేశాడు. అందరూ భయంభయంగా కిమ్ ఇంటికి పరుగులు తీశారు. వారిని ఉద్దేశించి కిమ్ ఇలా ప్రసంగించాడు:‘‘గజగజా వణకాల్సింది మీరు కాదు.... ప్రపంచం. మీకు తెలుసు కదా...చైనా,అమెరికాలు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో సరికొత్త బాంబును తయారుచేసి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. నేను బతికున్నంత వరకు అది జరగని పని. డియర్ కామ్రేడ్స్.... మీకు ఒక నెల టైమ్ ఇస్తున్నాను. ఏంచేస్తారో ఏమిటో నాకు తెలియదు. ఆ బాంబును మించిన బాంబును తయారుచేయాలి. దాని పేరు కూడా ఇప్పుడే పెట్టేస్తున్నాను.... బాప్ ఆఫ్ ఆల్ బాంబ్స్! ఓకే...ఇక పనిలోకి దిగండి...’’నెల రోజుల పాటు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేశారు.జుత్తు పీక్కున్నారు. పక్కోడి జుట్టు కూడా పీకారు.అసహనం, ఆగ్రహం, అసంతృప్తి తప్ప కొత్త బాంబేదీ రాలేదు.‘‘అయ్యా మమ్మల్ని క్షమించండి.నిద్రాహారాలు మాని ఎన్నో ప్రయోగాలు చేశాం. ఎంత చేసినా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ సమీపంలోకి కూడా వెళ్లలేకపోతున్నాం’’ అని పెద్ద పెట్టున ఏడ్చారు శాస్త్రవేత్తలు.‘‘మీరు ఏడ్వడానికి తప్ప ఎందుకు పనికిరారు. వెళ్లి చావండి’’ అని తిట్టి చుట్ట వెలిగించాడు కిమ్.ఈలోపు ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ టీవీలో హడావుడి మొదలైంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు...‘‘ప్రపంచ ప్రజలారా... మీకు కోడి పందేల గురించి తెలుసు... కానీ బాంబుల పందేలా గురించి తెలియదు. తొలిసారిగా ప్రపంచచరిత్రలో ఇండియాలోని సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిదేశం ఇక్కడ తమ బాంబులను ప్రదర్శించవచ్చు.... ఎవరి బాంబు స్ట్రాంగో వారికి అమెరికాను, చైనాను రెండు సంవత్సరాలు పాలించే బంపర్ ఆఫ్ ఇస్తున్నాం. ఎవరూ గెలవకపోతే...అందరూ కలిసి మెక్సికో–యూఎస్ గోడకట్టివ్వాలి’’ అన్నాడు. ‘‘మంచి చాన్సు. తాడో పేడో తేల్చుకుంటాను’’ మీసానికి బదులు తల దువ్వాడు కిమ్. ఆరోజు జంటనగరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.ఎటు చూసినా జనాలే జనాలు! బాంబుల పోటీలో పాల్గొనడానికి దేశదేశాల వాళ్లు వచ్చారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాయంత్రం రిజల్ట్ వచ్చింది. ‘విజేత కిమ్..... జొంగ్!’ అని ప్రకటించారు.‘‘నార్త్ కొరియా పెసిడెంట్‌గారి బాప్ ఆఫ్ ఆల్బాంబ్స్కు మొదటి బహుమతి వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’’ అని ఏడుస్తూ ప్రకటించాడు ట్రంప్.‘‘విక్రమార్కామదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు దీటుగా బాంబు తయారుచేయలేమని శాస్త్రవేత్తలు చేతులు కాళ్లెత్తేసిన తరువాత కూడా కిమ్ అంత పెద్ద బాంబును ఎలా తయారుచేయగలిగాడు?! నిజానికి కిమ్‌కు దీపావళి టపాసులు కూడా తయారుచేసే పరిజ్ఞానం లేదు. హౌ ఇట్ ఈజ్ పాజిబుల్!’’ అడిగాడు బేతాళుడు.‘‘కిమ్ తన నోరును నమ్ముకున్నాడు. అదే...బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్’’ కూల్‌గా చెప్పాడు విక్రమార్కుడు.‘‘నువ్వు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు... నోరేమిటి? బాంబేమిటి!’’ ఆశ్చర్యంగా అరిచాడు భేతాళుడు.‘‘అయితే చెబుతా విను’’ అంటూ ఇలా చెప్పాడు విక్రమార్కుడు:‘‘సంగీతం అనేది మంచినోళ్లలో ఉంటే మహాశక్తి జనిస్తుంది. అరుదైన రోగాలు కూడా నయమవుతాయి. అదే చెడునోట్లో పడితే విధ్వంస శక్తి జనిస్తుంది. అరుదైన రోగాలు వస్తాయి...బాంబును బాంబుతో ఎదుర్కోవడం అనేది పాత మాట...బాంబును మ్యూజిక్‌తో ఎదుర్కోవడం నా బాట అంటూ.... ప్రపంచంలోని రకరకాల మ్యూజిక్‌ను నెలరోజుల్లో నేర్చుకునే ప్రయత్నం చేశాడు కిమ్. గాత్రసంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు. చివరికి ఒకరోజు ఆయనకు గొప్ప ఆలోచన వచ్చింది.సకల సంగీతాలను మిక్స్ చేసి తన గొంతుతో ఆలపిస్తే గొప్పశక్తి విడుదల అవుతుందని కల కన్నాడు. ఆ కల అక్షరాలా నిజమైంది. ఆరోజు జింఖాన గ్రౌండ్లో అన్ని దేశాల బాంబుల ప్రదర్శన జరిగిన తరువాత....‘‘మీ బాంబు ఎక్కడ?’’ అని అడిగారు నిర్వాహకులు.‘‘నా నోరే నా బాంబు అంటూ.... అటు ఆఫ్రికన్ ఫోక్ జిమ్–బో–ల నుంచి ఇటు హిందుస్థానీ, కర్నాటక సంగీతం వరకు అన్నీ కలగలిపి...గొంతు విప్పాడు ఇలా....‘సికుయో యెలిజివి లోబోమినోయన నోయన నితినిసారజవర గమన సారజవరగమన.... ఎన్నియెళ్లు ఎన్నియెళ్లో ఎన్నియేళ్లు...దొర ఏందిరో వాని జులుము ఎందిరో...’అంతే..... భారీ విస్ఫోటం. చెల్లాచెదురుగా ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు.‘‘నేను...గొంతు విప్పి రెండు నిమిషాలు కూడా పాడకముందే ఇంత విధ్వంసం జరిగితే....పదినిమిషాలు ఏకధాటిగా పాడితే.... నా నోటి ముందు ఏ బాంబు సరిపోదు...’’ అన్నాడు కిమ్.‘‘నిజమే’’ అని ఏకగ్రీవంగా ఒప్పుకొని కిమ్‌ను విజేతగా ప్రకటించి ఆయన నోటికి ‘బాప్ ఆఫ్ ఆల్‌బాంబ్స్’ అనే నామకరణం చేశారు దేశాధీశులు. – యాకుబ్ పాషా -
‘మా స్థాయికి తగ్గట్టు లేదు.. క్షమించండి’
వాషింగ్టన్ : అగ్రరాజ్య అణ్వాయుధాగారాన్ని పర్యవేక్షించే అమెరికా స్ట్రాటజిక్ కమాండ్(యూఎస్సీ).. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఏడాదిలో పెద్ద బాల్‌ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే అంతకంతకూ దాని పరిధి పెరుగతూనే ఉంటుంది’ అని యూఎస్సీ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు యూఎస్సీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘అసలు ఎలాంటి మనుషులు మీరు. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ట్రంప్ కొత్త ఆలోచన ఇదేనా. బాంబులు పేలుస్తామంటూ అమెరికన్లందరినీ బెంబేలెత్తించారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారు’ అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన యూఎస్సీ... ‘నూతన సంవత్సరం సందర్భంగా చేసిన పాత ట్వీట్‌కు చింతిస్తున్నాం. అది మా విలువలు, స్థాయికి తగ్గట్టుగా లేదు. క్షమించండి. అమెరికా, దాని మిత్ర దేశాల భద్రతను పర్యవేక్షించడమే మా పని’ అంటూ మరో ట్వీట్ చేసింది. Our previous NYE tweet was in poor taste & does not reflect our values. We apologize. We are dedicated to the security of America & allies. — US Strategic Command (@US_Stratcom) December 31, 2018 Your tweet goes beyond needing an apology. What kind of people are you letting represent you? Is this the new dystopian Trump view? You alarmed many Americans with your tweet about bombing. Including a video of a bombing is beyond just an apology, this is reprehensible. pic.twitter.com/E52KBJ3Clh — B. Janine Morison (@bjaninemorison) January 1, 2019 -
హైదరాబాద్‌పై అణుదాడి జరిగితే..
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఆయుధం అణుబాంబు. అణుబాంబు విస్ఫోటన చెందడం వల్ల జరిగే నష్ట తీవ్రత ఊహలకు అందదు. అలాంటి ఆయుధాల సామర్ధ్యాన్ని కొన్ని దేశాలు మరింత పెంచుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔట్ రైడర్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ అణు ఆయుధాల తీవ్రతపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు నడుంబిగించింది. ఈ నేపథ్యంలోనే అణు ఆయుధాలపై పరిశోధన నిర్వహిస్తున్న ఓ నిపుణుడితో వాటి ప్రభావాన్ని లెక్కించింది. అణుదాడి మన ప్రాంతంలో జరిగితే దాని శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ శాంపిల్ టూల్ మ్యాప్‌ను అభివృద్ధి చేసింది. దాని ద్వారా వివిధ ప్రాంతాల్లో అణుదాడి కలుగజేసే నష్టాన్ని ఊహించవచ్చు. అమెరికాకు చెందిన 15కేటీ లిటిల్ బాయ్, 300కేటీ డబ్ల్యూ-87, ఉత్తరకొరియాకు చెందిన 150కేటీ హస్వాంగ్-14 లాంటి అణుబాంబులను హైదరాబాద్‌పై ప్రయోగిస్తే జరిగే నష్ట తీవ్రత ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం. 15కేటీ లిటిల్ బాయ్ 1945 ఆగష్టు 6న రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా విసిరిన లిటిల్‌బాయ్ అణుబాంబును హైదరాబాద్‌పై ప్రయోగిస్తే 1,43,879 మంది ప్రాణాలు కోల్పోవచ్చు. 2, 86, 939 మంది గాయాలపాలు కావొచ్చు. లిటిల్ బాయ్ బాంబును ప్రయోగించిన చోటు నుంచి 0.07 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడతాయి. బాంబు దాడి నుంచి ఉద్భవించే రేడియేషన్ పరిధి 2.18 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాడి వల్ల ఉత్పత్తి అయ్యే వేడి ప్రభావం 3.44 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు. 300కేటీ డబ్ల్యూ-87 అమెరికానే అభివృద్ధి చేసిన 300కేటీ డబ్ల్యూ-87 అణుబాంబుతో హైదరాబాద్‌పై దాడి జరిగితే నష్ట తీవ్రత లిటిల్ బాయ్ వల్ల జరిగే దాని కన్నా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఈ దాడిలో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 13 లక్షలకు పైచిలుకు ప్రజలు గాయపడొచ్చు. 300కేటీ డబ్ల్యూ-87ను విస్ఫోటనం చెందిన ప్రదేశం నుంచి 0.73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడతాయి. పేలుడు నుంచి ఏర్పడే రేడియేషన్ పరిధి 5.56 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాడి వల్ల ఉత్పత్తి అయ్యే వేడి ప్రభావం 48.54 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు. 150కేటీ హస్వాంగ్-14 ఉత్తరకొరియా అభివృద్ధి చేసిన హస్వాంగ్-14 అణుబాంబును హైదరాబాద్‌పై ప్రయోగిస్తే ఆ దాడిలో ఎనిమిది లక్షల మందికి పైచిలుకు ప్రాణనష్టం వాటిల్లొచ్చు. 13 లక్షలకు పైచిలుకు ప్రజలు గాయపడొచ్చు. హస్వాంగ్-14 విస్ఫోటనం చెందిన ప్రదేశం నుంచి 0.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగసిపడతాయి. పేలుడు నుంచి వచ్చే రేడియేషన్ పరిధి 4.56 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. వేడి ప్రభావం 26.42 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు. అణు దాడులకు సంబంధించిన ఊహాజనిత నష్టాలను అణు ఆయుధాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త అలెక్స్ వెల్లర్‌స్టెయిన్ అభివృద్ధి చేసిన టూల్ ద్వారా అంచనా వేస్తున్నారు. ఔట్ రైడర్ ఫౌండేషన్ సైతం అణు ఆయుధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏళ్లుగా కృషి చేస్తోంది. 2017లో ఐ-సీఏఎన్ అనే సంస్థ అణ్వస్త్ర నిరాయుధీకరణకు కృషి చేస్తున్నందుకు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. -
వందకోట్ల మంది ఖతం!
- అణుబాంబు పేలితే వచ్చే విపత్తు.. - నెబ్రాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకిపై పేలిన అణుబాంబులు ఎంతటి విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలుసు. అయితే అప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీలో ఎంతో మార్పు వచ్చింది. అణ్వస్త్రాలు మరింత శక్తిమంతమయ్యాయి. విధ్వంసక శక్తి కూడా ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా లింకన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం జరిపారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక్క అణుబాంబు పేలితే వచ్చే ఫలితాలపై విశ్లేషించారు. అధ్యయన ఫలితాలు చూస్తే.. ఎవరికైనా వెన్నులో భయం పుట్టాల్సిందే..! చైనా వద్ద ఉన్న ఐదు మెగాటన్నుల అణుబాంబు ఒక్కటి పేలితే.. భూ వాతావరణంలోకి దాదాపు లక్షల టన్నుల బ్లాక్ కార్బన్ చేరిపోతుంది.. ఇది సూర్యరశ్మిని అడ్డుకుని భూమ్మీద వెలుతురును తగ్గిస్తుంది. ప్రాంతాన్ని బట్టి వర్షాలు 20 నుంచి 80 శాతం వరకూ తగ్గిపోతాయి. ఐదేళ్ల పాటు పంటలు పండే కాలంలో పది నుంచి 40 రోజులు తగ్గిపోతాయి. ఈ మేరకు దిగుబడులూ తగ్గిపోవడంతో ప్రపంచమంతా కరువు అలుముకునే ప్రమాదం ఉంది. ఈ విపరీత వాతావరణ పరిస్థితులన్నింటి దృష్యా ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని నెబ్రాస్కా లింకన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనా ఇలా.. అణ్వస్త్ర ప్రభావాన్ని అంచనా వేసేందుకు నెబ్రాస్కా శాస్త్రవేత్తలు గతంలో చేసిన ఒక ప్రయోగాన్ని ఆధారంగా చేసుకున్నారు. భూమి మీద అణ్వస్త్ర ప్రేరేపిత శీతల పరిస్థితులు రావాలంటే దాదాపు 1,300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అణుబాంబుల ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుల సామర్థ్యం 15 కిలోటన్నులు కాగా.. దాని ప్రభావం 13 చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై పడింది. అంటే అలాంటివి వంద బాంబులు కావాలన్న మాట. అయితే ఇప్పుడు వివిధ దేశాల వద్ద ఇంతకంటే బలమైన అణ్వాయుధాలు చాలానే ఉన్నాయి. చైనా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన అణుబాంబు సామర్థ్యం 5 మెగాటన్నులు. ఇలాంటిది ఒక్కటి పేలినా భూమ్మీద చీకట్లు కమ్ముకోవడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అంచనాలు పూర్తిగా నిజమయ్యేందుకు అవకాశాలు తక్కువే. ఎందుకంటే అణ్వస్త్రం ద్వారా బ్లాక్ కార్బన్ లాంటి పదార్థాలు ఎంత మేరకు భూవాతావరణంలోకి చేరతాయన్న దానిపై స్పష్టత లేదు. -
వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు
వాషింగ్టన్/ప్యోంగ్ యాంగ్: క్షిపణి ప్రయోగాలతో తరచుగా వివాదాల్లో తలదూర్చే ఉత్తరకొరియా వద్ద ఇతరదేశాలు ఊహించనంత అణ్వస్త్ర సామర్థ్యం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇటీవల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడంపై ఈ అగ్రరాజ్యం సీరియస్‌గా ఉంది. అయితే ఉత్తరకొరియా మరిన్ని అణ్వాయుధాలను సిద్ధం చేస్తుందని, వినాశనం కోరుకోవడమే కిమ్ పని అంటూ అమెరికా మీడియా మండిపడింది. నార్త్‌కొరియా వద్ద ఇప్పటికే 20 అణు బాంబులు ఉన్నాయని, ఇకపై నెలకొక అణుబాంబు చొప్పున రూపొందించి వినాశనానికి తెరతీయనుందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమెరికా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలలో గమనిస్తే నార్త్ కొరియా వద్ద భారీ మోతాదులో ప్లూటోనియం, ఇతరత్రా అణ్వస్త్ర సామాగ్రి నిల్వ ఉండటం మరిన్ని ప్రయోగాలకు కిమ్ సిద్ధంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. రేడియోకెమికల్ ల్యాబోరేటరీలో మరో రెండు ప్రయోగాలకు సరిపోయే అణు పదార్థాలున్నాయని, దీనివల్ల ఉత్తరకొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలకు కాలుదువ్వడంపై అమెరికాలో ఆందోళన నెలకొంది. ఇటీవల ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అమెరికాలోని అలాస్కా ప్రాంతం వరకు సులువుగా చేరుకుంటుందని నిపుణులు అంచనా వేయడంతో కిమ్ ఆటకట్టించడానికి రష్యా, చైనా దేశాల సహకారం కావాలని అమెరికా యోచిస్తోంది. -
ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష
సియోల్: అణు బాంబు వేస్తామంటూ అమెరికాను భయపెడుతున్న ఉత్తర కొరియా ఆదివారం ఖండాం తర క్షిపణిని పరీక్షించింది. క్షిపణి సుమారు 800 కి.మీ. ప్రయాణించి జపాన్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా మిలటరీ బృందం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రయోగంతో ఇటీవల ఎన్నికైన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో పాటు పసిఫిక్ మహా సముద్రంలో మోహరించిన జపాన్, అమెరికా, యూరప్ నౌకా దళాలకు ఉత్తర కొరియా సవాల్ విసిరింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షపై జపాన్ అధ్యక్షుడు షింజో అబే మాట్లాడుతూ.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని చెప్పారు. -
అమరావతిలో అణుబాంబుల తయారీ అట!
- ఏపీ రాజధాని నిర్మాణాలపై పాక్ మీడియాలో అడ్డగోలు చర్చలు హైదరాబాద్: 'అమరావతిలో ఆటం బాంబులు తయారు చేయబోతున్నారు. నదీ తీరంలో నిర్మించనున్న ఈ నగరంలో అమెరికా మద్దతుతో లెక్కకు మిక్కిలి న్యూక్లియర్ రియాక్టర్లు, హ్రైడ్రోజన్ బాంబు తయారీ కేంద్రాలు కట్టబోతున్నారు. కావాలంటే వాటికి సంబంధించిన డిజైన్లు చూడండి. అటామిక్ సిటీ నిర్మాణం ద్వారా భారత్.. పాకిస్థాన్, చైనాలను భయపెట్టాలనుకుంటోంది' సత్యదూరమైన, అర్థం పర్థం లేని ఈ అడ్డగోలు మాటలు పాకిస్థాన్ టీవీ చర్చల్లో తరచూ వినిపిస్తున్నాయి. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లు.. ఇండియాలో జరిగే ఏ పనికైనా విపరీత అర్థాలు ఇస్తూ చెవాకులు పేలే పాక్ మీడియా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో న్యూక్లియర్ ప్లాంట్లు కడుతున్నారంది. 'పాకిస్థాన్ మీడియాలో జరిగిన చర్చాకార్యక్రమం' అంటూ ఒక చానెల్ ప్రసారం చేసిన కథనం ఆధారంగా పలు జాతీయ వార్తా సంస్థలు ఈ అంశంపై వార్తలను రాశాయి. గతేడాది డిసెంబర్ లోనూ అమరావతిపై పాక్ టీవీ చానెళ్లలో ఇలాంటి కథనాలు ప్రసారమయ్యాయి. ఇదీ అసలు నిజం.. అమరావతి మాస్టర్ ఆర్కిటెక్ట్ గా ఉన్న జపాన్ సంస్థ మాకీ అండ్ అసోసియేట్స్ కొద్ది నెలల కిందట రాజధాని డిజైన్లను రూపొందించి, ప్రభుత్వానికి అందించింది. అమరావతిలో బౌద్ధ అవశేషాలు ఉండటంతో.. కొత్తగా రూపొందించిన అసెంబ్లీ సహా ఇతర ముఖ్య నిర్మాణాల డిజైన్లను డోమ్ ల(ప్రాచీన బౌద్ధారామాల లాగా) మాదిరి రూపొందించారు. వీటిని దూరం నుంచి చూస్తే అచ్చం అణుశుద్ధి కేంద్రం లాగే కనిపిస్తుంది. అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఆ డిజైన్లను రద్దుచేసి, కొత్తవి ఇవ్వాల్సిందిగా మాకీ సంస్థను ఆదేశించింది. అదిగో, ఆ డిజైన్లను అడ్డంపెట్టుకునే పాక్ మీడియా ఏవేవో కథనాలు అల్లుతోంది. -
హిరోషిమాకు అణుబాంబు ఫొటోలు
వాషింగ్టన్: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌పై విసిరిన అణుబాంబుల తాలూకు చిత్రాలను ఆ దేశానికి ఇవ్వడానికి అమెరికా నిర్ణయించింది. 1945 ఆగస్టు 6,9 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత సైనిక ఉన్నతాధికారి లెస్లీ గ్రోవ్స్ వాషింగ్టన్లో పభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై జరిగిన విధ్వంసాన్ని వివరించారు. అపుడు ఆయన వెంట బాంబుల జారవిడిచినప్పటి ఛాయా చిత్రాలు ఉన్నాయి. వాషింగ్టన్ మేధావి బృందం స్టిమ్సన్ సెంటర్ సహవ్యవస్థాపకుడు మైఖేల్ క్రెపాన్ ఆ చిత్రాలనే ఏఎఫ్పీకి చూపించినట్లు వెల్లడించారు. సుమారు 20 చిత్రాలు 1990 నుంచి ఈ సంస్థ వద్దే ఉంటున్నాయి. వీటిని హిరోషిమా శాంతి స్మారక మ్యూజియానికి కానుకగా ఇవ్వాలని క్రెపాన్ గతేడాది నిర్ణయించారు. ఈ ఫోటోలను ఎలా ప్రదర్శిస్తారన్న దానిపై చర్చలు జరిపిన తరువాత 'కొద్ది రోజుల్లో జపాన్ పంపిస్తాం. స్టిమ్సన్ సెంటర్లో అయితే వీటిని ఎక్కువ మంది చూడలేరు' అని అన్నారు. మే 27న అమెరికా అధ్యక్షుడు ఒబామా హిరోషిమా సందర్శించి అక్కడి శాంతి స్మారక మ్యూజియంలో నివాళులు అర్పిస్తారు. లిటిల్‌బాయ్ పేరుతో విసిరిన అణుబాంబు హిరోషిమాలో లక్షా నలభై వేల మందిని బలితీసుకుంది. -
అమెరికాకు ఉత్తర కొరియా ‘అణుదాడి’హెచ్చరిక
సియోల్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై అణుబాంబుతో దాడిచేసినట్లు ఉత్తరకొరియా విడుదల చేసిన వీడియో సంచలనం రేపింది. దక్షిణకొరియా-అమెరికా భారీ సైనిక విన్యాసాలతో రగిలిపోతున్న ఉత్తరకొరియా... తమపై చిన్నపాటి దాడి జరిగినా వినాశనమే అంటూ మళ్లీ వీడియోతో హెచ్చరించింది. నాలుగు నిమిషాల నిడివి ఉన్న దీన్ని లాస్ట్ చాన్స్ పేరుతో శనివారం విడుదలచేసింది. సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించిన అణుబాంబు క్షిపణి మేఘాల గుండా ప్రయాణిస్తూ వాషింగ్టన్‌లోని లింక న్ మెమోరియల్ ముందు పడుతుంది. భవనం అగ్నికి ఆహుతవుతుండగా తెరపై ఒక హెచ్చరిక ప్రత్యక్షమవుతుంది. ఉత్తరకొరియా వైపు అంగుళం ముందుకొచ్చినా అణుబాంబులతో విరుచుకుపడతామంటూ కొరియా భాషలో కిమ్ జోంగ్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. -
భారత్‌కు ఆ సత్తా ఉంది
సరిహద్దుల రక్షణపై రక్షణ మంత్రి పారికర్ లక్నో: తమ మనుగడ కోసం అవసరమైతే అణు బాంబులను ఉపయోగిస్తామని పాకిస్తాన్ మంత్రి ఖ్వజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తిప్పికొట్టారు. తమ సరిహద్దులను రక్షించుకోగల సత్తా భారత్‌కు ఉందని గురువారం లక్నోలో స్పష్టంచేశారు. పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు పారికర్ పైవిధంగా స్పందించారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు రష్యాలో భేటీ అవుతున్న నేపథ్యంలో పారికర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్‌ను విడుదల చేసినందుకు పాకిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత చర్యను చైనా అడ్డుకుంటోందన్న ప్రశ్నకు బదులివ్వడానికి పారికర్ నిరాకరించారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ లేదా ప్రధానమంత్రి చూసుకుంటారన్నారు. పాక్ సరిహద్దులో మిలిటెంట్ల ఏరివేతకు మయన్మార్‌లో కమాండోలు జరిపిన ఆకస్మిక దాడిలాంటి చర్యలకు దిగుతారా అన్న ప్రశ్నకు, అవన్నీ ప్రభుత్వం రహస్యంగా చేసే చర్యలని, వీటిపై మీడియాతో పంచుకోలేమని బదులిచ్చారు. గతంతో పోలిస్తే తమ హయాంలో సరిహద్దు ఉగ్రవాదం తగ్గిందని పారికర్ చెప్పారు. త్వరలో శుభవార్త మాజీ సైనికుల దీర్ఘకాల డిమాండ్ ‘ఒక ర్యాంక్ ఒకే పింఛన్’(ఓఆర్ఓపీ)పై త్వరలోనే శుభవార్త వింటారని మనోహర్ పారికర్ వెల్లడించారు. రక్షణ శాఖ అంతర్గత వ్యవహారమైన ఈ అంశంపై తమ పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై శుభవార్త వెలువడనుందని స్పష్టం చేశారు. గతంలో ప్రధానమంత్రి మోదీ ఓఆర్ఓపీపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సూరత్‌లో అణుబాంబు పేల్చాలనుకున్నా!
న్యూఢిల్లీ: అణుబాంబు.. అత్యంత ఆధునిక ఆయుధం.. భారీస్థాయిలో ప్రాణనష్టాన్నే కాకుండా, తరాల తరబడి తీవ్ర ప్రభావం చూపగల మారణాయుధం. అది ముష్కరులు.. ముఖ్యంగా భారత్‌పై ఎల్లవేళలా విషం కక్కే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) లాంటి ఉగ్రవాద సంస్థల చేతికి చిక్కితే.. వారికి అవి యథేచ్ఛగా లభిస్తుంటే..! ఐఈడీ లాంటి బాంబులతోనే అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులు.. ఇక అణుబాంబు దాడులను ప్రారంభిస్తే..! ఆలోచిస్తేనే వణుకు పుట్టే పరిస్థితి. అయితే, అణు బాంబులు అంత ఈజీగా ఉగ్రవాదులకు లభించవని, వాటిని భద్రపరిచే, వినియోగించే సాంకేతికత వారి దగ్గర లేదనే నమ్మకంతో మనమే కాదు, మన నిఘా సంస్థలూ ఉన్నాయి. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా పలు కళ్లు చెదిరే వాస్తవాలను ఇండియన్ ముజాహిదీన్ ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడిస్తున్నాడు. ప్రస్తుతం జాతీయ నిఘా సంస్థ(నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అదుపులో ఉన్న యాసిన్ ఐఎం ప్రణాళికలను, శిక్షణ విధానాలను, సహాయం అందిస్తున్న వారి వివరాలను ఇంటరాగేషన్ సందర్భంగా వెల్లడిస్తున్నాడు. ఒక ఆంగ్ల పత్రిక చేతికి యాసిన్ భత్కల్ ఇంటరాగేషన్ వివరాలు చిక్కాయి. అవి యాసిన్ భత్కల్ మాటల్లోనే.. ‘గుజరాత్‌లోని సూరత్‌లో చిన్నపాటి అణుబాంబును పేల్చాలని ప్రణాళిక వేశాను. న్యూక్లియర్ బాంబును అందించగలరా? అని పాకిస్థాన్‌లోని మా బాస్ రియాజ్ భత్కల్ను అడిగాను. పాకిస్థాన్‌లో మనకు ఏదైనా లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నాకో చిన్నపాటి అణుబాంబును అందించమని, దానిని సూరత్‌లో పేల్చాలనుకుంటున్నానని చెప్పాను. అలా చేస్తే ముస్లింలు కూడా చనిపోతారని రియాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలా జరగకుండా.. కుటుంబాలతో సహా నగరం విడిచివెళ్లిపోవాలని కోరుతూ పేలుడుకు ముందు సూరత్‌లోని అన్ని మసీదుల్లో పోస్టర్లు అతికిస్తానని చెప్పాను’. అదృష్టవశాత్తూ ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చకముందే యాసిన్ భత్కల్ నేపాల్‌లో ఈ ఆగస్ట్‌లో అరెస్ట్ అయ్యాడు. కానీ అణుబాంబు భయం మాత్రం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. విచారణ సందర్భంగా యాసిన్ ఐఎం నిర్వహణకు సంబంధించిన పలు వివరాలను భారత నిఘా విభాగాలకు వెల్లడిస్తున్నాడు. సైనిక శిక్షణకు దీటైన శిక్షణను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో పాకిస్థాన్‌లో ఐఎం శ్రేణులకు అందుతోందని తెలిపాడు. అందులో శారీరక ధృడత్వ శిక్షణ, పీఈ3ఏ, సీ3, సీ4, టీఎన్టీ సహా పలు రకాల బాంబుల తయారీ, పిస్టల్ నుంచి ఏకే 47 వరకు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే విధానం నేర్పిస్తారని చెప్పాడు. సాధారణంగా 50 రోజులపాటు ఆ శిక్షణ ఉంటుందన్నారు. దాడులకు సంబంధించిన అన్ని ప్రణాళికలను రియాజ్ భత్కల్‌కు తెలియజేస్తామన్నాడు. -
అర్టికల్ 371(E)రూపంలో అణుబాంబ్