Olympic medals
-
‘ఆ వంద గ్రాములే’ అసలు ఒలింపిక్ మెడల్ బరువెంతో తెలుసా?
ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక స్వర్ణాన్ని సాధించి రికార్డ్ విజయంతో చరిత్ర సృష్టింస్తుందనుకున్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం యావద్దేశాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్ కి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా, స్వర్ణం సాధించాలన్న ఆమె కల కలగానే మిగిలి పోయింది. ఒలింపిక్ పతకంలో ఐదో వంతు బరువు వినేశ్ ఫోగట్ ఆశల్నేకాదు, యావద్దేశ ఆకాంక్షల్ని కుప్పకూల్చింది.Gold medal awarded at the Paris Olympics.pic.twitter.com/dbqgXwPWCY— Figen (@TheFigen_) August 7, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫోగట్ తొలి మహిళా ఒలింపిక్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశాన్ని కోల్పోవడం క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా అనర్హత వేటు పడింది. అయితే ఒలింపిక్ ఏయే పతకాలు ఎంతెంత బరువుంటాయి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో 100-150 గ్రాముల బరువుండే లగ్జరీ వస్తువులు ఏంటో కూడా ఒకసారి చూద్దామా? ఐఫోన్ 15- 171 గ్రాములు కాగా ఒక కాటన్ టీ-షర్టు 100-150 గ్రాములు ఉంటుంది. ఒలింపిక్ పతకాలు, బరువుఒలింపిక్ గోల్డ్ మెడల్ బరువు - 556 గ్రాములుఒలింపిక్ సిల్వర్ మెడల్ బరువు- 550 గ్రాములుఒలింపిక్ కాంస్య మెడల్ బరువు - 450 గ్రాములువినేశ్ ఫోగట్ అనర్హతకు దారితీసిన కారణాలుమంగళవారం రాత్రి ఆమె రెండు కిలోల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తొలి మూడు రౌండ్లలో ఆమె 2 కిలోల బరువు పెరిగింది.ఆమె రెండు కిలోలు అధిక బరువుతో ఉందని తెలిసినప్పుడు, ఆమె రాత్రంతా నిద్రపోలేదు , సైక్లింగ్ స్కిప్పింగ్ చేయడానికి జాగింగ్‌తో సహా ఆ రెండు కిలోగ్రాముల బరువును తగ్గించుకోవడానికి ఆమె సాధ్యమైనదంతా చేసింది. నీళ్లు కూడా తాగకపోవడంతో డీ హైడ్రేషన్‌కు కూడా గురైంది.బుధవారం ఉదయం తూకం వేయగా 100 గ్రాములు అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో భారత ప్రతినిధి బృందం 100-150 గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరింది, కానీ ఫలితం లేకుండా పోయింది.Close up of an object that Neeraj Chopra will gift the country…. pic.twitter.com/0DBIK9frR5— Harsh Goenka (@hvgoenka) August 7, 2024 -
వారెవ్వా: ‘పంచ్’ అదిరిందిగా.. బాక్సింగ్‌లో టాప్ ఎవరంటే!
టోక్యో: ఒలింపిక్స్‌లో క్యూబా బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. ఆదివారం పురుషుల లైట్‌వెయిట్ (63 కేజీలు) విభాగంలో జరిగిన ఫైనల్ బౌట్లో క్యూబా బాక్సర్ ఆండీ క్రూజ్ 4–1తో కీషాన్ డేవిస్ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిస్‌పై క్రూజ్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పురుషుల +91 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రిచర్డ్ టొర్రెస్ జూనియర్ (అమెరికా) 0–5తో బకోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో 17 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలని చూసిన అమెరికాకు నిరాశే మిగిలింది. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో ఐదు పతకాలు (నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం) సాధించిన క్యూబా టాప్ పొజిషన్లో నిలిచింది. వాటర్‌పోలో విజేత సెర్బియా పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన వాటర్‌పోలో ఫైనల్లో సెర్బియా 13–10 గోల్స్ తేడాతో గ్రీస్‌పై గెలుపొందింది. నికోలా జాక్సిచ్ మూడు గోల్స్ చేసి సెర్బియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హంగేరి తర్వాత వాటర్పోలోలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన జట్టుగా సెర్బియా నిలిచింది. గతంలో హంగేరి 2000–08 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను గెల్చుకుంది. చదవండి: మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా? -
గ్రూపులుగా శిక్షణ... జట్టుగా పతకం
మన్‌ప్రీత్ సింగ్ గత 24 గంటలుగా పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాం. ఆటగాళ్లంతా భావోద్వేగంతో ఉన్నారు. టోక్యోలో మేం (పురుషుల హాకీ) కాంస్యం గెలిస్తే... అమ్మాయిల జట్టేమో అద్భుతంగా పోరాడి నాలుగో స్థానంలో నిలిచింది. హాకీలో భారత జట్ల ప్రదర్శన యావత్ జాతిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. ఇరు జట్లు ఇంతగా రాటుదేలడంలో ఎంతో ప్రణాళికబద్ధమైన కృషి దాగి ఉంది. శిక్షణ శిబిరాల్లో, మైదానాల్లో మేం కష్టపడితే... మా కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, హాకీ ఇండియా (హెచ్ఐ) కష్టపడ్డాయి. అవసరమైన అన్నీ ఏర్పాట్లను సమయానుకూలంగా చేసి పెట్టాయి. గతేడాది మార్చి మొదట్లో కరోనా అలజడి మొదలైంది. కేంద్ర క్రీడా శాఖ లాక్‌డౌన్‌కు రెండు వారాల ముందే బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో మమ్మల్ని లాక్‌డౌన్‌కు సిద్ధం చేసింది. తొలుత ఈ కట్టడి కష్టమైనప్పటికీ తర్వాత్తర్వాత కేసుల పెరుగుదలతో అసలు సమస్య ఏంటో అర్థమైంది. లాక్డౌన్ తర్వాత తెర మీదికొచ్చిన కోవిడ్ ప్రొటోకాల్ పాటించడం అనివార్యమైంది. భౌతిక దూరంతో మా శిక్షణ కూడా మారింది. ఒకే శిబిరంలో ఉన్నా... కోవిడ్ రిస్క్ దృష్ట్యా గ్రూపులుగా, బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. ఇదే ఇప్పుడు జట్టుగా పతకం గెలిచేందుకు ఉపయోగపడింది. శిక్షణ ముగిసినా క్వారంటైన్, ఐసోలేషన్‌లతో ఇంటిముఖం చూసేందుకు నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 డిసెంబర్లో జట్లను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చడం మాకెంతో మేలైంది. దీంతో ఎక్కడా మాకు నిధుల కొరతే ఎదురుకాలేదు. మహమ్మారి వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ కోల్పోయిన మాకు జూనియర్ జట్లతో ఏర్పాటు చేసిన పోటీలు కూడా ఉపయోగపడ్డాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి. టోక్యోకు వెళ్లేముందు, పతకం గెలిచాక ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఉత్తేజపరడం, స్ఫూర్తి రగిలించడం కన్నా గొప్ప రివార్డు, అవార్డులు ఏముంటాయి. -
భారత పతకాలపై సీఎం అసంతృప్తి!
రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాతనైనా మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉందని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అభిప్రాయపడ్డారు. అకాలీదళ్ దివంగత అధ్యక్షుడు హరచంద్ సింగ్ లాంగోవాల్ వర్ధంతి కార్యక్రమంలో శనివారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వందల కోట్ల జనాభా ఉన్న దేశమైనా భారత్‌కు పతకాలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. గత ఒలింపిక్స్ తో పోల్చితే ఇప్పుడు పతకాల సంఖ్య తగ్గిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కాంస్య పతకాన్ని అందించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్, రజతాన్ని సాధించిన పీవీ సింధులను అభినందించారు. ఈ ఇద్దరు మహిళా ప్లేయర్లు దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ఏది ఏమైతేనేం వందల కోట్ల జనాభా ఉన్నా మనకు ఒలింపిక్స్ లో పతకాలు రావడం లేదన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు. ఆటల కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి ఆటగాళ్లను ప్రోత్సహించాలన్నారు. చిన్న వయసు నుంచే ఆటపై మక్కువ చూపే వారికి కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారుచేసే కార్యక్రమాలు చేపట్టాలని పంజాబ్ సీఎం బాదల్ పిలుపునిచ్చారు.