Havana
-
హవానా... అంతా భ్రమేనా?!
అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకేస్తే ఎక్కడో ఉన్న ఎవరికో తగిలి తుస్సుమన్నట్లు అంతర్జాతీయ డిటెక్టివ్ సినిమా స్థాయిలో అందరూ హడావుడి చేసిన హవానా సిండ్రోమ్ వెనుక రహస్యాయుధాలేమీ లేవని తాజా పరిశోధన తేల్చేసింది. మనిషిలో ఏర్పడే మనో, చిత్త భ్రమల కారణంగానే హవానా సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని న్యూరాలజిస్టుల తాజా అంచనా! ఇంతకీ ఏంటీ సిండ్రోమ్? ఎందుకీ హడావుడి? సైంటిస్టులేమంటున్నారు? చూద్దాం.. ప్రపంచ పెద్దన్న అమెరికానే హైరానా పెట్టిన హవానా సిండ్రోమ్ పేరు 2016–17లో తొలిసారి వినిపించింది. క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మైగ్రేన్ తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం తదితర లక్షణాలు సిబ్బందిలో కనిపించాయి. దీని గురించి బయటపడి ఐదేళ్లైనా ఎందువల్ల వస్తుందో ఎవరూ కచి్ఛతంగా చెప్పలేకపోయారు. చివరకు జేమ్స్‌బాండ్ సినిమాలోలాగా ఏదో రహస్యాయుధం వల్లనే ఈ లక్షణాలు కలుగుతున్నాయని, అమెరికా సిబ్బందిపై ఈ ఆయుధాన్ని శత్రుదేశాలు ప్రయోగిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధం క్యూబా సృష్టి అని, రష్యా రూపకల్పన అని పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. కొందరు పేరున్న సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం తెలుసుకోకుండా ఆయుధ వాడకం థియరీని బలపరిచారు. అయితే అమెరికాకే చెందిన న్యూరాలజిస్టు రాబర్ట్ బలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. హవానా సిండ్రోమ్ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ లక్షణాలు తనవద్దకు వచ్చే మనోభ్రాంతి పేషెంట్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైకోసొమాటిక్(మానసికోత్పన్న) లక్షణాలుగా నిర్ధారణకు వచ్చారు. మానసిక భ్రాంతి కారణంగా కలిగినప్పటికీ ఈ లక్షణాలు నిజమైన బాధను కలగజేస్తాయని ఆయన పరిశోధనలో తేలింది. దీంతో ఈ విషయమై ఆయన మరింత లోతైన అధ్యయనం జరిపారు. బృంద లక్షణాలు మాస్ సైకోజెనిక్ ఇల్నెస్(బృంద చిత్త భ్రమ వ్యాధి) అనేది ఒక సమూహంలోని కొందరు ప్రజలు సామూహికంగా అనుభవించే మనో భ్రమ అని రాబర్ట్ చెప్పారు. ఇదే హవానా సిండ్రోమ్‌కు కారణమై ఉండొచ్చన్నది ఆయన స్థిర అభిప్రాయం. ఒక సమూహంలోని కొందరు తామేదో భయానకమైనదాన్ని ఎదుర్కొన్నామని భావించినప్పుడు ఈ భ్రమ మొదలవుతుందని వివరించారు. ఉదాహరణకు 20వ శతాబ్దంలో టెలిఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. తొలినాళ్లలో పలువురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక షాక్ లాంటి స్థితిని చాలా రోజులు అనుభవించేవారని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది కేవలం మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని రాబర్ట్ బల్లగుద్ది చెబుతున్నారు. హవానా సిండ్రోమ్ కూడా అలాంటిదేనన్నది ఆయన భావన. ఒత్తిడిలో పనిచేసేవారిలో ఈ ఇల్నెస్ ఆరంభమవుతుంది. ఒకరిలో ఈ భ్రమ ఆరంభం కాగానే, వారు దీని గురించి ఇతరులకు వివరిస్తారు. అలా విన్నవారిలో కొందరు అలాంటి భ్రమకు లోబడతారు. ఇలా ఈ లక్షణాలు వ్యాపిస్తూ ఉంటాయి. మెదడులో రసాయన మార్పుల కారణంగా ఈ లక్షణాలు ఆరంభమై సదరు వ్యక్తిని పలు ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు కనిపించే అవకాశం ఉందని రాబర్ట్ చెప్పారు. జాతీయ సైన్స్ అకాడమీ ఈ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. కానీ తగిన గణాంకాలు లేనందున నిర్ధారించడంలేదు. క్యూబా ప్రభుత్వం కూడా దీనిపై లోతైన పరిశోధన జరిపి గతనెల 13న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిండ్రోమ్ వెనుక ఎలాంటి ఆయుధాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. క్యూబాలో ఎప్పుడో పనిచేసిన ఒక అండర్ కవర్ ఏజెంట్, తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడి ఉంటారని, తననుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించిందనేది హవానా సిండ్రోమ్‌పై తాజా అంచనా. ఇంతకు మించిన కారణాలేమైనా ఉంటే, వాటిని సీఐఏ బయటపెడితే తప్ప హవానా సిండ్రోమ్‌పై హైరానా అనవసరమన్నది సైంటిస్టుల అభిప్రాయం. (చదవండి: అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్) సిద్ధాంత రాద్ధాంతాలు హవానా సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందులు ఒక్కరికే పరిమితం కాకుండా పలుమందిలో ఒకేలా కనిపించడం రాబర్ట్‌ను ఆకర్షించింది. దీంతో ఆయన మాస్ హిస్టీరియా, సైకోసొమాటిక్ డిసీజెస్ తదితర అనేక అంశాలను పరిశీలించి అధ్యయనం చేశారు. సోనార్ ఆయుధం వాడకం చెవి అంతర్భాగంలో ఏర్పడుతున్న హాని వల్ల ఈ లక్షణాలు కలుగుతున్నట్లు 2018లో మియామీకి చెందిన కొందరు జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. ఈ ఫలితాలను కూడా ఆయన మదింపు చేశారు. అయితే ఈ అధ్యయనాలన్నింటిలో లోపాల కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు రూపొందాయని ఆయన చెబుతున్నారు. (చదవండి: Bihar: నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు) సోనార్ ఆయుధం వాడి ఉంటే కేవలం లోపలి చెవి భాగాలు మాత్రమే కాకుండా మెదడులోని భాగాలు కూడా దెబ్బతిని ఉండేవని వివరించారు. మైక్రోవేవ్ రేడియేషన్ ఆయుధం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని 2020లో కొందరు సరికొత్త సిద్ధాంతం లేవనెత్తారు. దీన్ని జాతీయ సైన్సు అకాడమీ పరోక్షంగా సమరి్ధంచడంతో ఈ సిద్ధాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే మేక్రోవేవ్ ఆయుధం వల్ల వినిపించే శబ్దాలు నిజమైనవి కావని, మెదడులో ఉండే న్యూరాన్లు అనుభవించే మిధ్యా శబ్దాలని రాబర్ట్ చెప్పారు. హవానా సిండ్రోమ్ లక్షణాలు ఇలాంటి మిధ్యా శబ్దాలు కావని ఆయన గుర్తించారు. ఈ విధంగా అనేక పరిశీలన అనంతరం చిత్త భ్రమ వల్లనే ఈ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని రాబర్ట్ నిర్ధారణకు వచ్చారు. – నేషనల్ డేస్క్, సాక్షి. -
క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురి దుర్మరణం
హవానా: గగనతలంలో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ఇండినేషియాలో భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా క్యూబా దేశంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని ఆ దేశ మీడియా ప్రకటించింది. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. క్యూబాలోని ఉత్తర దిశలో హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి శుక్రవారం తెల్లవారుజామున (జనవరి 29) హెలికాప్టర్ బయల్దేరింది. అయితే మార్గమధ్యలో ఒక కొండపై అకస్మాత్తుగా హెలికాప్టర్ కూలిపోయిందని ఆ దేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్నుమూశారని తెలిపింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దేశంలో 2018లో భారీ విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘటనలో ఏకంగా 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
‘అగ్ని దేవునికి కోపం వస్తే.. ఇలానే జరుగుతుంది’
బెంగళూరు : కర్ణాటకలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మైసూరులోని సుత్తూర్ మఠ్‌లో కొన్ని రోజుల క్రితం హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతవరకూ ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమంలో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. హోమగుండాన్ని వెలిగించిన వెంటనే.. ఆ మంటలు కాస్తా అక్కడే ఉన్న బెలూన్లను తాకడం.. మంటలు చెలరేగడం వెంటవెంటనే జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఏఎన్ఐ షేర్ చేసిన ఈ వీడయో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘అదేమైన పుట్టిన రోజు వేడుక అనుకున్నారా.. బెలూన్లు కట్టారు’.. ‘అగ్ని దేవునికి కోపం వచ్చింది.. అందుకే ఇలా జరిగింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. #WATCH Balloons catch fire at Suttur Mutt in Mysuru, Karnataka. Three people sustained minor injuries. pic.twitter.com/v50CDwMT3K — ANI (@ANI) February 5, 2019 -
క్యూబా విమాన ప్రమాదంలో 107 మంది మృతి
హవానా: క్యూబాలో ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన విమానం శుక్రవారం కూలిపోయిన ఘటనలో 107 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు మహిళా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించామనీ, ప్రస్తుతం వీరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదంలో ఆరుగురు మెక్సికన్ విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. క్యూబా రాజధాని హవానా నుంచి 110 మంది ప్రయాణికులు, సిబ్బందితో బోయింగ్ 737 విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.08 హోల్గ్యిన్ నగరానికి బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది. -
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్–కేనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు. -
క్యూబా
నైసర్గిక స్వరూపం వైశాల్యం: 1,09,884 చ.కి.మీ. జనాభా: 11,271,819 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: హవానా కరెన్సీ: పెసో ప్రభుత్వం: సింగిల్ పార్టీ స్టేట్ అధికారిక భాష: స్పానిష్, మతం: క్రైస్తవులు వాతావరణం: జనవరిలో 18 నుండి 26 డిగ్రీలు, జూలైలో 24 నుండి 32 డిగ్రీలు పంటలు: చెరకు, వరి, బంగాళదుంపలు, కసావా, మొక్కజొన్న, బత్తాయి. పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తులు, గనులు, ఫుడ్‌ప్రాసెసింగ్, పొగాకు ఉత్పత్తులు, ఖనిజాలు, రసాయనాలు, సిమెంటు, ఎరువులు, వస్త్రపరిశ్రమ, చేపలు స్వాతంత్య్రం: నామమాత్రంగా దక్కింది 1902 మే 20న (నిజమైన స్వాతంత్య్రం 1 జనవరి 1959) సరిహద్దులు: చుట్టూ సముద్రమే. అట్లాంటిక్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సముద్రం. 1. హవానా: కరేబియన్‌లోని ద్వీపదేశమైన క్యూబా రాజధాని హవానా ఒక పెద్ద నగరం. ఇక్కడే సముద్ర తీరం, ఓడరేవు ఉన్నాయి. క్యూబా దేశం పైనుండి చూస్తే రొయ్యలా కనబడుతుంది. నగరంలోనూ, పరిసరాల్లోనూ చూడదగిన వింతలు ఎన్నో ఉన్నాయి. నగరంలో మూడు ఓడరేవులు ఉన్నాయి. అవి మరిమెలెనా, అటారిస్, గ్వాన బాకోవా. నగరంలోని ఓల్డ్ హవానా నగరం పర్యాటకులకు స్వర్గధామం లాంటిది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. పాత నగరాన్ని హబామా వీజా అంటారు. వివిధ ఆకృతులలో ఉన్న పాత భవనాలు, క్యాథడ్రమ్లు ఎన్నో ఉన్నాయి. ఇక మధ్య హవానాను సెంట్రోహవానా అంటారు. ఇక్కడ ఉన్న పురాతన భవనాలను జాతీయ సంపదగా ప్రకటించారు. ఇక్కడ పార్క్ సెంట్రల్ జోస్ పార్ట్ విగ్రహం, కాపిటాలియో వీధి, సిగార్ ఫ్యాక్టరీ వీధి ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే నగరంలోని లెడాడో ప్రాంతం మరో ఆకర్షణ. ఇది రాజకీయ నాయకులు, పార్టీలకు గుండె లాంటిది. ఈ ప్రాంతంలోని లారాంపా అనే ప్రదేశంలోనే విప్లవ యోధుడు చేగువేరా స్మారక స్థలం ఉంది. ప్లాజాడిలా రెవెల్యూషన్ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నగరంలో ఇంకా హవానా విశ్వవిద్యాలయం, ఫోక్సా భవనం ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు: క్యూబా దేశంలో టూరిజం ఒక పరిశ్రమగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు మూడు మిలియన్ల పర్యాటకులు క్యూబా దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. క్యూబా రాజధాని హవానా ఒక గొప్ప పర్యాటక నగరం. 2. వరడెరో ఆకర్షణలు: వరడెరో ప్రాంతం క్యూబా దేశంలో ఒక ప్రధాన పర్యాటక స్థలం. సముద్రతీరం, తెల్లటి ఇసుక బీచ్‌లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. 1929లో కట్టిన విల్లా క్సనాడు భవనం ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇది ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో ఉంది. సువిశాలమైన జోసోన్ పార్కును 1940లో నిర్మించారు. ఈ పార్కులో పర్యాటకులకు కావల్సిన అన్ని వసతులు ఉన్నాయి. వరడెరో మ్యూజియంలో పురాతన కాలం నాటి అద్భుత వస్తువులు ఎన్నో ఉన్నాయి. వరడెరోకు ఉత్తరాన నీటి అడుగున పార్కు ఉంది. వాటర్ డ్రైవింగ్, సముద్రపు అడుగుభాగాలను ఈ పార్కులో విహరిస్తూ దర్శించవచ్చు. 3. కామాగ్వే ప్రావిన్స్: క్యూబా దేశంలో మూడో అతిపెద్ద నగరం కామాగ్వే. ఇక్కడ 20 కిలోమీటర్ల పొడవైన సాటాలూసియా బీచ్ ఉంది. పర్యాటకులు ఈత కొట్టడానికి ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. స్కూబా డ్రైవింగ్‌కు ఈ బీచ్ పుట్టినిల్లు. ఇక్కడే మరో బీచ్ న్యూవిటాస్ బీచ్ కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోనే కాయోసబినాల్ కోరర్ ఐలాండ్ ఉంది. ఫ్లెమింగో పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. కామాగ్వేకు ఉత్తరంవైపు సియారాడి క్యూబిటాస్ పర్వత శ్రేణి ఉంది. ఇవన్నీ చిన్న చిన్న పర్వత శ్రేణులు. ఈ పర్వతాలలో ఎన్నో గుహలు ఉన్నాయి. 4. సాంటియాగో డి క్యూబా: ఈ నగరం 15వ శతాబ్దంలో నిర్మితమైంది. విశాలమైన కాస్టిల్లో డి సాన్ పెడ్రో డెల్ మొర్రో కోట ఉంది. ఈ కోట ఒక చిన్న కొండ మీద నిర్మించబడింది. మొదట రక్షణ కోసం ఆ తర్వాత జైలుగా ఉపయోగపడింది ఈ కోట. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ ప్రోవిన్సెయల్ బకార్డె మోరో మ్యూజియం ఉంది. ఇక్కడ చరిత్ర పూర్వపు వస్తువులు, శతాబ్దాల నాటి రాజుల దుస్తులు, ఉపయోగించిన వస్తువులు, ఎన్నో కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ మ్యూజియమ్‌లో ఈజిప్టు మమ్మీలు, పెరూ మమ్మీలు అమెజాన్ ప్రాంతంలో లభించిన పురాతనకాలపు మానవ పుర్రెలు ఉన్నాయి. ఈ నగరంలోనే ఇంకా కాసా డిడీగో వెలాజ్ క్వెజ్ మ్యూజియం, మ్యాస్ట్రా సెనోరా బాసిలికా చర్చి, అబెల్ సాంటా మోరియా మ్యూజియం, సిమెంటేరియో డి సాంటా ఇఫిజనియా, సెస్పడెస్ పార్కు, ప్లాజాడిలా రెవెల్యూషన్, కార్నివాల్ మ్యూజియం, క్యూర్టెల్ మోన్కాడా మ్యూజియం, ప్లాజామార్టి, విస్టాఅలెగ్రా ఇలా ఎన్నో ప్రదేశాలు, కట్టడాలను ఇక్కడ దర్శించవచ్చు. పరిపాలనా విధానం: దేశాన్ని 16 ప్రావిన్స్‌లుగా, ఈ ప్రావిన్స్‌లను తిరిగి మున్సిపాలిటీలుగా విభజించారు. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణంగా ఉండటం వల్ల, పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. దేశంలో 10 నగరాలు ఉన్నాయి. అవి - హవానా, శాంటియాగో డి క్యూబా, కామాగ్వే, హోల్గిన్, శాంటాక్లారా, గ్వాంటనామో, బయామో, విక్టోరియా డి లాస్ టు నాస్, సీన్ ఫ్యూగోస్, మాంజనిల్లో. చరిత్ర: 1492లో క్యూబా దేశాన్ని కొలంబస్ కనుగొన్నాడు. 1512లో క్యూబాను స్పెయిన్ ఆక్రమించుకుంది. 1762లో బ్రిటన్ క్యూబాను తన అధీనంలోకి తీసుకుంది. కొద్దికాలానికే క్యూబా తిరిగి స్పెయిన్ అధీనంలోకి వచ్చింది. 1902 వరకు అమెరికా క్యూబాను ఆక్రమించుకుంది. 1902 తర్వాత క్యూబా స్వతంత్రాన్ని పొందింది. 1961లో క్యూబాను కమ్యూనిస్ట్ దేశంగా ఫిడెల్ క్యాస్ట్రో ప్రకటించాడు. క్యూబాలో సగం జనాభా ఆఫ్రికా, యూరప్ దేశాల మిశ్రమమే. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా: 1950 దశకం నుండి క్యూబాలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను తీసుకొని ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం తర్వాతి రెండేళ్ళ కాలంలో ఒక విప్లవంగా మారిపోయింది. 1958 చివరలో వాళ్ళు శాంటాక్లారాను ఆక్రమించారు. 1959 జనవరిలో రాజధాని నగరానికి ప్రవేశించారు. ఆ తర్వాత మొత్తం దేశాన్ని ఆయన తన అధీనంలోకి తెచ్చుకొని క్యూబా దేశాధ్యక్షుడు అయ్యాడు. దాదాపు 50 ఏళ్లు పరిపాలించి, 2008లో రాజీనామా చేశాడు. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవవీరుడుగా గుర్తింపుపొందిన చేగువేరా 1967 అక్టోబర్ 9న మరణించాడు. ప్రజలు-సంస్కృతి: 1959 నాటి విప్లవం తర్వాత ప్రజల జీవన విధానం బాగా మారిపోయింది. మహిళలకు పురుషులతో సమానమైన అధికారం, అవకాశం దక్కాయి. చదువు, ఉద్యోగం, వ్యవసాయ పనులు, ఇల్లు - ఇలా అన్ని రంగాలలో మహిళలకు అధికారం, స్వేచ్ఛ లభించాయి. జనాభాలో 35 శాతం మంది స్పెయిన్ దేశానికి చెందినవారు. 10 శాతం మంది ఆఫ్రికన్లు, 50 శాతానికి పైగా స్పానిష్ ఆఫ్రికన్ జాతుల మిశ్రమ జనాభా ఉంది. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ళలోపు వారే ఉన్నారు. ప్రజలు స్నేహభావంతో ఉండి, సేవ చేయడానికి ముందు ఉంటారు. పండుగలు, సంగీతం, నృత్యం పట్ల మక్కువ ఎక్కువ. ప్రజలు నగరాలు, పట్టణాలలో జీవించడానికి ఇష్టపడతారు. ఆహారం: క్యూబాలో వివిధ సంస్కృతుల ప్రజలు ఉండడం వల్ల వారి ఆహార రీతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్ని ప్రాంతాలలో వరి అన్నం అధికంగా తింటారు. దీనితో పాటు బంగాళదుంప వేపుడు, టమోటా, అవకాడో, లెట్యూస్, గుమ్మడి, క్యారెట్, క్యాబేజీల సలాడ్ కానీ, సూప్ కానీ చేస్తారు. భోజనంతో పాటు బీరు గానీ, వైన్ గానీ తాగుతారు. మాంసపు వంటకాలను చేసుకుంటారు. కోడిగుడ్డు అధికంగా తింటారు. వ్యవసాయం: క్యూబాలో దాదాపు 81 వేల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. క్యూబా దేశం చెరకు, చక్కెరలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దేశంలో పొగాకు పంట కూడా విరివిగా పండుతుంది. ఒక్క పొగాకు ఉత్పత్తుల ద్వారానే సంవత్సరానికి 200 మిలియన్ల అమెరికా డాలర్ల ఆదాయం లభిస్తుంది. ద్రాక్ష ఉత్పత్తిలో క్యూబా ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. వరి, బంగాళదుంపలు బాగా పండుతాయి. కసావా (ఇది మన మొరంగడ్డల (చిలగడదుంపల) మాదిరిగా ఉంటుంది) 2,60,000 ఎకరాల్లో పండిస్తారు. దాదాపు మూడు లక్షల టన్నుల కసావాను పండిస్తారు. వీటితోపాటు అరటి, మామిడి, బొప్పాయి, అనాస, అవకాడో, జామ, కొబ్బరి కూడా క్యూబాలో అధికంగా పండుతాయి. పరిశ్రమలు: క్యూబాలో ఫార్మాస్యూటికల్స్, చక్కెర పరిశ్రమ ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మందులు అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. దేశ ఆర్థికవ్యవస్థలో 37 శాతం విదేశీ మారక ద్రవ్యం వీటి ద్వారా లభిస్తుంది. ఇవిగాక ఇంకా ఇక్కడ చమురు శుద్ధి కర్మాగారాలు, వస్త్ర పరిశ్రమ, బూట్లు, టూత్‌పేస్టులు, సబ్బులు, కార్డ్బోర్డ్ బాక్సుల పరిశ్రమలు కూడా ఉన్నాయి.