
ఫిడెల్ క్యాస్ట్రో, ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్
హవానా: దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ (68) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు.
'డియాజ్ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయినా తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు' అని ప్రభుత్వ అధికార వెబ్‌సైట్ క్యూబాడిబేట్ పేర్కొంది.
ఫిడెల్ క్యాస్ట్రో మొదటి భార్య మిర్టా డియాజ్ బాలార్ట్ కుమారుడు డియాజ్ బలార్ట్.. ఈయనను స్థానికంగా జూనియర్ క్యాస్ట్రో, ఫిడెలిటో గా పిలుస్తారు. అప్పటి సోవియట్ యూనియన్‌లో అణు భౌతిక శాస్త్రవేత్తగా పనిచేశారు. అదే విధంగా క్యూబా ప్రభుత్వానికి శాస్త్ర సలహాదారుగా.. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
కాగా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో ఆరోగ్య సమస్యల కారణంగా 90 ఏళ్ల వయసులో 2016 , నవంబర్ 26 న మృతి చెందిన విషయం తెలిసిందే.
(తండ్రి క్యాస్ట్రోతో డియాజ్ బలార్ట్ చిన్ననాటి ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment