‘ఆ వంద గ్రాములే’ అసలు ఒలింపిక్‌ మెడల్‌ బరువెంతో తెలుసా? | One Fifth Of A Medal Weight Costs Vinesh Phogat Her Olympic Dream, Reasons For Disqualification Of Vinesh | Sakshi
Sakshi News home page

‘ఆ వంద గ్రాములే’ అసలు ఒలింపిక్‌ మెడల్‌ బరువెంతో తెలుసా?

Published Wed, Aug 7 2024 4:51 PM | Last Updated on Wed, Aug 7 2024 6:29 PM

One fifth of a medal weight costs Vinesh Phogat her Olympic dream

ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక స్వర్ణాన్ని సాధించి రికార్డ్‌ విజయంతో చరిత్ర సృష్టింస్తుందనుకున్న మహిళా రెజ్లర్‌ వినేశ్‌  ఫోగట్‌పై అనూహ్యంగా  అనర్హత వేటు పడటం యావద్దేశాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్ కి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా, స్వర్ణం సాధించాలన్న ఆమె కల కలగానే మిగిలి పోయింది.  ఒలింపిక్‌ పతకంలో ఐదో వంతు బరువు వినేశ్‌ ఫోగట్ ఆశల్నేకాదు, యావద్దేశ ఆకాంక్షల్ని కుప్పకూల్చింది.

 ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్‌ ఫోగట్ తొలి మహిళా ఒలింపిక్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశాన్ని  కోల్పోవడం క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా అనర్హత వేటు పడింది.

 

అయితే ఒలింపిక్‌ ఏయే పతకాలు ఎంతెంత బరువుంటాయి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో 100-150 గ్రాముల బరువుండే  లగ్జరీ వస్తువులు ఏంటో కూడా ఒకసారి చూద్దామా? ఐఫోన్ 15- 171 గ్రాములు కాగా ఒక కాటన్ టీ-షర్టు 100-150 గ్రాములు ఉంటుంది. 

ఒలింపిక్‌ పతకాలు, బరువు
ఒలింపిక్ గోల్డ్   మెడల్‌ బరువు - 556 గ్రాములు
ఒలింపిక్ సిల్వర్ మెడల్‌ బరువు- 550 గ్రాములు
ఒలింపిక్ కాంస్య మెడల్‌ బరువు - 450 గ్రాములు

వినేశ్‌ ఫోగట్ అనర్హతకు దారితీసిన కారణాలు
మంగళవారం రాత్రి ఆమె రెండు కిలోల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 
తొలి మూడు రౌండ్లలో ఆమె 2 కిలోల బరువు పెరిగింది.
ఆమె రెండు కిలోలు అధిక బరువుతో ఉందని తెలిసినప్పుడు, ఆమె రాత్రంతా నిద్రపోలేదు , సైక్లింగ్ స్కిప్పింగ్ చేయడానికి జాగింగ్‌తో సహా ఆ రెండు కిలోగ్రాముల బరువును తగ్గించుకోవడానికి ఆమె సాధ్యమైనదంతా చేసింది. నీళ్లు కూడా తాగకపోవడంతో డీ హైడ్రేషన్‌కు కూడా గురైంది.

బుధవారం ఉదయం తూకం వేయగా 100 గ్రాములు అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో భారత ప్రతినిధి బృందం 100-150 గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరింది, కానీ ఫలితం లేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement