
వాషింగ్టన్ : అగ్రరాజ్య అణ్వాయుధాగారాన్ని పర్యవేక్షించే అమెరికా స్ట్రాటజిక్ కమాండ్(యూఎస్‌సీ).. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఏడాదిలో పెద్ద బాల్‌ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే అంతకంతకూ దాని పరిధి పెరుగతూనే ఉంటుంది’ అని యూఎస్‌సీ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు యూఎస్‌సీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
‘అసలు ఎలాంటి మనుషులు మీరు. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ట్రంప్ కొత్త ఆలోచన ఇదేనా. బాంబులు పేలుస్తామంటూ అమెరికన్లందరినీ బెంబేలెత్తించారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారు’ అంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన యూఎస్‌సీ... ‘నూతన సంవత్సరం సందర్భంగా చేసిన పాత ట్వీట్‌కు చింతిస్తున్నాం. అది మా విలువలు, స్థాయికి తగ్గట్టుగా లేదు. క్షమించండి. అమెరికా, దాని మిత్ర దేశాల భద్రతను పర్యవేక్షించడమే మా పని’ అంటూ మరో ట్వీట్ చేసింది.
Our previous NYE tweet was in poor taste & does not reflect our values. We apologize. We are dedicated to the security of America & allies.
— US Strategic Command (@US_Stratcom) December 31, 2018
Your tweet goes beyond needing an apology. What kind of people are you letting represent you? Is this the new dystopian Trump view? You alarmed many Americans with your tweet about bombing. Including a video of a bombing is beyond just an apology, this is reprehensible. pic.twitter.com/E52KBJ3Clh
— B. Janine Morison (@bjaninemorison) January 1, 2019
Comments
Please login to add a commentAdd a comment