హవానా: గగనతలంలో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ఇండినేషియాలో భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా క్యూబా దేశంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున (జనవరి 29) హెలికాప్టర్ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దేశంలో 2018లో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment