మాస్కో: అమెరికా చర్యకు రష్యా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్‌పై బ్రిటన్‌లో జరిగిన విష ప్రయోగానికి రష్యానే కారణమంటూ అమెరికా గత వారం సియాటెల్‌లోని రష్యా రాయబార కార్యాలయాన్ని మూయించి, అందులోని 60 మంది దౌత్యాధికారుల్ని బహిష్కరించింది. ఇందుకు బదులుగా తీసుకుంటున్న చర్యల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అనుమతులు రద్దు చేస్తూ అందులోని 60 మంది దౌత్యాధికారుల్ని బహిష్కరించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment