ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు  | North Korea fires intercontinental ballistic missile | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు 

Published Sat, Nov 2 2024 6:14 AM | Last Updated on Sat, Nov 2 2024 7:22 AM

North Korea fires intercontinental ballistic missile

ఉత్తర కొరియా ప్రకటన

సియోల్‌: అత్యంత శక్తివంతమైన, బలీయమైన ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ (ఐసీఎంబీ)ను పరీక్షించామని శుక్రవారం ఉత్తరకొరియా ప్రకటించింది. ఇది ప్రచారయావ తప్పితే.. వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో ఇంతటి భారీస్థాయి క్షిపణి ఉపయుక్తకరంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణుల అభివృద్ధి చేయడంలో సాంకేతిక అడ్డంకులను ఉత్తరకొరియా అధిగమించినట్లు తాజా క్షిపణి పరీక్ష ఎక్కడా రుజువు చేయలేకపోయిందని నిపుణులు పేర్కొన్నారు. 

గురువారం తాము పరీక్షించిన ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్‌–19 .. ఇదివరకు ఎన్నడూ లేనంత దూరానికి, ఎన్నడూ లేనంత ఎత్తులో ప్రయాణించిందని ఉత్తరకొరియా ప్రకటించింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ పరీక్షను దగ్గరుండి పరిశీలించారని వెల్లడించింది. రష్యా, అమెరికా వద్దనున్న అత్యాధునిక ఖండాంతర క్షిపణుల పొడవు 20 మీటర్ల లోపే ఉంటుందని, హ్వాసాంగ్‌–19 పొడవు 28 మీటర్లు ఉండటం మూలంగా.. ప్రయోగానికి ముందుగానే దీన్ని దక్షిణకొరియా నిఘా సంస్థలు కనిపెట్టగలిగాయని దక్షిణకొరియా వ్యూహ నిపుణుడు చాంగ్‌ యంగ్‌–కెయున్‌ తెలిపారు. ల్యాంచ్‌పాడ్ల పరిమాణం పెరుగుతుందని, పొడవు అధికంగా ఉన్నందువల్ల శత్రుదేశాల నిఘా రాడార్లకు ఈ తరహా క్షిపణులు సులభంగా చిక్కుతాయని వివరించారు.  

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు 
ఎనిమిది వేల మంది ఉత్తరకొరియా సైనికులను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా మొహరించిందని అమెరికా వెల్లడించింది. రష్యాలోని కస్క్‌లో ఉక్రెయిన్‌ సేనలు పాగా వేయడం తెలిసిందే. కస్క్‌ నుంచి ఉక్రెయిన్‌ సేనలు వెనక్కి మళ్లించడానికి వీలుగా 8 వేల మంది ఉత్తరకొరియా సైనికులను తరలించిందని వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement