
హాంగ్ కాంగ్‌లో ప్రవాస తెలుగు వారందరు ఎంతో ఆనందోత్సాహాలతో దీపావళి వెలుగులను తమ నవ్వుల జిలుగులతో వెలిగించారు. ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ వారు స్థానిక కోవిడ్ నియమాలను పాటిస్తూ ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇండియా క్లబ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని ప్రదర్శిస్తూ, పిల్లలు - పెద్దలు తమ నాట్య గానాలతో అందరిని అలరించారు.
ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ సమాజ సేవిక షీలా సమతాని, మిస్ కోని వాంగ్, NAAC (The Neighbourhood Advice Action Council)-అల్పసంఖ్యాక వర్గాలకున్న, మద్దతు సేవా కేంద్రానికి అధ్యక్షురాలిగా, హాంగ్ కాంగ్‌లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలకు తమ సంస్థల ద్వారా అనేక సేవలను అందజేస్తున్నారు.
ముఖ్య అతిధులిద్దరు తెలుగు వారి సంప్రదాయాలని, వేడుకల్ని, సేవా భావాన్ని, స్ఫూర్తిగా కొనియాడుతూ ప్రశంసించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, తాము ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యవర్గ సభ్యులు రమాదేవి సారంగా, రాధిక విశ్వనాథ్, కొండ మాధురి, హర్షిణి పచ్చoటి, రాజశేఖర్ మన్నే, వేమూరి విశ్వనాథ్, హరీన్ తుమ్మల, గరదాస్ గ్యానేశ్వర్ తదితరులు ఎంతో నేర్పుగా దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని తమ ఆనందాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment