కొత్తగా 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్! | US employers added 211,000 jobs, rate fell to 4.4 per cent | Sakshi
Sakshi News home page

కొత్తగా 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్!

Published Fri, May 5 2017 8:13 PM | Last Updated on Fri, Aug 24 2018 8:52 PM

కొత్తగా 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్! - Sakshi

కొత్తగా 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్!

వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉద్యోగాల నియామకం పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో అమెరికా కంపెనీలు 2,11,000 ఉద్యోగాలను పెంచుకున్నాయి.  ఈ ఏడాదిలో మొదటి మూడు నెలల కాలంలో నమోదైన ఆర్థిక వ్యవస్థ పతనం తాత్కాలికమేనని ఈ డేటా సూచిస్తోంది. అదేవిధంగా నిరుద్యోగిత రేటు కూడా 4.4 శాతానికి పడిపోయింది. దశాబ్దకాలంలో ఇదే అత్యంత కనిష్టమని లేబర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. పేలవమైన ప్రదర్శన చూపిన తొలి క్వార్టర్ అనంతరం కన్జ్యూమర్ డిమాండ్ పునరుద్ధరించుకున్నట్టు బిజినెస్ లు అంచనా వేస్తున్నాయి.
 
ఏడేళ్లుగా తక్కువగా వెచ్చిస్తూ వచ్చిన అమెరికన్లు ప్రస్తుతం తమ ఖర్చులను పెంచుకుంటున్నారని ఈ డేటా సూచించింది. ఇంకా ఉద్యోగాలు కావాల్సి ఉందని తెలిసింది. అంతకముందు వరకు నెలకు సగటును 1,85,000 ఉద్యోగాలను మాత్రమే కంపెనీలు ఏర్పాటుచేసేవి. ప్రస్తుతం ఆ  ఉద్యోగాలు పెరిగాయి. అయితే సగటున చెల్లించే చెల్లింపులు చాలా నిదానంగా పెరుగుతున్నాయని వెల్లడైంది. 12 నెలల కాలంలో పేచెక్స్ 2.5 శాతమే పెరిగాయి. ఎంప్లాయర్స్ కూడా చాలా బలవంతం మీద వేతనాలను ఎక్కువ చెల్లిస్తున్నారని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement