దుమ్ముకు భయపడుతున్న ఒబామా! | Polluted Delhi air may keep Obama indoors | Sakshi
Sakshi News home page

దుమ్ముకు భయపడుతున్న ఒబామా!

Published Thu, Jan 8 2015 11:24 AM | Last Updated on Fri, Aug 24 2018 6:33 PM

దుమ్ముకు భయపడుతున్న ఒబామా! - Sakshi

దుమ్ముకు భయపడుతున్న ఒబామా!

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గజగజ వణికించే  అమెరికా అధ్యక్షడు ఒబామా మాత్రం ప్రస్తుతం ఓ విషయంలో విపరీతంగా వణుకుతున్నట్లు సమాచారం. దాంతో ఆయన నాలుగు గోడల మధ్య గది తలుపులు మూసుకుని కూర్చోవాలనుకుంటున్నారట.. ఇంతకీ ఒబామాను అంతగా భయపెట్టిస్తున్న అంశం ఏమిటో తెలుసా? ఢిల్లీలోని దుమ్ము, ధూళి కణాలకట (కాలుష్యం).

అమెరికాలో ఉన్న పెద్దన్న ఒబామాకి... హస్తిన కాలుష్యానికి లింక్ ఏంటా అని అనుకుంటున్నారా? ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దుమ్ము, ధూళి కణాల కాలుష్యంతో నిండి ఉన్న నగరాల్లో న్యూఢిల్లీ మొదటి వరసలో ఉందని పలు నివేదికలు ఇప్పటికే కోడైకూస్తున్నాయి. ఆ కాలుష్యంతో ఉపిరితిత్తులకు అలా ఇలా కాదంటా దెబ్బ మాత్రం గట్టిగా ఉంటుందంటూ వెల్లడించిన నివేదికల్లో బహిర్గతమైనాయి.   

ఈ నేపథ్యంలో  కాలుష్యం కారణంగా ఒబామా ఢిల్లీ వచ్చిన గదికి మాత్రమే పరిమితం కానున్నారు. అయితే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే సందర్భంగా ఒబామాకు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దల గదిని  తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారత్లో యూఎస్ రాయబార కార్యాలయం ఇప్పటికే రంగంలోకి దిగి ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement