Hurricane Irma
-
ఒకే వేదికపై అమెరికా మాజీ అధ్యక్షులు
వాషింగ్టన్: అమెరికాలో బీభత్సం సృష్టించిన హరికేన్ ఇర్మా, మరియా తుఫాను బాధితులకు చేయుతనిచ్చేందుకు ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులు ఒకే వేదికపై కలిశారు. తుఫాను బాధితులకు సాయంగా ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గోల్ఫ్ కప్-2017 టోర్నమెంట్‌ను మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్‌బుష్, బిల్‌క్లింటన్‌లు గురువారం ప్రారంభించారు. ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలి సారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ద్వైపాక్షిక టోర్నమెంట్లో అమెరికా జట్టు.. ఇతర దేశాలతో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడనుంది. జెర్సీ సిటీలోని లిబర్టీ నేషనల్ గోల్ఫ్ కోర్సులో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రారంభ మ్యాచ్‌ను ఈ మాజీ దేశాధ్యక్షులు ఈ వేదికపై నుంచే తిలకించారు. గతంలో వీరు హరికేన్ ఇర్మా తుఫాను బాధితులను ఆదుకోవాలని అమెరికన్లను కోరుతూ ఓ వీడియా సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తుఫాను బాధితులకు సాయంగా అందించనున్నారు. -
ఇర్మా బాధిత భారత కుటుంబాలకు అటా చేయూత
అమెరికాలో ఇటివల హరికేన్ ఇర్మా ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఆ రాష్ట్రంలోని ప్రవాస భారతీయులు చాలామంది ఆ తుఫాను తాకిడికి లోనయ్యారు. కేటగిరీ -5 గా వర్గీకరించిన ఇర్మా అమెరికాకి కలిగించిన నష్టం బిలియన్లలో ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.అయితే వందలాది ప్రవాస భారతీయులు తుఫాన్‌కు గురవుతున్న విషయాన్ని అమెరికా తెలుగు సంఘం(అటా) ముందుగానే గ్రహించి వెంటనే రంగంలోకి దిగింది. అధికారిక తుఫాను హెచ్చరిక, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు వెలువడిన వెంటనే అటా సేవా జట్టు అవసరమైన పనులను చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి పర్యవేక్షణలో, టెన్నిస్సీ,అలబామ రాష్ట్రాల ప్రాదేశిక శాఖల సహాయంతో శివకుమార్ రామడుగు అటా సేవా జట్టుకు నేతృత్వం వహించారు. అట్లేంటాకే చెందిన కిరణ్ పాశం, అనిల్ బోద్ధిరెడ్డి, వేణు పిసికే, తిరుమల పిట్టా, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీధర్ తిరుపతి, రామకృష్ణా రెడ్డి ఈ పనులలో కీలక పాత్ర పోషించారు. బాధితులకు సహాయం చేసేందుకు అటా జట్టు ఒక పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులోనే భాగంగా ఏర్పడ్డ ఏక్షన్ టీం ముందుగా ఒక హెల్ప్‌లైన్ నెలకొల్పి, సోషల్ మీడియా, బంధు మిత్ర వర్గాల ద్వారా ఫ్లోరిడాకు చేరవేసింది. ఇది కాక అట్లాంటా, నాష్విల్, అలబామలో నివాసముంటున్న అటా సభ్యులకు విషయాన్ని తెలియజేసి వారి ఇండ్లలో బాధితులకు నివాసం కల్పించే ఏర్పాట్లు కూడా ఆటా చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇతరుల వర్గీకరణ పనులను త్వరగా పూర్తిచేసి సమయానికి నిర్వాసితులకు సహాయ సహకారాల్ని అందించగలిగింది. అమెరికాలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా అట్లంటాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వచ్చందంగా మంచి మనసుతో ఆపదలో ఉన్న సాటి భారతీయులకు స్వాగతం పలకడంలో సఫలీకృతులయ్యారు. కేవలం తెలుగువారికే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు సమస్త ప్రవాస భారత ప్రజానీకానికి సహాయ సహకారాలు అందించిన అటా సేవ టీం పలువురి ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా వేయి మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించారు. ఒక వ్యక్తి ఏకంగా 12 కుటుంబాలకు చెందిన 33 మందికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఇటువంటి సేవ అటాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నిర్వాసితులు అటాకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో అమెరికాలోని భారతీయ రాయభార కార్యాలయం తమ అధికారులను ఆప్రమత్తం చేసింది. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ నగరం నుంచి కన్సులేట్ జనరల్ శ్రీ హుటాహుటీన అట్లాంటా నగరం చేరుకుని సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అమెరికా తెలుగు సంఘం కొన్ని వందల మంది భారతీయులకు సంఘం సభ్యుల, వారి మిత్రుల ఇండ్లలో నివాసం కల్పించడాన్ని కొనియాడారు. ఈ సహాయ కార్యక్రమాలని గుర్తించిన స్థానిక పోలీసు వ్యవస్థ, జార్గియా రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ విభాగ అధికారులు ఫ్లొరిడా నుంచి వారిని స్వయంగా కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చిన సహాయం చేయటానికి ముందుంటామని, వారిని సంప్రదించాల్సిందిగా అమెరికా తెలుగు సంఘం సభ్యులను కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందించి వెళ్ళారు. ఫ్లొరిడా నుండి వచ్చిన మన భారతీయులకు అవసరమైన భోజన సౌకర్యాలు టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ యాజమాన్యం కల్పించింది. వారి బాంక్వెట్ హాల్ని 5 రోజులపాటు 24 గంటలు అటాకి సహాయం అందించడంలొ ప్రధాన పాత్ర వహించారు. శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్, బావర్చి రెస్టారెంట్, కాకతీయ రెస్టారెంట్ వారు భోజనం సమకూర్చడంలో ప్రధాన భూమిక వహించారు. వీరితో పాటు ఉత్తర భారతనికి చెందిన మిత్రులు సీమ గార్గ్, వినీత్ గార్గ్ ల ఆధ్వర్యంలో వారి ఇండ్లలో వంటలు వండి అందించారు. అలానే ఫ్లోరిడా మిత్రులు తిరిగి వెళ్ళే సమయంలో దారిలో తినేందుకు ఆహార పదార్థాలు, పండ్లు, పాలు, బ్రెడ్, కేకులను, మంచి నీటిని అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బోజనాన్ని వడ్డించేందుకు "విటి సేవ" కి చెందిన కార్యకర్తలు అన్నివేళలా ముందుండి వారి సహకారాన్ని అమెరికా తెలుగు సంఘానికి అందించారు. -
హరికేన్ ఇర్మా భయానక దృశ్యాలు
-
కోలుకుంటున్న ఫ్లోరిడా
మియామి: ఇర్మా తుపాను తీరం దాటిపోవడంతో ఊపిరిపీల్చుకున్న ఫ్లోరిడావాసులు తమకు అందుతున్న సహాయాన్ని అందుకునేందుకు ఆవాసాల నుంచి బయటికి వస్తున్నారు. ఫ్లోరిడా కీస్ దీవుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడ సమాచార వ్యవస్థ పనిచేయడం లేదు. తాగునీరు దొరకడం లేదు. మరోవైపు ఇంధన కొరత సమస్య తలెత్తింది. అధికార బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి. కాగా ఇర్మా తుపాను ప్రభావం కారణంగా ఫ్లోరిడాలోని లక్షలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రిపూట ప్రజలు నానాఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఫ్లోరిడాకీస్ దీవులకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ఇక్కడ ఉన్న మూడు ఆస్పత్రులు మూతపడ్డాయి. తుపాను ప్రభావిత కరేబియా దీవుల్లో మృతుల సంఖ్య 40కి, క్యూబాలో 10కి చేరుకుంది. ఉత్తర దిశగా సాగిపోయిన ఇర్మా తుపాను ఎట్టకేలకు బలహీనపడింది. తుపాను పీడిత కరేబియన్ దీవుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అమెరికా దేశాలు సహాయక చర్యలను ముమ్మురం చేశాయి. దీంతో అక్కడి ప్రజలకు ఎంతో ఊరట లభిస్తోంది. -
ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు
ఇలాంటి హరికేన్ చూడలేదు ఇర్మాపై ఫ్లోరిడాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు వెల్లడి తాత్కాలిక షెల్టర్‌లో బాధితులు సాక్షి, కర్నూలు (హాస్పిటల్): అమెరికాలోని ఫ్లోరిడాను వణికించిన హరికేన్ ఇర్మా లాంటి దానిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇర్మా హరికేన్ తాకిడి సమయంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెల్టర్‌లో పలువురు తెలుగువారు తలదాచుకున్నారు. వారిలో ఒకరైన కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలోని బి.తాండ్రపాడుకు చెందిన రైతు భూపాల్‌రెడ్డి కుమారుడు హరీష్ ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంప పట్టణంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విశ్వరూపం చూపిన హరికేన్ సోమవారానికి శాంతించినా.. షెల్టర్‌లో ఉన్న వారిని ప్రభుత్వం ఇంకా బయటకు పంపడం లేదని హరీష్ తెలిపారు. రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు పునరుద్ధరించిన తర్వాతే షెల్టర్ల నుంచి బయటకు వెళ్లాలని అమెరికా ప్రభుత్వం సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. హరికేన్ ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదని తెలిపారు. -
ప్రళయం
-
అంధకారంలో ఫ్లోరిడా
-
ప్రమాద ఘంటికలు
అమెరికాలోని తీర రాష్ట్రం ఫ్లోరిడాను పెను ఉప్పెన ముంచెత్తి రెండురోజులపాటు గడగడలాడించిన తీరు పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్త ధోరణితో ఉంటున్నవారందరికీ హెచ్చరికలాంటిది. అభివృద్ధి చెందిన దేశం కావడం వల్ల, మౌలిక సదుపాయాల కొరత లేకపోవడం వల్ల, అత్యాధునిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నందువల్ల ప్రాణ నష్టం కనిష్ట స్థాయిలో ఉంది. కానీ దాని ధాటికి జరిగిన ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. ఆ రాష్ట్రంలోని వివిధ నగరాలు దాదాపు 37 గంటలు కకావికలమయ్యాయి. వందల ఇళ్లు, చెట్లు నేలకూలాయి. భారీ భవంతులు సైతం దెబ్బతిన్నాయి. ఆదివారమంతా అల్లాడించిన ఇర్మా సోమ వారం తీవ్రత తగ్గించుకుని పెను తుఫానుగా మారింది. ఇర్మా దెబ్బకు ఫ్లోరిడా మాత్రమే కాదు... అరుబా, క్యూరేసొ, క్యూబా వంటి కరీబియన్ దీవులు సైతం తీవ్రంగా నష్టపోయాయి. రెండు వారాల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని హార్వీ ఉప్పెన కాటేసింది. ఈ స్థాయి ఉప్పెన ఫ్లోరిడాలో 12 ఏళ్ల క్రితం, టెక్సాస్ రాష్ట్రంలో 13 ఏళ్లక్రితం వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో మరో పెను ఉప్పెన న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్లను తాకబోతున్నదని వారంటున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ అమెరికాలో 9 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఒక్కొక్కటి వందకోట్ల డాలర్ల (సుమారు రూ. 6,400 కోట్లు) చొప్పున నష్టాన్ని మిగిల్చింది. గత నెలలో మన దేశంతోపాటు నేపాల్, బంగ్లాదేశ్‌లను కుంభవృష్టి ముంచెత్తి వరదలొచ్చి కోటీ 70 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. మంచినీరు, ఆహారం, ఆవాసం దొరక్క జనం ఇబ్బందులపాలయ్యారు. వరదల ముప్పు నుంచి బయటపడినవారిలో కొందరు పాము కాట్లతో మరణించారు. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో జనజీవనం అస్తవ్యస్థమైంది. ప్రకృతి ఎందుకిలా కన్నెర్రజేస్తున్నదో... అకాల వర్షాలు, వరదలు, పెను తుఫానులు, వరస కరువు కాటకాలు జనం ప్రాణాలతో, వారి బతులతో ఎందుకు చెలగాటమాడుతున్నాయో తెలియనిదేమీ కాదు. ప్రకృతి వనరులను విచక్షణారహితంగా ధ్వంసం చేయడం, పారిశ్రామిక ప్రగతి పేరిట అత్యంత ప్రమాదకరమైన కర్బన ఉద్గారాలను ఎడాపెడా విడిచి పెట్టడం భూ వాతావరణాన్ని కాలుష్యం బారిన పడేయడం కారణంగా ఉష్ణోగ్రతలు అధికమై ఈ వైపరీత్యాలన్నీ ఏర్పడుతున్నాయి. ఈ కర్బన ఉద్గారాలు ఒకసారి వాతావరణంలోకి ప్రవేశిస్తే కనీసం వందేళ్లపాటు నష్టాన్ని కొనసాగిస్తూనే ఉంటాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జల, వాయు కాలుష్యం కార ణంగా మనుషులు సాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహార సంక్షోభ ప్రమాదం అంతకంతకు పెరుగుతోంది. ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే పెను ఉప్పెనలు పది రెట్లు అధికంగా పెరుగుతాయని నీల్స్ బోర్ ఇనిస్టిట్యూట్ నాలుగేళ్లక్రితం ఒక నివేదికలో హెచ్చరించింది. యేల్ స్కూల్, మసాచూసెట్స్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సంయుక్తంగా చేసిన అధ్యయనం సైతం పర్యా వరణ మార్పులవల్ల సంభవించగల తుఫానులన్నీ ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, కరీబియన్ దీవులు, దక్షిణాసియా దేశాల చుట్టూ కేంద్రీకృతమవుతాయని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటినుంచీ పర్యావరణ ప్రమాదం అనేదే బూటకమని ఎద్దేవా చేస్తున్నారు. పారిస్‌లో రెండేళ్లక్రితం ప్రపంచ దేశాల మధ్య కుదిరిన వాతావరణ ఒప్పందం నుంచి బయటికొస్తున్నట్టు ఈమధ్యే ఆయన ప్రకటించారు. ట్రంప్ వచ్చాక అమెరికాలో మితవాద భావజాలం వెర్రితలలు వేస్తున్న సంగతి కొత్తేమీ కాదు. ఇర్మా విరుచుకుపడుతున్న తరుణంలో కూడా ఈ పోకడ కనబడింది. ఇర్మా వల్ల జరగబోయే నష్టాన్ని పర్యావరణవాదులు భూత ద్దంలో చూపుతున్నారని... ఆ మాటున వాతావరణానికి కీడు ఏర్పడుతుందని నమ్మించి కోట్లాది డాలర్లు దిగమింగడమే వారి ఆంతర్యమని మితవాదం నూరి పోసే ఒక రేడియో చానెల్ యాంకర్ ఆరోపించాడు. తీరా అది తీరాన్ని తాకబోతుం డగా అక్కడినుంచి పలాయనం చిత్తగించాడు. ట్రంప్ అధికారంలోకొచ్చాక జాతీయ వాతావరణ సంస్థ, జాతీయ సముద్ర, వాతావరణ అధ్యయన సంస్థ వంటివాటికి బడ్జెట్ కేటాయింపులను దాదాపు 15 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సంస్థలు సేకరిస్తున్న నమూనాలు, వాటిని విశ్లేషించడానికి ఉపయోగిస్తున్న ఉపకరణాల వల్ల సముద్రాల్లో ఏర్పడే తుఫానులను గుర్తించడం, వాటి తీవ్రతలోని హెచ్చుతగ్గుల్ని, వాటి కదలికల్ని అంచనా వేయడం సాధ్యమవుతోంది. వాతావరణ సంస్థలు వైప రీత్యాల్ని సరిగ్గా అంచనా వేయగలిగితే పౌరుల్లో ఆ సంస్థలపై విశ్వాసం ఏర్పడు తుంది. వాటి హెచ్చరికలకు అనుగుణంగా నడుచుకుంటారు. అప్పుడు సహాయ చర్య అమలు తేలికవుతుంది. ట్రంప్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం దీన్నం తటినీ జటిలం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ సంస్థపై కూడా ట్రంప్ శీతకన్ను పడింది. వాతావరణ మార్పులకూ, వైపరీత్యాలకు మధ్యగల సంబంధంపై అధ్య యనం చేయడంతోపాటు రసాయన పరిశ్రమలవల్ల కలిగే ఉత్పాతాల గురించి సవివరమైన నివేదిక రూపొందించిన ఆ సంస్థ నిధుల్లో ఇకపై మూడోవంతు కోత విధించబోతున్నట్టు ఆయన ఇటీవలే ప్రకటించాడు. అమెరికా తీర ప్రాంతాల్లో ఉన్న 90 నగరాలు తరచు వరద బీభత్సాన్ని చవిచూస్తున్నాయి. రాగల రెండు దశాబ్దాల్లో వీటి సంఖ్య రెట్టింపవుతుందని అంచ నాలున్నాయి. హార్వీ, ఇర్మా ఉప్పెనల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడాల్లోని సైనిక, నావికాదళ, వైమానిక దళ కార్యాలయాలను మూసేసి, అక్కడి వేలాదిమంది సిబ్బందిని తరలించాల్సివచ్చింది. ఈ ముప్పే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు కూడా పొంచి ఉంది. పర్యావరణంపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించి, అమలు చేయకపోతే అమెరికా సరే... ప్రపంచదేశాలను కూడా ప్రమాదం అంచుకు నెట్టినట్టవుతుందని ట్రంప్ గుర్తించడం తక్షణావసరం. హార్వీ, ఇర్మా మోసుకొచ్చిన హెచ్చరికలివి. -
అంధకారంలో ఫ్లోరిడా
► 62 లక్షల మందికి నిలిచిన విద్యుత్ సరఫరా ► కేటగిరీ–1 స్థాయికి తగ్గి జార్జియా వైపుగా హరికేన్ ఇర్మా ► నాలుగుకు చేరిన మృతులు.. క్యూబాలో 10 మంది మృతి ► ఇర్మా నష్టం రూ.4 నుంచి 5.9 లక్షల కోట్లు: మూడీస్ మయామి: అమెరికాలోని ఫ్లోరిడా తూర్పు తీరాన్ని వణికించిన హరికేన్ ఇర్మా సోమవా రం సాయంత్రానికి బలహీనపడి కేటగిరీ 1 స్థాయికి చేరింది. హరికేన్ ధాటికి ఫ్లోరిడాలో మృతుల సంఖ్య నాలుగుకు చేరగా.. దాదాపు 62 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కొన్ని వారా లు పట్టవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. సోమవారం టాంప నగరంతో పాటు ఇతర పట్టణాల్లో ఇర్మా భారీ ఆస్తి నష్టం కలి గించగా.. ఇంకా హరికేన్ స్థాయిలోనే గాలులు కొనసాగుతాయని, భారీ వర్షం నమోదుకావచ్చని, తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే ప్రమాదముందని అమెరికా హరికేన్ కేంద్రం హెచ్చరించింది. తీవ్రతను హరికేన్ నుంచి ఉష్టమండల తుపాను స్థాయికి, గాలుల గరిష్ట వేగాన్ని 112 కి.మీ.లకు తగ్గిం చింది. అమెరికా కంటే ముందు కరీబియన్ దీవుల్లో పెను విధ్వంసం సృష్టించిన ఇర్మా అక్కడ 38 మంది ప్రాణాల్ని బలితీసుకుంది. క్యూబాలో సృష్టించిన విధ్వంసంలో 10 మంది మరణించారని ఆ దేశ అధికారులు సోమవారం ప్రకటించారు. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడొచ్చు ఉత్తర ఫ్లోరిడా, దక్షిణ జార్జియా వైపుగా ముందుకు కదులుతూ మరింత బలహీనపడి జార్జియా, అలబామా, మిస్సిసిపీ, టెన్నెసీ రాష్ట్రాల వైపునకు ఇర్మా తరలిపోనుందని హరికేన్ కేంద్రం తెలిపింది. ముందుకు కదు లుతున్న కొద్దీ సముద్ర తీరంలో భారీ అలలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మంగళవారానికి అల్పపీడనంగా బలహీనపడవచ్చని వెల్లడించింది. ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, పల్లపు ప్రాంతాలను 6 అంగుళాల మేర నీరు ముంచెత్తవచ్చని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ట్వీటర్లో హెచ్చరించారు. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో నష్టం వివరాలు పూర్తిగా తెలియలేదు. పరిస్థితి ఊహించినంత ప్రమాదకరంగా లేదని, అలలు ఎగసిపడవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని టాంప మేయర్ బాబ్ బక్హర్న్ చెప్పారు. హరికేన్ బాహ్య వలయం జార్జియా వైపుగా కదలడంతో ఆ రాష్ట్రంపై ఇర్మా ప్రభా వం చూపుతోంది. జార్జియాలో లక్ష మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెండింటి నష్టం 12.8 లక్షల కోట్లు హరికేన్ ఇర్మా, హార్వీల నష్టం మొత్తం 150– 200 బిలియన్ డాలర్లు(రూ.9.6 –12.8 లక్షల కోట్లు)గా ఉండొచ్చని మూడీస్ సంస్థ ఆర్థిక విశ్లేషకుడు మార్క్ జందీ ప్రాథమికంగా అంచనావేశారు. పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే లెక్కల్లో కొంతమేర మార్పులు ఉండొచ్చన్నారు. ఈ రెండు హరికేన్లతో అమెరికా ఉత్పత్తి రంగానికి 20– 30 బిలియన్ డాలర్లు(రూ.1.28 –1.98 లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ రెండు హరికేన్ల నష్టం కలిపితే హరికేన్ కత్రినా నష్టంతో దాదాపు సమానంగా ఉండొచ్చని చెప్పారు. ఇర్మా నష్టాన్ని ప్రాథమికంగా 64–92 బిలియన్ డాలర్లు (రూ.4–5.9 లక్షల కోట్లు)గా మూడీస్ నిర్ధారించింది. మేం అదృష్టవంతులం: ట్రంప్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఫ్లోరిడా పశ్చిమ తీరం వైపున కాకుండా తూర్పు తీరం వైపు ఇర్మా మళ్లడంతో ‘మనం కొంతమేర అదృష్టవంతులం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇర్మా భారీ నష్టం మిగిల్చిందని, అయితే ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. బాధితులకు అండగా ‘ఆటా’ రాయికల్(జగిత్యాల): ఇర్మా బాధితులకు తెలంగాణ అసోసియేషన్ (ఆటా) సభ్యులు చేయూతగా నిలుస్తున్నారు. మిల్‌వుడ్, కేటీ ప్రాంతాల్లో ఆటా అధ్యక్షుడు కడిమల్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సాయంచేస్తున్నారు. ప్రవాస తెలంగాణ వారితోపాటు అమెరికన్లకూ భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి ఫోన్లో చెప్పారు. ముఖ్యంగా కేటీ ప్రాంతంలో తెలంగాణకు చెందిన ప్రవాసులు ఇక్కడ అధికంగా ఉంటారని, అందరు క్షేమంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కార్యక్రమాల్లో ఆటా మాధవరం కరుణాకర్, చీమర్ల నరేందర్, మర్రిపల్లి రఘువీర్, చాడ శ్రీనివాస్, కంచెలకుంట్ల శ్రీధర్ పాల్గొన్నారు. -
ఇర్మా ఎఫెక్ట్.. వాల్ట్ డిస్నీవరల్డ్ మూత
ఫ్లోరిడా: అమెరికాలో విధ్వంసం సృష్టిస్తున్న హరికేన్ ఇర్మా సెగ ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీవరల్డ్ రిసార్ట్‌కు కూడ తగిలింది. ఇర్మా తుఫాను ప్రభావంతో వాల్ట్ డిస్నీవరల్డ్ రిసార్ట్ రెండు రోజులు మూసివేశారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న ఔత్సాహికులకు రిసార్టు అధికారులు డబ్బుల తిరిగిచ్చేశారు. అయితే కొన్ని థర్డ్ పార్టీ కంపెనీలు మాత్రం డబ్బులు తిరిగివ్వలేదు. గత 45 ఏళ్ల చరిత్రలో డిస్నీవరల్డ్ మూతబడటం ఇది ఆరోసారి మాత్రమే. భద్రతా కారణాల దృష్ట్యా రిస్టార్ట్‌ను ఆది, సోమవారం మూసివేస్తున్నట్లు, తిరిగి మంగళవారం తెరుస్తామని రిసార్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇక గత అక్టోబర్‌లో కూడా హరికేన్ మాథ్యూ దెబ్బకు ఈ రిసార్ట్ గేట్లు మూతబడ్డాయి. సౌత్‌వెస్ట్ ఓర్లాండోలో 25వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో మ్యాజిక్ కింగ్డమ్, ఈపికాట్, యానిమల్ కింగ్డమ్, హలీవుడ్ స్టూడియోలతో నాలుగు మెయిన్థీమ్ పార్కులున్నాయి. ఇంకా వాటర్ పార్క్‌లు, హోటల్స్, ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లున్నాయి. థీమ్డ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ గతేడాది రిపోర్టు ప్రకారం మ్యాజిక్ కింగ్డమ్ పార్కు ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందినది. 2016లో ఈ పార్కును 20 మిలియన్ల మంది సందర్శించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇక రిసార్ట్ ఉద్యోగుల సంఖ్య 73,000. డిస్నీవరల్డే డిస్నీ కంపెనీకి ముఖ్యమైన రెవెన్యూ ఆధారం. హరికేన్ ఇర్మా డిస్నీకి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. -
ప్రకృతిని ఎదురిస్తూ, మృత్యువుకు ఎదురెళ్లి..
న్యూయార్క్ : హరికేన్ ఇర్మా.. అందరినీ భయపెట్టింది. అమెరికా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇళ్లలో ఉన్నవాళ్లు ఎవరూ బయటకు రాలేదు.. గాలులు భీకరంగా వీస్తున్నాయి.. కెరటాలు అంతెత్తున ఎగిసి పడుతున్నాయి. అయినా.. విద్యుక్తధర్మంలో ఎక్కడా రాజీ పడలేదు. మృత్యువుకు ఎదురుగా వెళుతూ.. ప్రకృతిని ఎదురిస్తూ.. ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ వార్తలను అందించారు. హోరుగాలులు, భీకర వర్షంలోనూ తాజా పరిస్థితిని జర్నలిస్టులు వివరించారు. వాతావరణానికి సంబంధించిన విషయాలను ఇటు ప్రభుత్వానికి.. అటు ప్రజలకు తెలిపారు. హరికేన్ ఇర్మాలో రిపోర్ట్ జర్నలిస్టులు పడ్డ కష్టాలను మీరూ చూడండి... -
ప్రకృతిని ఎదురిస్తూ, మృత్యువుకు ఎదురెళ్లి..
-
దిశ మార్చుకున్న ఇర్మా.. ముప్పు తప్పినట్లేనా?
సాక్షి, న్యూయార్క్: హరికేన్ ఇర్మా కాస్త శాంతించినట్లే కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం ఫ్లోరిడా రాష్ట్రాన్ని బలంగా తాకిన తుఫాన్ ముందు నైరుతి ఫ్లోరిడా వైపు కదిలినట్లు కనిపించింది. అయితే ప్రస్తుతం తంప వద్ద కేంద్రీకృతమైన ఇర్మా దిశమార్చుకుని పశ్చిమ తీరం దిశగా మళ్లినట్లు సమాచారం. దీంతో పెనుముప్పు తప్పినట్లేనని అధికారులు భావిస్తున్నారు. సముద్రం మాయం ప్రచండ గాలుల వేగం నిన్న సుమారు గంటకు 135 మైళ్ల వేగం కాగా, నేడు అది 105 మైళ్లకు తగ్గింది. దీంతో ప్రమాద హెచ్చరికను కేటగిరి-4 నుంచి కేటగిరీ-2కి తగ్గించారు. అయితే తీర ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం అధికంగా ఉండబోతుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు 10-15 అడుగుల ఎత్తు అలలు ఎగిసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఫ్లోరిడా, జార్జియా, కరోలినస్ రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదనే అనిపిస్తోంది. అయితే తాము నష్టం గురించి పట్టించుకోవట్లేదని... ప్రజల ప్రాణాల గురించే తాము ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అల్లలాడుతున్న తెలుగు కుటుంబాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ట్రంప్ తుఫాన్ ఉధృతి తగ్గుముఖం పట్టినా మరికొన్ని గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ అధికారులకు సూచించారు. తుఫాన్ దాటికి ఇప్పటిదాకా ఫ్లోరిడాలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. విద్యుత్ సేవలకు అంతరాయం కలగటంతో 3 మిలియన్ల మంది గాడాంధకారంలో చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. లక్ష పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు. 75 ఏళ్ల క్రితమే హర్వే-ఇర్మాలు నడివీధుల్లోకి సంద్రం -
ఫ్లోరిడాలో రంగంలోకి దిగిన సైన్యం
-
ఫ్లోరిడాలోని తెలుగువారు ఏమన్నారంటే..?
-
ఫ్లోరిడాలో ఇర్మా విధ్వంసం
-
ఇర్మా ఎఫెక్ట్ : ఫ్లోరిడాలో ’అణు’ టెన్షన్
-
ఇర్మా ఉగ్ర రూపం.. సడెన్‌గా మార్పు
-
ఇర్మా వస్తే మాకేంటి..సెల్ఫీ తర్వాతే..!
-
ఇర్మా ఎఫెక్ట్ : మాయమైన సముద్రం
-
మియామి తీరాన్ని తాకిన హరికేన్ ఇర్మా
-
ఫ్లోరిడా.. దడ దడ
నేడు అమెరికాను తాకనున్న ఇర్మా తుపాను ► కనీవినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం ఉండొచ్చని ఆందోళన ► సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని 63 లక్షల మందికి విజ్ఞప్తి ► ఫ్లోరిడాలో వేలాది మంది భారతీయులు.. భారత విదేశాంగ శాఖ అప్రమత్తం ► జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా, అలబామాల్లోనూ అత్యవసర పరిస్థితి ► శనివారం క్యూబా, బహమాస్‌లో కొనసాగిన విధ్వంసం ► ఇర్మా ధాటికి కరీబియన్ దీవుల్లో ఇంతవరకూ 25 మంది మృతి ► కేటగిరీ 3 స్థాయికి తగ్గిన ఇర్మా.. అమెరికా తీరాన్ని తాకే సమయం - ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ప్రాంతం - ఫ్లోరిడా కీస్ ఆ సమయంలో గాలుల తీవ్రత - గంటకు 205 కిలోమీటర్లు ఎగిసిపడనున్న అలల ఎత్తు - 12 అడుగుల వరకు.. కేటగిరీ 3 అంటే..? - హరికేన్ సమయంలో గాలుల వేగం గంటకు 178– 208 కిలోమీటర్ల మధ్య ఉండటం మయామి: కరీబియన్ దీవుల్ని అతలాకుతలం చేసిన హరికేన్ ఇర్మా అమెరికాలో పెను విధ్వంసం సృష్టించేందుకు తీరం వైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ఆదివారం ఉదయం ఫ్లోరిడా రాష్ట్ర తీరాన్ని తాకనున్న ఈ హరికేన్ అమెరికాలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించవచ్చని ఆ దేశ జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరించింది. శనివారమంతా బహమాస్, క్యూబాల్లో భారీ నష్టం మిగిల్చిన ఇర్మా.. ‘ఫ్లోరిడా కీస్’ వద్ద అమెరికా తీరాన్ని తాకి, అనంతరం ప్రధాన భూభూగమైన మయామి–డేడ్ కౌంటీపై విరుచుకుపడనుంది. ఆ సమయంలో గంటకు 205 కి.మీ వేగంతో పెనుగాలులతో పాటు కుండపోత వర్షం ముంచెత్తవచ్చని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం మొదలైంది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఫ్లోరిడా రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో ఇది నాలుగో వంతుపైనే కావడం గమనార్హం. వేలాది మంది భారతీయులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. జార్జియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా హోటళ్లన్నీ ఫ్లోరిడా ప్రజలతో నిండిపోయాయి. జార్జియా తీర ప్రాంతాల నుంచి 5.4 లక్షల మంది సహాయక శిబిరాలకు వెళ్లాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు. ఫ్లోరిడా, జార్జియాతో పాటు, ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, అలబామా రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అత్యవసర సహాయం కోసం హోం ల్యాండ్, ఎమర్జెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వేలాది మందితో పాటు ఆర్మీ సిబ్బందిని ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో మోహరించారు. ఇంకా అత్యంత ప్రమాదకరమే.. హరికేన్ ఇర్మా ఇంకా అత్యంత ప్రమాదకరంగానే ఉందని, ఆదివారం ఉదయం తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా 205 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, హరికేన్ కన్ను(మధ్య ప్రాంతం) నైరుతి ఫ్లోరిడా, టాంపాను ఆదివారం మధ్యాహ్నం తాకవచ్చని హరికేన్ కేంద్రం తెలిపింది. ఆదివారం మొత్తం ఫ్లోరిడా తీర ప్రాంతం మీదుగానే హరికేన్ ముందుకు కదులుతుందని, ఈ సమయంలో భారీ నష్టం జరగవచ్చని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నానికి(భారత కాలమానం ప్రకారం) హరికేన్ కేంద్రం మయామికి 245 మైళ్ల(395 కి.మీ) దూరంలో ఉండగా.. తీరంవైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ‘ఫ్లోరిడాపై ఇర్మా ప్రభావం చూపనుందా? అన్నది ప్రశ్న కాదు.. ఏ స్థాయిలో బీభత్సం ఉంటుందనేదే అసలు ప్రశ్న’ అని అమెరికా అత్యవసర నిర్వహణ విభాగం చీఫ్ బ్రాక్ లాంగ్ అన్నారు. ఫ్లోరిడా కీస్‌కు పెనుముప్పు ఫ్లోరిడా కీస్‌లోని పల్లపు ప్రాంతాల్లో పెనుగాలులతో పాటు భారీ ఎత్తున అలలు ఎగసిపడవచ్చని హెచ్చరికలు జారీచేశారు. ముందు జాగ్రత్తగా హోటళ్ల నుంచి పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఇది ప్రభావం చూపనుంది. ఇర్మా దారి నుంచి వైదొలగకపోతే ప్రాణనష్టం సంభవించవచ్చు’ అని హరికేన్ కేంద్రం అధికారి డెన్నిస్ తెలిపారు. అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం సమాచారం ప్రకారం.. గత 82 ఏళ్లలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అతి తీవ్రమైన ఐదు హరికేన్లలో ఇర్మా ఒకటి. క్యూబాలో భారీ ఆస్తి నష్టం గురువారం నుంచి ఇంతవరకూ ఇర్మా ధాటికి కరీబియన్ దీవుల్లో 25 మంది మరణించారు. శుక్రవారానికి కేటగిరి 4 స్థాయికి తగ్గిన హరికేన్ తీవ్రత శనివారం మరింత బలపడి కేటగిరి 5కి చేరింది. అనంతరం మళ్లీ కేటగిరి 3 స్థాయికి తీవ్రత తగ్గింది. శనివారం క్యూబాను తాకిన ఇర్మా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. 1924 అనంతరం క్యూబాను కేటగిరి 5 స్థాయి హరికేన్ తాకడం ఇదే మొదటిసారి. గంటకు 200 కి.మీ పైగా వేగంతో గాలులు వీచాయని, 16 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని, ఆస్పత్రులు, కర్మాగారాలు, భవనాలు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తర తీర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. పూర్తి నష్టం వివరాలు తెలియాల్సిఉంది. అలాగే బహమాస్ దక్షిణ ప్రాంతంలో కూడా శనివారం హరికేన్ విధ్వంసం కొనసాగింది. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పాటు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బ్రిటన్ అధీనంలోని టర్క్స్ అండ్ కైకోస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నామని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. భారతీయుల క్షేమంపై విదేశాంగ శాఖ అప్రమత్తం హరికేన్ ఇర్మా నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో వేలాది మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఆ శాఖ అప్రమత్తమైంది. అమెరికా, వెనెజులా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నాయని ఇర్మాతో ప్రభావితమయ్యే భారతీయులకు సాయపడేందుకు స్థానిక ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ చెప్పారు. కరీబియన్ దీవులవైపు దూసుకొస్తున్న జోస్ హరికేన్ జోస్‌ను కేటగిరి 4 స్థాయికి పెంచారు. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో లీవర్డ్ దీవులవైపు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇర్మా దెబ్బకు సెయింట్ మార్టిన్ దీవి విధ్వంసం కాగా.. జోస్ ముప్పు నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెలికాప్టర్ల ద్వారా హెచ్చరికలు వినిపిస్తున్నారు. మొదలైన ఇర్మా ప్రభావం ‘తుపాను సమీపానికి వచ్చేసింది. ఇప్పటికే ఫ్లోరిడా తీర ప్రాంతంలో 25 వేల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హరికేన్ తీరాన్ని తాకే సమయంలో 12 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడతాయి. ఖాళీ చేయాలని కోరితే తక్షణం తరలిపోండి. ఒకసారి తుపాను తాకితే సహాయక సిబ్బంది కూడా ఏమీ చేయలేరు’ అని ఫ్లోరిడా గర్నవర్ రిక్ స్కాట్ హెచ్చరించారు. ఫ్లోరిడాలో ఇంతవరకూ 260 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, యుద్ధప్రాతిపదికన మరో 70 షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నర్సుల అవసరం ఎక్కువగా ఉందని, అందువల్ల అందుబాటులో ఉన్నవారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విధ్వంసకర తుపాను కావచ్చు. అధికారులు, పోలీసుల సూచనల ప్రకారం నడుచుకోండి’ అని అధ్యక్షుడు ట్రంప్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరీబియన్ దీవుల్లో ఇర్మా విధ్వంసం ♦ సెయింట్ మార్టిన్, సెయింట్ బార్తెలెమి: ఈ ఫ్రాన్స్ దీవుల్లో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది.11 మంది మరణించారు. ♦ బార్బుడా: ఈ చిన్న ద్వీపంలో దాదాపు 95 శాతం ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మరణించారు. ♦ యాంగ్విలా: బ్రిటన్ ఆధీనంలోని ఈ ద్వీపంలో ఒకరు మరణించగా.. భారీ ఆస్తి నష్టం సంభవించింది. ♦ ప్యూర్టోరికో: ముగ్గురు మరణించారు. అమెరికా ఆధీనంలోని ఈ స్వతంత్ర దేశంలో 6 వేల మంది ఇంకా పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. లక్షలాది మంది చీకట్లోనే మగ్గుతున్నారు. ♦ అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్: నలుగురు చొప్పున మృతి, పెను విధ్వంసం ♦ టర్క్, కైకోస్: ఈ బ్రిటిష్ ద్వీపంలో భారీ విధ్వంసం.. నష్టం వివరాలు తెలియాలి. ♦ హైతీ, డొమినికన్ రిపబ్లిక్, క్యూబా, బహమాస్: పెద్ద ఎత్తున ఆస్తి నష్టం. -
ఇర్మా: మియామికి ముప్పు తప్పినట్లేనా..!
మియామి: హరికేన్ ఇర్మా శనివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరేబియన్ దీవులకు 85 మైళ్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇర్మా తన దిశను మార్చుకున్నట్లుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఇర్మా తుపారు మియామిని నేరుగా తాకే అవకాశం ఉండదని.. దాంతో ముప్పు చాలా వరకు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అత్యంత వేగంతో భారీ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇర్మా హరికేన్ క్యూబా ఉత్తర తీరంవైపు ప్రయాణిస్తోందని, ఫ్లోరిడాకు ఆగ్నేయతీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. హరికేన్ ఇర్మా ఒకవేళ క్యూబా తీరాన్ని తాకితే.. టర్క్స్, కొకైస్, బహమాస్ ఆగ్నేయ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యూబా తీరంలో గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
కొనసాగుతున్నఇర్మా విధ్వంసం
-
కొనసాగుతున్నఇర్మా విధ్వంసం
నిర్మానుష్యంగా మారిన ఫ్లోరిడా అమెరికా చరిత్రలోనే అత్యధికంగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు ఆదివారం ఫ్లోరిడా తీరం తాకే అవకాశం మయామి: అటు కరేబియన్, ఇటు ఫ్లోరిడాల్లో హరికేన్ ఇర్మా విధ్వంసం కొనసాగిస్తోంది. లక్షల సంఖ్యల ప్రజలును సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ హరికేన్ ధాటికి కరేబియన్ దీవుల్లో ఇప్పటివరకూ సుమారు 24 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం దాదాపు 3 కోట్లమందిపై తీవ్ర ప్రభావం చూపింది. కరేబియన్, ఫ్లోరిడా ప్రాంతాలను వణికిస్తున్న ఇర్మా హరికేన్ ఆదివారం తీరం తాకవచ్చని తెలుస్తోంది. తీరాన్ని తాకే సమయంలో 12 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడవచ్చని, గంటకు 250 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని అమెరికా జాతీయ హరికేన్ విభాగం హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం.. 2005లో హరికేన్ కత్రినా తర్వాత ఇదే మొదటిసారి. ఫ్లోరిడా నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడం.. నగరం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. రహదారులు, భవనాలు, క్రీడా మైదానాలు, కార్యాలయాల్లో ఎక్కడా సంచారం లేకుండా పోయింది. ఇర్మా హరికేన్ వల్ల సుమారు 125 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రజలెవరూ.. ఇళ్లలో ఉండవద్దని ఫ్లోరిడా ప్రభుత్వం సూచనలు చేస్తోంది. హరికేన్ తీరం దాటే సమయంలో సుమారు 250 కి.మీ. వేగంతో గాలులు వీచే వకాశం ఉండడంతో.. ప్రమాదస్థాయి తీవ్రంగా ఉంటుందని ఫ్లోరిడా రాష్ర్ట హరికేన్ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్రూ సెస్మన్ చెబుతున్నారు. అంతేకాక తుపాను తీరం దాటే సమయంలో 6 నుంచి 12 అడుగుల ఎత్తులో కెరటాలు ఎగిసిపడతాయని అధికారులు చెబుతున్నారు. తీపాను తీవ్రత, ఆసమయంలో వీచే భీకర గాలులు, ఆ సముద్రం నుంచి ఎగిసిపడే అలలతో ఫ్లోరిడా మొత్తం నీటితో మునిగిపోయే ప్రమాదముందని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మియామి దీవులకు ఆగ్నేయ దిశలో ఉన్న హరికేన్ ఇర్మా.. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమంగా కదులుతోంది. హరికేన్ ఇర్మా చాలా ప్రమాదకరమైందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. ఇర్మా తుపాను గాలులు సగటున గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వందల్లో పునరావాస కేంద్రాలు ఫ్లోరిడానుంచి లక్షల్లో వస్తున్న ప్రజలకు మియామిలోనూ, సమీప ప్రాంతాల్లోనూ వందల్లో పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రం సామర్థ్యం బట్టి.. కనీసం 5 వేల నుంచి 10 మందిని అనుమతిస్తున్నారు. ఒక్క శుక్రవారం రాత్రే ఫ్లోరిడా నుంచి లక్ష మంది వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.