ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై మిసైల్ దాడి చేసింది. ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్ ఆ దేశానికి చెందినది కాదని ఉక్రెయిన్ ప్రతినిధి డిమిట్రో చుబెంకో అన్నారు. జనవరి 2 తేదీని ఖార్కివ్ నగరంపై దాడి చేసిన రష్యా మిసైల్ గమనిస్తే.. రష్యా దేశానికి చెందినది కాదని తెలుస్తోందని పేర్కొన్నారు.
గతంలో రష్యా ప్రయోగించిన మిసైల్ కంటే పెద్దదిగా ఉందని అన్నారు. దాని తయారి విధానం చూస్తే.. అధునాతనమైనదిగా లేదని చెప్పారు. గతంలో ఖార్కివ్‌పై రష్యా ప్రయోగించిన మిసైల్.. ఇప్పటి మిసైల్‌ను పరిశీలిస్తే అది ఉత్తర కొరియాకు చెందినదిగా నిర్థారించడానికి అవకాశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నాజిల్, ఎలక్ట్రికల్ వైండింగ్స్, పలు పరికారలు కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయని తెలిపారు.
ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్ అని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా డిమిట్రో చుబెంకో తెలిపారు. అందుకే రష్యా వేసిన మిసైల్ ఉత్తర కొరియా నుంచి సరఫరా చేసినట్లుగా అనుమానం కలుగుతోందని తెలిపారు. రష్యా ఖార్కివ్ నగరంపై చేసిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
చదవండి: Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’
Comments
Please login to add a commentAdd a comment