వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు | North Korea Have More Nuclear Bomb Material, says america reports | Sakshi
Sakshi News home page

వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు

Published Sat, Jul 15 2017 12:56 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు - Sakshi

వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు

వాషింగ్టన్/ప్యోంగ్ యాంగ్: క్షిపణి ప్రయోగాలతో తరచుగా వివాదాల్లో తలదూర్చే ఉత్తరకొరియా వద్ద ఇతరదేశాలు ఊహించనంత అణ్వస్త్ర సామర్థ్యం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇటీవల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడంపై ఈ అగ్రరాజ్యం సీరియస్‌గా ఉంది. అయితే ఉత్తరకొరియా మరిన్ని అణ్వాయుధాలను సిద్ధం చేస్తుందని, వినాశనం కోరుకోవడమే కిమ్ పని అంటూ అమెరికా మీడియా మండిపడింది.

నార్త్‌కొరియా వద్ద ఇప్పటికే 20 అణు బాంబులు ఉన్నాయని, ఇకపై నెలకొక అణుబాంబు చొప్పున రూపొందించి వినాశనానికి తెరతీయనుందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమెరికా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలలో గమనిస్తే నార్త్ కొరియా వద్ద భారీ మోతాదులో ప్లూటోనియం, ఇతరత్రా అణ్వస్త్ర సామాగ్రి నిల్వ ఉండటం మరిన్ని ప్రయోగాలకు కిమ్ సిద్ధంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. రేడియోకెమికల్ ల్యాబోరేటరీలో మరో రెండు ప్రయోగాలకు సరిపోయే అణు పదార్థాలున్నాయని, దీనివల్ల ఉత్తరకొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలకు కాలుదువ్వడంపై అమెరికాలో ఆందోళన నెలకొంది. ఇటీవల ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అమెరికాలోని అలాస్కా ప్రాంతం వరకు సులువుగా చేరుకుంటుందని నిపుణులు అంచనా వేయడంతో కిమ్ ఆటకట్టించడానికి రష్యా, చైనా దేశాల సహకారం కావాలని అమెరికా యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement