ఉప్పు, నిప్పుల మధ్య కీలక ముందడుగు
వాషింగ్టన్ డీసీ: దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా ఉన్న అమెరికా,క్యూబా సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఐదు దశాబ్దాల అనంతరం క్యూబాలో అమెరికా రాయబార కార్యాలయం తెరుచుకోనుంది. జెఫ్రీ డిలారెంటిస్ ను క్యూబాలో అమెరికా రాయబారిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.50 ఏళ్ల అనంతరం క్యూబాలో అంబాసిడర్ను నియమించడం గర్వంగా ఉందని ఒబామా వ్యాఖ్యానించారు.
క్యూబా, అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జెఫ్రీని అభినందించారు.ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ పూరిత పరిస్థితులను పరిష్కరించడంలో ఒబామాతో కలిసి జెఫ్రీ కీలకపాత్ర పోషించారు. దాదాపు 90 ఏళ్ల అనంతరం ఈ యేడాది మార్చిలో అమెరికా అధ్యక్షుని హోదాలో ఒబామా క్యూబాలో పర్యటించారు. దీంతో ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడంలో కీలక ముందడుగు పడింది.