![ఇర్మా: మియామికి ముప్పు తప్పినట్లేనా..!](/styles/webp/s3/article_images/2017/09/17/41504942251_625x300.jpg.webp?itok=h09NYnXL)
ఇర్మా: మియామికి ముప్పు తప్పినట్లేనా..!
మియామి: హరికేన్ ఇర్మా శనివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరేబియన్ దీవులకు 85 మైళ్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇర్మా తన దిశను మార్చుకున్నట్లుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఇర్మా తుపారు మియామిని నేరుగా తాకే అవకాశం ఉండదని.. దాంతో ముప్పు చాలా వరకు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అత్యంత వేగంతో భారీ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇర్మా హరికేన్ క్యూబా ఉత్తర తీరంవైపు ప్రయాణిస్తోందని, ఫ్లోరిడాకు ఆగ్నేయతీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. హరికేన్ ఇర్మా ఒకవేళ క్యూబా తీరాన్ని తాకితే.. టర్క్స్, కొకైస్, బహమాస్ ఆగ్నేయ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యూబా తీరంలో గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.