టోక్యో: ఒలింపిక్స్‌లో క్యూబా బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. ఆదివారం పురుషుల లైట్‌వెయిట్ (63 కేజీలు) విభాగంలో జరిగిన ఫైనల్ బౌట్‌లో క్యూబా బాక్సర్ ఆండీ క్రూజ్ 4–1తో కీషాన్ డేవిస్ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిస్‌పై క్రూజ్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పురుషుల +91 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రిచర్డ్ టొర్రెస్ జూనియర్ (అమెరికా) 0–5తో బకోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో 17 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలని చూసిన అమెరికాకు నిరాశే మిగిలింది. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో ఐదు పతకాలు (నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం) సాధించిన క్యూబా టాప్ పొజిషన్‌లో నిలిచింది.
వాటర్‌పోలో విజేత సెర్బియా
పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన వాటర్‌పోలో ఫైనల్లో సెర్బియా 13–10 గోల్స్ తేడాతో గ్రీస్‌పై గెలుపొందింది. నికోలా జాక్‌సిచ్ మూడు గోల్స్ చేసి సెర్బియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హంగేరి తర్వాత వాటర్‌పోలోలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన జట్టుగా సెర్బియా నిలిచింది. గతంలో హంగేరి 2000–08 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను గెల్చుకుంది.
చదవండి: మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment