ఆ పోర్న్ స్టార్‌ను రాయబారిగా నియమించండి!
- అమెరికాలో వైరల్ ఆన్‌లైన్ పిటిషన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడంతో చాలామంది షాక్ తిన్నారు. పలువురు అమెరికన్లయితే గుండెలు అవిసేలా రోదించారు. బిజినెస్ టైకూన్ అయిన్ ట్రంప్ గెలుపుతో అమెరికా అంతటా ఆందోళనలు చెలరేగాయి. అందుకు కారణం ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఉయోగించిన విద్వేష భాషనే. ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తానని, అమెరికాలోని వలసదారులపై కొరడా ఝళిపిస్తానని ట్రంప్ పలు విద్వేషపూరితమైన హామీలు ఇచ్చారు. అయితే, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన హామీలపై కొంత వెనుకకు తగ్గినట్టు కనిపిస్తోంది. భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. ట్రంప్ తొలి మహిళా నియామకం ఇదే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఒక చిత్రమైన విజ్ఞప్తి ఆన్‌లైన్‌లో అందింది. ప్రముఖ పోర్న్‌స్టార్‌గా, శృంగార తారగా పేరొందిన మియా ఖలిఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ చేంజ్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పిటిషన్ నమోదైంది. ‘సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజలను ఒక్కచోటకు చేరుస్తున్న ఘనత మియా ఖలిఫాది. మధ్యప్రాచ్యంలో ఆమె మనకు గొప్ప నేతగా వెలుగొందనుంది. అమెరికా బహుళ సంస్కృతికి ప్రతీకగా నిలువనుంది’ అంటూ పిటిషనర్ దీనిని పెట్టాడు. సరదాకు పెట్టినట్టు భావిస్తున్న ఈ ఆన్‌లైన్ పిటిషన్ వెంటనే వైరల్‌గా మారిపోయింది. దీనికి మద్దతుగా ఇప్పటికే 1200మంది సంతకాలు చేశారు. మరో మూడు వందల సంతకాలు వస్తే.. ఈ పిటిషన్ అధికారికంగా స్వీకరించేందుకు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ వైరల్ పిటిషన్‌పై సోషల్ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి.