
అమెరికా ఫ్లోరిడాలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన షెల్టర్‌లో తలదాచుకున్న బాధితులు (ఇన్‌సెట్‌లో) హరీష్
ఇలాంటి హరికేన్ చూడలేదు
ఇర్మాపై ఫ్లోరిడాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు వెల్లడి
తాత్కాలిక షెల్టర్‌లో బాధితులు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): అమెరికాలోని ఫ్లోరిడాను వణికించిన హరికేన్ ఇర్మా లాంటి దానిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇర్మా హరికేన్ తాకిడి సమయంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెల్టర్‌లో పలువురు తెలుగువారు తలదాచుకున్నారు. వారిలో ఒకరైన కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు.
జిల్లాలోని బి.తాండ్రపాడుకు చెందిన రైతు భూపాల్‌రెడ్డి కుమారుడు హరీష్ ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంప పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విశ్వరూపం చూపిన హరికేన్ సోమవారానికి శాంతించినా.. షెల్టర్‌లో ఉన్న వారిని ప్రభుత్వం ఇంకా బయటకు పంపడం లేదని హరీష్ తెలిపారు. రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు పునరుద్ధరించిన తర్వాతే షెల్టర్ల నుంచి బయటకు వెళ్లాలని అమెరికా ప్రభుత్వం సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. హరికేన్ ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదని తెలిపారు.