telugu nris
-
వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు
అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!. ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్‌క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు) -
హాంగ్ కాంగ్లో దీపావళి ధమాల్!
హాంగ్ కాంగ్లో ప్రవాస తెలుగు వారందరు ఎంతో ఆనందోత్సాహాలతో దీపావళి వెలుగులను తమ నవ్వుల జిలుగులతో వెలిగించారు. ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ వారు స్థానిక కోవిడ్ నియమాలను పాటిస్తూ ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇండియా క్లబ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మన తెలుగు సంస్కృతిని ప్రదర్శిస్తూ, పిల్లలు - పెద్దలు తమ నాట్య గానాలతో అందరిని అలరించారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ సమాజ సేవిక షీలా సమతాని, మిస్ కోని వాంగ్, NAAC (The Neighbourhood Advice Action Council)-అల్పసంఖ్యాక వర్గాలకున్న, మద్దతు సేవా కేంద్రానికి అధ్యక్షురాలిగా, హాంగ్ కాంగ్లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాలకు తమ సంస్థల ద్వారా అనేక సేవలను అందజేస్తున్నారు. ముఖ్య అతిధులిద్దరు తెలుగు వారి సంప్రదాయాలని, వేడుకల్ని, సేవా భావాన్ని, స్ఫూర్తిగా కొనియాడుతూ ప్రశంసించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, తాము ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యవర్గ సభ్యులు రమాదేవి సారంగా, రాధిక విశ్వనాథ్, కొండ మాధురి, హర్షిణి పచ్చoటి, రాజశేఖర్ మన్నే, వేమూరి విశ్వనాథ్, హరీన్ తుమ్మల, గరదాస్ గ్యానేశ్వర్ తదితరులు ఎంతో నేర్పుగా దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని తమ ఆనందాన్ని వెల్లడించారు. -
తెలుగు ఎన్నారై రవి పులి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ
రాయికల్(జగిత్యాల): సుమారు రెండువందల సంవత్సరాల పాటు మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపావళి పర్వదినాన ఆయన ఎన్నికవడంపై యూకేలో స్థిరపడిన ప్రవాస భారతీయులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. రిషి ఎన్నికపై ప్రవాసీయులు ‘సాక్షి’తో తమ మనోభావాలు పంచుకున్నారు. వారి మాటల్లోనే.. ఆర్థిక విధానాలతోనే ప్రజాదరణ మాది హైదరాబాద్. నేను ఉద్యోగ రీత్య బ్రిటన్‌లో పనిచేస్తున్నా. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్ర ధానిగా పీఠం అధిరోహించడం ఆనందంగా ఉంది. యూకేలో కరోనా మహమ్మారి సమయంలో రిషి రూపొందించిన ఆర్థిక సంస్కరణలతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆర్థిక విధానాలతో యూకేలో పూర్వ వైభవం తీసుకువస్తారనే ఆశతో ఎన్నుకున్నారు. – సిక్క చంద్రశేఖర్, ఎన్ఆర్ఐ, లండన్ సమర్థవంతంగా పాలిస్తారు మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండలం తుంగతుర్తి గ్రామం. భారత సంతతికి చెందిన రిషి యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో ఆనందంగా ఉంది. ఆయన అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆర్థిక మాంధ్యం నుంచి ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ప్రజలు, కన్జర్వేటివ్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దగల శక్తి రిషికి ఉందనే నమ్మకం ఉంది. – సతీశ్‌రెడ్డి, లండన్ ప్రతిపక్షాలను సమన్వయం చేస్తారు మాది మహబూబాబాద్ జిల్లా కంబంపల్లి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలోని సభ్యులకు కేబినేట్లో మంత్రి పదవి ఇచ్చారు. దీనిద్వారా ఆయన రాజకీయ చాతుర్యం యూకేలోని అన్ని పార్టీలకు తెలిసింది. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సత్తా రిషి సునాక్‌కు ఉంది. ఇండియా, యూకే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. – సతీశ్‌కుమార్, నార్తర్న్ ఐర్లాండ్ మంచి ఆర్థిక నిపుణుడు మాది హైదరాబాద్. బ్రిటన్ ప్రధాని రిషి యూకేలో మాజీ ఆర్థికమంత్రిగా పనిచేశారు. యూకేలో ఆర్థిక సంక్షోభం గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. చిన్నవయసులోనే ప్రధాని కావడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యూకేకు పూర్వ వైభవం తెస్తారనే నమ్మకం ప్రజలు, నాయకుల్లో ఉంది. – దూసరి అశోక్‌గౌడ్, ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ యూకే ప్రెసిడెంట్ గర్వంగా ఉంది నాది కరీంనగర్ జిల్లా కేంద్రం. మొన్నటివరకు లండన్‌లో ఉద్యోగం చేశా. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది. ముఖ్యంగా భారత్, బ్రిటన్ల మధ్య అనేక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. యూకేలో భారతీయులకు ఒక భరోసా నెలకొల్పింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. – కూర్మాచలం అనిల్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ -
ప్రజాసంకల్పయాత్రకు సిడ్నీ ప్రవాసాంధ్రుల సంఘీభావం
సిడ్నీ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆంధ్ర రాష్ట్రమంతటా ప్రజలు నీరాజనాలు పడుతుండగా.. విదేశాల్లోనూ జననేత పాదయాత్రకు ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ సిడ్నీ విభాగం ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు ప్రజాసంకల్పయాత్ర 3,000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడ్నీ నగరంలోని పర్రామట్ర పార్క్‌లో కేక్ కట్ చేసి.. జననేత వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షులు శ్రీరంగారెడ్డి, తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోవిందరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, శిరీష్, మనురెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై జగన్ అని నినాదాలు చేస్తూ సిడ్నీ విభాగం సభ్యులు పాదయాత్ర చేశారు. పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త సిద్ధార్థరెడ్డి ఈ సందర్భంగా ఫోన్లో మాట్లాడి రాష్ట్ర పరిస్థితులను ప్రవాసాంద్రులకు వివరించారు. ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రసాంధ్రులను అభినందించారు. పార్టీ సిడ్నీ సభ్యులు రఘు, రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని, హోదాను వైఎస్ జగన్ మాత్రమే సాదిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అబద్ధాలకోరు చంద్రబాబును నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు వారు సూచించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం తథ్యమని, వైఎస్ జగన్‌ను ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. -
వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్, సాక్షి ప్రతినిధి : వాషింగ్టన్ డీసీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రలు వైఎస్సార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీధర్ నాగిరెడ్డి సభను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను ఎన్నారైలకు పరిచయం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ సలహాదారు (యుఎస్ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలను ఎన్నారైలు అభినందించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంలో విలువలు, విశ్వసనీయత ఉన్నాయని కొనియాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ జగన్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరని, హోదా సాధించే వరకూ వైఎస్సార్సీపీ విశ్రమించబోదని రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే జననేత వైఎస్ జగన్ కోసం ప్రవాసాంధ్రులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ప్రజల మనిషని, ప్రజల కోసమే పుట్టి, వారి కోసమే బతికిన నాయకుడని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ దివంగత నాయకుడిని స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అనంతరం కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ప్రతి బూత్ పరిధిలో అదనంగా పది ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలవడం సులభం అవుతుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని విమర్శించిన ఆయన, ప్రతీరోజు బాబు చెబుతున్న నిజాలను చూసి మైక్రోఫోన్ సిగ్గుతో తలదించుకుంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధి, ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను ఎన్ఆర్ఐలు హర్షించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచి, వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ప్రవాసాంధ్రులు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి ఎన్నారై తమ వంతు కృషి చేయాలనీ కోరారు. వైఎస్ జగన్ ఎన్నో కష్టాల మధ్య పాదయాత్ర చేస్తున్నారని, రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ఇందుకోసం ప్రతి ఎన్నారై ఓటు వేసేందుకు ఏపీ వెళ్ళాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన, ప్రజలు మద్దతు తెలుపుతున్న తీరు చూసి రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అనిల్‌కుమార్ యాదవ్, కోన రఘుపతి, పార్టీ సీనియర్ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్ ఖాన్, స్టేట్ సెక్రటరీ వరప్రసాద్ రెడ్డి అరిమెండ, ఎన్ఆర్ఐ ఇండియా సమన్వయ కర్త హర్షవర్ధన్ రెడ్డి, ఎన్ఆర్ఐ అమెరికా కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, శశాంక్ అరమడక, రాంగోపాల్ దేవపట్ల, మినాడ్ అన్నవరం, ప్రసన్న కాకుమాని, సుదర్శన దేవిరెడ్డి, శౌరిప్రసాద్, సుజీత్ లతో పాటు స్థానిక నాయకులూ పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్ఆర్ఐలు ఇండియా నుంచి వచ్చిన నాయకులను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. -
డల్లాస్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సావాలను అమెరికాలోని ప్రవాసాంధ్రులు డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు మహానేతకు నివాళులు అర్పించారు. రాజన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరితోను ఆప్యాయంగా ఉంటారని వైఎస్సార్‌తో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయిన వైఎస్ జగన్ రూపంలో అందరితో ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్లాగే విలువలకు కట్టుబడి ఉంటారని, పార్టీలో అందరిని సమానం చూస్తారని చెప్పారు. చిన్నా పెద్ద భేదం లేకుండా వైఎస్ జగన్ అందరినీ అన్నా అని ఆప్యాయంగా పిలుస్తారని అన్నారు. టీడీపీ, బీజేపీ, పవన్ కలిసి పోటీ చేస్తే, వైఎస్ జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరం అయ్యారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుయుక్తులు ఎత్తుగడలు పనిచేయవని, ప్రజా తీర్పు ముందు తల వంచక తప్పదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ దివంగత నేతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్తపై అక్రమ కేసులు బనాయించినప్పుడు, తన నియోజక వర్గంలో ప్రమాదం జరిగినప్పుడు మహానేత తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకొని వచ్చి కష్ట సమయాల్లో అండగా ఉన్నారని అన్నారు. అనంతరం కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన గొప్పనేత వైఎస్ఆర్ వెల్లడించారు. ఎన్నికల్లో గెలవడం కోసం వైఎస్ జగన్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి ఇష్ట పడలేదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురించేసిందని విమర్శించారు. పార్టీ కేడర్‌ను నాశనం చేయాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ పక్క పార్టీ నుంచి వచ్చినా తనను అమ్మలా ఆదరించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. ఒకప్పుడు దుర్యోధనుడు, ఇప్పడు చంద్రబాబు ఇద్దరూ ఒకటేనని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ ధైర్యంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. సొంత రాష్ట్ర ప్రజలను రౌడీలుగా చిత్రీకరించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. డబ్బు, పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ఇన్చార్జ్ హఫీజ్ ఖాన్, శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజలతో నిరంతరం మమేకం అవుతున్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు ఖాయమని అన్నారు. అనంతరం పద్మజ నిరనల్లి మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమగ్రతకు, నిజాయితీకి ప్రతిరూపమని చెప్పారు. వైఎస్సార్ లాగే వైఎస్ జగన్ పెద్దలను గౌరవించడంలో ముందుంటారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలదోయడానికి వైఎస్ జగన్ అనే బాణాన్ని ఎక్కుపెట్టాలని అన్నారు. లాయర్ పత్రిక ఎడిటర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న పత్రిక ఎడిటర్‌తో వైఎస్ఆర్ చాలా సమయం గడిపారని, ఏ ఒక్క సీఎం ఇలా మనస్పూర్తిగా ప్రజలకోసం పనిచేయలేదని కితాబిచ్చారు. వైఎస్సార్ లాగే వైఎస్ జగన్ గొప్ప నాయకుడని అన్నారు. వైఎస్ జగన్ ఏపీకి మాత్రమే నాయకుడు కాదని, 2024 ఎన్నికల్లో తెలంగాణలో కూడా విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కోన రఘుపతి, పార్టీ సీనియర్ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, లక్ష్మీపార్వతి, కర్నూలు సమన్వయ కర్త హఫీజ్ ఖాన్‌లతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రమణారెడ్డి కృష్టపాటి, కృష్ణారెడ్డి కోడూరు, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, రమణ పుట్లూరు, మణి అన్నపురెడ్డి, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ రెడ్డి జొన్నాల, సునీల్ దేవిరెడ్డి, ఓబుల్ రెడ్డి శ్రీనివాస రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. -
మెల్బోర్న్లో ర్యాలీ, సిడ్నీలో సభ
నరసరావుపేట/నందిగామ : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నివాసముంటున్న కృష్ణా జిల్లా నందిగామ పట్టణానికి చెందిన శాఖమూరి రాజేష్ ఆధ్వర్యంలో అక్కడి తెలుగు వారు ర్యాలీ నిర్వహించారు. పలు కుటుంబాలకు చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అక్కడి షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జెండాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మరో వైపు సిడ్నీలో వైఎస్సార్ యువసేన నాయకులు భవనం భార్గవరెడ్డి, సి.సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు సుమారు 100 మంది ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో జగన్ యువసేన మెల్బోర్న్ ప్రాంత ఆర్గనైజర్ సూర్యనారాయణరెడ్డి, మామిడి కౌశిక్ రెడ్డి, ప్రకాష్‌నాయుడు, షేక్ అన్సారీ, ముదియాల నిరంజన్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, నరేందర్ కొక్కొండ, భార్గవ్ రెడ్డి, గోపి, ఫణి, దేవరపల్లి శివ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆస్ట్రేలియాలోని తెలుగు వారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, షేక్ ముస్తఫాలు మాట్లాడుతూ వైఎస్ జగన్ సంకల్ప యాత్రకి మద్దతు తెలిపిన ఆస్ట్రేలియాలోని తెలుగువారు అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. జగన్‌కు మద్దతుగా సిడ్నీలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు -
ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు
ఇలాంటి హరికేన్ చూడలేదు ఇర్మాపై ఫ్లోరిడాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు వెల్లడి తాత్కాలిక షెల్టర్‌లో బాధితులు సాక్షి, కర్నూలు (హాస్పిటల్): అమెరికాలోని ఫ్లోరిడాను వణికించిన హరికేన్ ఇర్మా లాంటి దానిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇర్మా హరికేన్ తాకిడి సమయంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెల్టర్‌లో పలువురు తెలుగువారు తలదాచుకున్నారు. వారిలో ఒకరైన కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలోని బి.తాండ్రపాడుకు చెందిన రైతు భూపాల్‌రెడ్డి కుమారుడు హరీష్ ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంప పట్టణంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విశ్వరూపం చూపిన హరికేన్ సోమవారానికి శాంతించినా.. షెల్టర్‌లో ఉన్న వారిని ప్రభుత్వం ఇంకా బయటకు పంపడం లేదని హరీష్ తెలిపారు. రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు పునరుద్ధరించిన తర్వాతే షెల్టర్ల నుంచి బయటకు వెళ్లాలని అమెరికా ప్రభుత్వం సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. హరికేన్ ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదని తెలిపారు. -
ఫ్లోరిడాలోని తెలుగువారు ఏమన్నారంటే..?
-
ప్రత్యేక హోదాపై ఎన్నారైల సెల్ఫీ వీడియోలు
-
ప్రత్యేక హోదాపై ఎన్నారైల సెల్ఫీ వీడియోలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై హామీయిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. హోదాపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ఏపీ సర్కారు మిన్నకుండిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర శంఖం పూరించారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని విదేశాల్లోని తెలుగువారు వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎన్నారైలు తమ సెల్ఫీ వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను 'సాక్షి'తో పంచుకున్నారు. -
ఏపీ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం న్యూజెర్సీలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని నగరమైన అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రఅభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్నారైల ఆందోళన