Washington and Seoul officials Warned: ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు సియోల్ రక్షిణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున దక్షిణ కొరియా ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని ఓంచోన్ నుంచి పశ్చిమ సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను పేల్చినట్లు గుర్తించామని రక్షణ మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు.
దీంతో యూఎస్, దక్షిణ కొరియా సైనిక అధికారులు ఎంద దూరం నుంచి ఈ క్షిపణుల ప్రయోగం జరిగిందని పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా విశ్లేషిస్తున్నరు. ఈ మేరకు ఉత్తర కొరియా చివరిసారిగా జులై 10న ఆయుధ పరీక్షను నిర్వహించింది. ఇది బహుళ రాకెట్ లాంచర్‌లను ఫైర్ చేయగల క్షిపణి. ఐతే ఉత్తరకొరియా న్యూస్ ఛానెల్ ఒక్క క్రూయిజ్ క్షిపణినని ప్రయోగించలేదని, తమ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించలేదని పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి ఉత్తరకొరియా 2017 నుంచి పూర్తి తొలిసారిగా పూర్తి స్థాయిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అప్పటి నుంచి పలుమార్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఉత్తర కొరియా దూకుడు వ్యవహరంతో యూఎస్, దక్షిణ కొరియా అధికారులు కూడా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నమని గట్టిగా హెచ్చరించారు. తదుపరి ఉత్తర కొరియా ఏడోవ అణు పరీక్ష ఏం నిర్వహించనుందో తెలియదు కానీ తాము మాత్రం అణుపరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కరాఖండీగా చెప్పాయి.
(చదవండి: కిమ్ జోంగ్ ఉన్‌కి పుతిన్ లేఖ)
Comments
Please login to add a commentAdd a comment