
మెల్‌బోర్న్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్ జగన్ అభిమానులు
నరసరావుపేట/నందిగామ : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివాసముంటున్న కృష్ణా జిల్లా నందిగామ పట్టణానికి చెందిన శాఖమూరి రాజేష్ ఆధ్వర్యంలో అక్కడి తెలుగు వారు ర్యాలీ నిర్వహించారు. పలు కుటుంబాలకు చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అక్కడి షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జెండాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.
మరో వైపు సిడ్నీలో వైఎస్సార్ యువసేన నాయకులు భవనం భార్గవరెడ్డి, సి.సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు సుమారు 100 మంది ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో జగన్ యువసేన మెల్‌బోర్న్ ప్రాంత ఆర్గనైజర్ సూర్యనారాయణరెడ్డి, మామిడి కౌశిక్ రెడ్డి, ప్రకాష్‌నాయుడు, షేక్ అన్సారీ, ముదియాల నిరంజన్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, నరేందర్ కొక్కొండ, భార్గవ్ రెడ్డి, గోపి, ఫణి, దేవరపల్లి శివ పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆస్ట్రేలియాలోని తెలుగు వారిని ఉద్దేశించి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, షేక్ ముస్తఫాలు మాట్లాడుతూ వైఎస్ జగన్ సంకల్ప యాత్రకి మద్దతు తెలిపిన ఆస్ట్రేలియాలోని తెలుగువారు అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.
జగన్‌కు మద్దతుగా సిడ్నీలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు
Comments
Please login to add a commentAdd a comment