18 మంది మృతి
మస్యాఫ్: సిరియాలోని హెజ్‌బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది.
వైమానిక దళానికి చెందిన ఎలైట్ షాల్డాగ్ యూనిట్ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్‌బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్‌పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment