
అమెరికాకు ఉత్తర కొరియా ‘అణుదాడి’హెచ్చరిక
సియోల్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై అణుబాంబుతో దాడిచేసినట్లు ఉత్తరకొరియా విడుదల చేసిన వీడియో సంచలనం రేపింది. దక్షిణకొరియా-అమెరికా భారీ సైనిక విన్యాసాలతో రగిలిపోతున్న ఉత్తరకొరియా... తమపై చిన్నపాటి దాడి జరిగినా వినాశనమే అంటూ మళ్లీ వీడియోతో హెచ్చరించింది. నాలుగు నిమిషాల నిడివి ఉన్న దీన్ని లాస్ట్ చాన్స్ పేరుతో శనివారం విడుదలచేసింది.
సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించిన అణుబాంబు క్షిపణి మేఘాల గుండా ప్రయాణిస్తూ వాషింగ్టన్‌లోని లింక న్ మెమోరియల్ ముందు పడుతుంది. భవనం అగ్నికి ఆహుతవుతుండగా తెరపై ఒక హెచ్చరిక ప్రత్యక్షమవుతుంది. ఉత్తరకొరియా వైపు అంగుళం ముందుకొచ్చినా అణుబాంబులతో విరుచుకుపడతామంటూ కొరియా భాషలో కిమ్ జోంగ్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది.