విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం
హవానా: క్యూబాలో ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన విమానం శుక్రవారం కూలిపోయిన ఘటనలో 107 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు మహిళా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.
వీరిని ఆస్పత్రికి తరలించామనీ, ప్రస్తుతం వీరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదంలో ఆరుగురు మెక్సికన్ విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. క్యూబా రాజధాని హవానా నుంచి 110 మంది ప్రయాణికులు, సిబ్బందితో బోయింగ్ 737 విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.08 హోల్గ్యిన్ నగరానికి బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సమీపంలోని పంటపొలాల్లో కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment