హవానా : క్యూబా రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కూలి దాదాపు 100 మరణించారు. జోస్ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్ తీసుకున్న బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందులో 100 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్‌కేనెల్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గురైన బోయింగ్ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్ ఎయిర్‌లైన్స్ అద్దెకు తీసుకుని నడుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment